ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిల్ ప్రకారము సృష్టి క్రమములో నాలుగో రోజు సూర్యుడు సృజింపబడ్డాడా...???.

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚



✳ *బైబిల్ ప్రకారము సృష్టి క్రమములో నాలుగో రోజు సూర్యుడు సృజింపబడ్డాడా...???...✍*


👉చాలా మంది బైబిల్ ని అర్ధం చేసుకోలేక తప్పుడు అర్ధాలు కల్పించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 

ఇప్పటి క్రైస్తవులు చాలా మంది బైబిల్ ఒక పుస్తకము లాగానే చదువుచున్నారు 
*కాని జ్ఞానం ఇచ్చే గ్రంధంలా చూడటం లేదు.*
👉 బైబిల్ జ్ఞాన గ్రంధం అయినప్పటికి దానిని చదివినంత మాత్రాన జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటే.  బంగారము కూడా అంత సులువుగా దొరకనప్పుడు బంగారము కంటే శ్రేష్టమైన బైబిల్‌లోని  జ్ఞానం మనకు ఎలా దొరికేస్తుంది.  
*బైబిల్ పరిశోధిస్తే జ్ఞానం దొరుకుతుంది.*
👉 మనకు లభిస్తున్న బంగారం ఏవరో త్రవ్వుతారు, ఏవరో శుద్ధి చేస్తారు, ఏవరో విక్రయిస్తారు, అప్పుడు మీరు కొనుగోలు చేసి ధరిస్తారు. 
*కాని బైబిల్ వున్న జ్ఞానం అలాంటిది కాదు. మీరే వెతకాలి, మీరే త్రవ్వాలి, మీరే శుద్ధి చేయాలి , మీరే ధరించాలి.*

👉బైబిల్ ని కథల పుస్తకం లాగానో న్యూస్ పేపర్ లాగానో చదివితే ఎమ్ అర్ధం కాదు.
*బైబిల్ ను దేవుని వాక్యం అని గుర్తించి మనస్సు పెట్టి చదివితే దేవుని మాటలు అర్థమవుతాయి...*

*బైబిలు ప్రకారము నాలుగో రోజు సృష్టిలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల ప్రస్థావన కనిపించుచున్నది.*
👉 సృష్టి క్రమము తొలిరోజు భూమి ఏర్పడినట్లు (ఆదికాండము 1:-5) లేఖనము చెబుతున్నది.
👉దీనిని బట్టి భూమి ఏర్పడిన తరువాత సూర్యుడు ఆవిర్భావం కనిపిస్తుంది.

*సైన్స్ ప్రకారము సూర్యుడు ఏర్పడిన తరువాత భూమి ఏర్పడింది. అనగా, బైబిలులోని సృష్టి క్రమము సైన్స్ వివరణకు పూర్తి విరుద్ధమనే అభిప్రాయం కలుగుతున్నది. ఇది ఎంతవరకు వాస్తవమో చూద్ధాం.*

"దేవుడు-పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, ఆవి సూచనలను, కాలములను,దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని, రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను."

 👉పై వాక్యము సృష్టి క్రమము నాలుగో రోజును వివరించుచున్నది. 

👉అదే రోజు సూర్యుడు, చంద్రుడు ఏర్పడియున్నారా?లేక అంతకు ముందుగానే ఏర్పడియున్నారా అనే విషయమును ముందుగా నిర్ధారించుకున్నాము. ఆ తరువాత నాలుగో రోజు ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాము. 
పై వాక్యములోని *"ఆ రెండు గొప్ప జ్యోతులు", "పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి",*

👉జ్యోతులు అనే వాక్యములు ద్వారా నాలుగో రోజు సృష్టి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల గురించిన ప్రస్థావన కనిపించుచున్నది. 
*"ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును"* అనే వాక్యములోని *'కలుగును'* అనే పదమును నిశితముగా పరిశీలించినట్లయితే సూర్యుడు, చంద్రుడి సృష్టి గురించి గ్రహించవచ్చును. ఆ వాక్యములోని'కలుగును' అనే పదము 'కనిపించును' అనే అర్థము కోసం వాడబడినది. ఇంగ్లీషు బైబిలునందు ఈ వాక్యమును పరిశీలించినట్లయితే 
*"Let great lights APPEAR in the sky"* అని ఉంటుంది.
🔹ఇందులో *appear* అను పదము *'కనిపించును',*
*గోచరమగును',* *'ప్రత్యక్షమగును'* అను సమానార్థములను సూచించును. 
👉అనగా గతంలో సృజింపబడిన సూర్య చంద్రులు, నక్షత్రాలను నాలుగో రోజున ప్రత్యక్షం కావాలని దేవుడు ఆజ్ఞాపించినట్లు అర్థమును ఇచ్చును.

*నాలుగో రోజు వరకు సూర్య, చంద్ర నక్షత్రములు ఎందుకు కనిపించలేదు అని లేఖనముల ద్వారా గ్రహింపలేకున్నప్పటికీ*
👉 అప్పటి వరకు అవి ఏమయ్యాయి? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఉన్నది. 

*అది, సూర్యుడిని మబ్బుచేత కప్పబడును,చంద్రుడు వెన్నెల కాయకపోవును* (యెహేజ్కేలు32:7), *నక్షత్రములను మరుగుచేయును* (యోబు9:7) అనునది.

 *మరుగైన వాటిని నాలుగో రోజు ప్రత్యక్షతపరచడమెందుకు?*
 అనే ప్రశ్నకు సమాధానము లభించును. 
*నాలుగో రోజు సృష్టిలోని ప్రధాన అంశాలను ఒక్కసారి ప్రత్యేకించి చూస్తే...*
 1.పగటిని రాత్రిని వేరుపరచునట్లు, 
2. సూచనలను, కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, 
3. భూమి మీద వెలుగిచ్చుటకు, 
4. పగటిని రాత్రిని ఏలుటకు అనే నాలుగు అంశాలు ప్రధానముగా కనిపించును. అవన్నీ ఒకే విషయమును స్పష్టము చేయుచున్నవి. *అదేమనగా ఖగోళ వస్తువులకు దేవుడు విధించుచున్న కట్టడ.*
 అది ఎలాగంటే?...
1. వెలుగు చీకటి వేరుపరచు: ఇది సూర్యడు,చంద్రుడు, నక్షత్రములకు అందించు కట్టడ.
2. సూచనలను, కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు: ఇది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములకు అందించు కట్టడ.
3. భూమి మీద వెలుగిచ్చు: ఇది సూర్యుడు,చంద్రుడికి అందించు కట్టడ.
4. పగటిని రాత్రిని ఏలు: ఇది సూర్యుడు,చంద్రుడికి, నక్షత్రములకు అందించు కట్టడ.
పై వివరణ ద్వారా సృష్టి క్రమము తొలి రోజు నాటి ఖగోళ వస్తువులను నాలుగో రోజు నాటికి ప్రత్యక్షపరచి వాటికి కట్టడలను విధించినట్లు గ్రహించగలము. 

అందుకే యోబు గ్రంథకర్త *"వాటి వాటి కాలములో నక్షత్ర రాసులు వచ్చునట్లు చేయగలవా?"* (యోబు 38:32), *"ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా?"* (యోబు38:33) అని పశ్నించియున్నాడు. 
👉ఆ పనిని దేవుడు చేసినట్లు చెప్పడం గ్రంథకర్త ఉద్దేశ్యము.

♻ *ఇక సైన్స్ ప్రకారము చూద్దాం...*

*సైన్స్ ప్రకారము:*
నాలుగో రోజుకు ముందుగానే సూర్యుడు ఉన్నాడని సైన్స్ పరంగా నిరూపించడానికి బైబిలులో లేఖన సాక్ష్యాలు బలంగానే చెప్పబడ్డాయి. సృష్టి క్రమములో మూడవ రోజు గడ్డి, మొక్కలు,వృక్షములు మొలవడం (ఆదికాండము 1:11)గురించి. సూర్యుడికి మరియు మొక్కలకు సంబంధం ఏమిటనే విషయము చాలా మందికి తెలిసే ఉంటుంది. మొక్కలు బ్రతకాలంటే కేవలం నీరు మాత్రమే కాదు, వాతావరణంలోని కార్బన్ డై యాక్సైడ్ (మనము ఆక్సిజన్ పీల్చినట్లు) అలాగే సూర్యరశ్మి కూడా కావాలి. సూర్య కిరణాలను గ్రహించి తమకు కావలసిన ఆహారము (గ్లూకోస్)ను తయారు చేసుకుంటాయి. 
*దీనినే వృక్షశాస్త్ర పరిభాషలో కిరణజన్య సంయోగ క్రియ అని అంటారు.*
 సూర్యరశ్మి లేకపోతే మొక్కలు బ్రతకలేవు. 
👉కాబట్టి అప్పటికే భూమి మీద వెలుగు,చీకటి మరియు పగలు, వెలుగు ఉన్నాయనే విషయాన్ని చెప్పడంతో పాటు మొక్కలు ద్వారా ఆ విషయాన్ని స్పష్టము చేయబడుతుంది.

*పై విషయాలన్నీ గమనిస్తే దేవుడు నాలుగవరోజున సూర్యుని, చంద్రున్ని, నక్షత్రాలను చేయలేదు గానీ ఆల్రెడీ అంతకుముందే ఉన్న వాటిని అవి ఎక్కడైతే మరుగున ఉన్నాయో వాటి లో నుండి బయటకు రప్పించాడు అని స్పష్టంగా అర్థమవుతోంది...*

👉అందుకే బైబిల్ ని లోతుగా అధ్యయనం చెయ్యాలి,
👉 పరిశోధించాలి,
👉దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని ప్రార్ధన పూర్వకంగా అడగాలి.

*లేదంటే బైబిల్ ఒక్క ముక్క కూడా అర్థం కాదు,ఇంకా పైనుండి లేనిపోని అపార్ధాలు కలుగుతాయి.*
👉అందుకే బైబిల్ ని లోతుగా అధ్యయనం చెయ్యాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...