❇️ — *సామెతలు* — ❇️
క్లుప్త ధ్యానములు ( Part: 17)
*నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. *
సామెతలు 3: 5,6
♻️ *నీ త్రోవలు సరాళము చేయబడాలంటే? *
1️⃣ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు
(నీ స్వంత జ్ఞానం కాదు. దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకో.)
2️⃣ *పూర్ణహృదయముతో దేవుని యందు నమ్మికయుంచు. *(సందేహం వద్దు)
3️⃣ *నీ ప్రవర్తనయంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకో!*
(దేవుని చిత్తమే నీ జీవితంలో జరగాలి)
♻️ *త్రోవలు ఎందుకు సరాళము చేయబడాలి? *
ఎందుకంటే? మనము నడిచే మార్గములో
🔸చీకటి త్రోవలు
🔸తడబడే అడుగులు
🔸దుర్మార్గం
🔸మూర్ఖత్వం
యివన్నీ తారసపడతాయి. వాటిలో పడకుండా మన మార్గాలు సరాళము (తిన్నగా) చేయబడాలి.
🌠 *చీకటి త్రోవలు:*
(యదార్థత లేదు )
చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. (సామె 2:13)
🌠 *తడబడే అడుగులు: *
(తడబడకుండా వుండాలంటే జ్ఞానమార్గం ఒక్కటే శరణ్యం)
జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థమార్గములో నిన్ను నడిపించియున్నాను. నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు. (సామెతలు 4:11,12)
🌠 *దుర్మార్గం:*
ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును. (సామెతలు 11:15)
🌠 *మూర్ఖత్వం:*
బుద్ధిలేనివానికి మూఢత సంతోషకరము. (సామెతలు 15:21)
♻️ *వీటినుండి తప్పించబడాలి అంటే?*
👉వెలుగైయున్న మార్గములో ప్రయాణించాలి.
*యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?* కీర్తనలు 27:1
దావీదు చెప్పిన మాటలను మనమునూ చెప్పగలగాలి.
🔸అది వెలుగైయున్న మార్గం
🔸అది తిన్నని మార్గం.
🔸నిజాయితీ, రుజువర్తన వున్న నడవడి.
🔸దేవుని దీవెనలతో నిండియున్న దారి
🔸అది దేవుని చెంతకు చేర్చే మార్గం
ఇది ధన్యకరమైన జీవితం. ఆయన చిత్తానికి తలవంచి, ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను అనుభవించుదము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి