✨💫⚡️ *క్రిస్మస్* ⚡️💫✨
(తొమ్మిదవ భాగము)
💮 *గొర్రెల కాపరులు* (4)
👉 అత్యంత అనాగరికులు, కాని, ప్రప్రధమంగా రక్షకుని చూచిన ధన్య జీవులు.
👉 దూతలు తరువాత, యేసును చాటిన ప్రప్రధమ సువార్తికులు.
దూత చెప్పిన "రక్షకుడు పుట్టాడు" అనే, ఒక చిన్న సువార్తమానమునకు వారియొక్క ప్రతిస్పందన, బండబారిన మన రాతిహృదయాలకు గొప్ప
ఆధ్యాత్మిక పాటం.
*వారు చూచి, యీ శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి*. (లూకా 2:17)
♻️ *గొర్రెల కాపరులు సువార్తికులుగా మారిపోయారు.*
ఏ బైబిల్ కాలేజ్ లో తర్ఫీదు పొందారు? అసలు అప్పటికి బైబిలే లేదు. ఇక బైబిల్ కాలేజ్ ఎక్కడ? అట్లా అని వీళ్ళకు చట్ట సభలలో మాట్లాడిని అనుభవం ఉందా? అదీ లేదే?
వారు పొందుకున్న సమాధానం ఆయనను ప్రకటించకుండా వుండనీయలేక పోయింది.
దూత ఏ విషయమైతే చెప్పిందో? వారు వెళ్లి ఏమయితే చూసారో వాటిని గురించి ప్రచురించడం మొదలు పెట్టారు.
మనమయితే దేనిగురించి అయినా ధారాళంగా మాట్లాడతాం. దేవుని గురించి తప్ప. దేవునిని గురించి మాట్లాడడానికి నాకు ప్రసంగించడం రాదనీ, పాటలు పాడడం రాదనీ... ఇట్లా అనేకమైన సాకులు చెప్తాము. మన దృష్టిలో వారే సువార్త చాటేవారు.
కాని ఒక్క విషయం! ఈ చిన్న వర్తమానం నీ స్నేహితులకు పంపించే నీవుకూడా ఒక సువార్తికుడవే. ప్రసంగించేవారు, పాడేవారు కోకొల్లలు. వీరిలో చాలా ఎక్కువ మంది ప్రసంగించే వారుగా, పాడే వారుగా మాత్రమే వుంటారు తప్ప, అనుసరించేవారుగా మాత్రం వుండరు. నీ మాటలు, నీ ప్రసంగాలు, నీ పాటల కంటే నీ జీవితమే (క్రియలు) ఒక సువార్త కావాలి.
డి.యల్. మూడి అనే దైవజనుడు ఇట్లా చెప్పారు. "ప్రతీ వంద మందిలో ఒకరు బైబిల్ చదివితే, మిగిలిన తొంబై తొమ్మిది మంది బైబిల్ చదివే వారిని చదువుతారు." అంటే నీ జీవితమే ఒక బైబిల్ కావాలి. నీ జీవితాన్ని చదివితే క్రీస్తు గురించి తెలియాలి.
"యేసు" అనే పేరు తెలియని వారు ఈలోకంలో ఎందరో వున్నారు. వారికి ప్రకటించ వలసిన భాద్యత నీమీద వుంది. నీవు వెళ్ళ లేకపోతే? వెళ్ళే వారికొరకు ప్రార్ధించు. వారికి సహకరించు. ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి