ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్ (ఎనిమిదవ భాగము)

💫✨⚡️ *క్రిస్మస్* ⚡️✨💫
          (ఎనిమిదవ భాగము) 

*గొర్రెల కాపరులు*(3):

దూత చెప్పిన  "రక్షకుడు పుట్టాడు" అనే, 
ఒక చిన్న సువార్తమానమునకు గొర్రెల కాపరుల యొక్క ప్రతిస్పందన. 

*త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి*. లూకా 2:16

నిదానమే ప్రధానం అనికాకుండా, 
ఆలస్యమైతే అమృతం సహితం విషమవుతుంది అన్నట్లుగా......  వర్తమానము వారికందిన వెంటనే ప్రతిస్పందించారు. వెళ్ళిపోయారు. 

🔸ప్రాణముగా ప్రేమించే గొర్రెలను ఏమి చేసారు? ఎవరికి అప్పగించారు? లోక పాపములు మోసే గొర్రెపిల్లే  ఈ లోకానికే వస్తే? ఇక ఈ గొర్రెలకోసం ఆలోచించలేదేమో? 

🔸నిజమైన గొర్రెల కాపరి, ప్రధానకాపరి యొక్క తలంపులతో వారి గొర్రెలు గుర్తురాకుండా పోయాయేమో? 

🔸మా కంటేముందు ఆయనను మరెవ్వరూ చూడకూడదు, ఆరాధించకూడదు అనుకున్నారేమో? 

ఎక్కడి వాటిని అక్కడ విడచిపెట్టి పరుగులు తీసారు. కారణం? వారి ఆశ ఒక్కటే? ఆయన్ని చూడాలి. 
ఆయన్ని ఆరాధించాలి. గొర్రెల కాపరుల జీవితాలు నీ, నా జీవితానికి గొప్ప ఆధ్యాత్మిక పాటం. దేవుడన్నా, దేవుని మాటలన్నా? దేవుని మందిరమన్నా? ఇట్లాంటి ఆశ మనలో లోపించింది కదా? 

ఎందుకో? దేవుని విషయాలంటే అంత వేగంగా స్పందించలేకపోతున్నాం కదా? కారణం ఏమయ్యుంటుంది? ఆ ప్రియరక్షకుని గొప్పతనం మనకింకా అర్ధం కాలేదా? ఆయన త్యాగం మనకు చులకనయ్యిందా? 

ఇస్కరియోతు యూదా యేసు ప్రభువారిని అప్పగించడానికి రోమా సైన్యముతో కలసి వచ్చినప్పుడు, యేసయ్య అంటున్నారు. యూదా నీవు చేయబోవునదేదో త్వరగా చెయ్యి. అంటే? యేసయ్య మనకోసం ప్రాణం పెట్టడానికి త్వరపడుతున్నాడు. కాని, మనమైతే ఆయన త్యాగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయనకోసం త్వరపడలేకపోతున్నాం. 

ఇంతకీ, గొల్లల వలే ఆయనను ఆరాధించడానికి ఎక్కడికో వెతుక్కొంటూ వెళ్లనక్కరలేదు. ఆయనే వెతుక్కొంటూ నీ దగ్గరకి వచ్చాడు. సంవత్సరాల తరబడి నీ హృదయమనే తలుపునొద్ద నిలిచి తట్టుచున్నాడు. కనీసం ఇప్పుడైనా ఆ స్వరాన్ని విని,తలుపు తీసి, ఆయనను చేర్చికోగలిగితే? నీ జీవితం ధన్యమౌతుంది. ఆరీతిగా మన జీవితాలను 
సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...