✳ *ALL SOULS DAY. ఆత్మలపండుగ లేక చనిపోయిన వారిని మనము జ్ఞాపకము చేసుకోవచ్చ?...✍*
*"నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును"*
( సామెతలు 10:7).
👉తప్పకుండ మనము ప్రేమించిన వారు, మన సన్నితులు, ఈ లోకము విడిచినా మన వారిని కచ్చితంగా ఙ్ఞాపకం చేసుకోవచ్చు.
*కానీ సమాధులకెళ్లి కొవ్వొత్తులు వెలిగించి పూలదండలేసి వారికొరకు ప్రార్థించడమనేది దేవుని వాక్యమునకు లేఖనములకు విరోధమైనది.*
👉 చనిపోయిన వారి గురించి మనము ప్రార్థన చేసిన ప్రయోజనం ఉండదు.
👉ధనవంతుడు మరియు లాజరు గురించి బైబిలు ద్వార తెలుసుకున్న విషయమే. *మనము ఏ ప్రార్థనలు చేసిన వారు బ్రతికి యుండగానే చేయవలెను.*
👉 ఒకవేళ మనము చనిపోయిన వారి కొరకు ప్రార్థించిన అట్టి ప్రార్థన దేవుడు వినడు.
♻ *ఈ విశయములో దేవుని వాక్యము ఏమి బోధిస్తుందో జాగ్రత్తగా చదివి ధ్యానించి అర్థం చేసుకుందాము. దయచేసి వాక్యాలు చదవుదాం.*
ప్రసంగి 12 : 7
*మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును.*
దేవుడు నిర్ణయించిన సమయము ప్రకారము *హెబ్రీయులకు 9 :7.* ఒక వ్యక్తి ఆయన పిలుపు అందుకొని నిద్రించినప్పుడు ఆ వ్యక్తి యెక్క శరీరము సమాధిలో మన్నైయ్ పోతుంది కాని అతని ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది.
*ఆదికాండము 3 : 19.*
👉 సమాధిలొ మనకు మట్టి మాత్రమే ఉంటుంది కాని ఆ వ్యక్తి క్రీస్తును వెంబడించి ఉంటె ఆ వ్యక్తి ప్రభువు రాజ్యములో ఉంటాడు.
*ఈ క్రింద వాక్య వచనములను చదువండి.*
మత్తయి సువార్త,8 :12
*రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.*
లూకా సువార్త 16 : 22–23
*ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.*
23. *అప్పుడతడు పాతా ళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రా హామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి.*
ప్రసంగి, 9 : 5–6
*బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు.*
6. *వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు.*
♻ *ప్రియులార మనము చదివిన పై లేఖనా వచనాల ప్రకారము. చనిపోయినవారు ఇక మరువబడ్డారనియు, వారికమీదట ప్రేమింపబడరనియు, ద్వేషింపబడరనియు, సూర్యుని క్రింద భూమి పైనా వారికి ఎటువంటి పాలు లేదని సెలవిస్తున్నది.*
*"నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును"*
( సామెతలు 10:7).
నా ప్రియ స్నేహితులారా...
*కొందరిని గూర్చుచేసుకున్నపుడు మన మనస్సుకు గొప్ప అనుభూతి కలుగుతుంది. వారి మాటలు, వారి క్రియలు, వారి భక్తి జీవితము, వారి విశ్వాసపు నడక, వారి దైవిక ఉపదేశక్రమము...అన్నిటికి మించిన వారి సాక్ష్యము.మనలను కదిలిస్తాయి, మనలను ఉజ్జీవింపజేస్తాయి, మనకి మార్గనిర్దేశం చేస్తాయి.*
👉మనలో ప్రతి ఒక్కరి జీవితాలలో ఎవ్వరో కొందరు ఇలాంటి వారు తప్పక ఉంటారు.
*వారిని జ్ఞాపకముచేసుకోన్నప్పుడు ఎంతో ఆశీర్వాదకరమగు అనుభూతి మనకు కలుగుతుంది.*
రోమా పత్రిక 3:24....
*"కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు"*
విశ్వసించినవారు, క్రీస్తునందు ఉన్నవారు క్రిస్తులో ఉన్న విమోచనం ద్వారా... విమోచించబడి, ఉచ్చితముగానే నీతిమంతులుగా మారుతున్నారు.
నాప్రియ స్నేహితులారా...
👉 *ఎవ్వరు నీతిమంతులు...?* అని అడిగితే...
🔹విశ్వసించిన వారు నీతిమంతులు, క్రీస్తులో ఉన్నవారు నీతిమంతులు.
( రోమా పత్రిక 3:24 ).
👉 *ఎవ్వరు నీతిమంతులు...?* అని అడిగితే...
🔹"యేసుక్రీస్తువారి రక్తముతో కాడగబడిన వారు నీతిమంతులు"
( రోమా పత్రిక 5:9 ).
👉 *ఎవ్వరు నీతిమంతులు...?* అని అడిగితే...
🔹 "దేవుని ఆత్మద్వారా పరిశుద్ధపరచబడిన వారు నీతిమంతులు"
( 1 కోరింధి 6:11 ).
👉 *ఎవ్వరు నీతిమంతులు...?*
అని అడిగితే...
🔹 "విశ్వాసపు క్రియలు కలిగినవారు వారు నీతిమంతులు"
( యాకోబు 2:25 ).
👉ఇలాంటి వారిని మనం జ్ఞాపకము చేసుకున్నప్పుడు వారు వారివారి జీవిత అనుభవాలను బట్టి మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తారు. అవి అన్ని మనకి ఆశీర్వాదకరమగును.
లోకమును, లోకస్తులను జ్ఞాపకము చేసుకోవటము వాల్ల మేలైన ప్రయోజనము ఏమివు ఉండదు.
వారు మనకి ఏమి మంచి నేర్పిస్తారు... అందుకే... దుష్టుల ఆలోచనలు వినవద్దు అని, వారు కూర్చున్న చోట కుర్చోవద్దు అని వాక్యం హెచ్చరిస్తుంది. ( 1వ కీర్తన ).
గమనించండి...
*"నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును"*
👉అవును... *" భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును "* అందుకే, భక్తిహినుల పేర్లు జీవగ్రంధంలో వ్రాయటానికి కూడా దేవుడు ఇష్టపడరు. భక్తిహీనుల పేర్లు దేవునికే అంత అసహ్యత పుట్టింస్తాయి.
నా ప్రియ స్నేహితులారా...
*"నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకరమగును"*
🔹 విశ్వాసులను జ్ఞాపకము చేసుకోండి,
🔹యేసురక్తముతో కడుగబడినవారిని జ్ఞాపకము చేసుకోండి,
🔹ఆత్మ నింపుదలగల వారిని జ్ఞాపకము చేసుకోండి,
🔹 విశ్వాసపు క్రియలుగల వారిని జ్ఞాపకము చేసుకోండి -
👉 *అలాంటి వారు మనలను కదిలిస్తారు, మనలను ఉజ్జీవింపజేస్తారు, మనకి మార్గనిర్దేశం చేస్తారు.*
*ఎందుకంటే చనిపోయిన వారి గురించి మనము అప్పుడప్పుడు ఙ్ఞాపకం చేసుకోవడముకంటె మనమేమియు చేయలేము.*
*మృతులను ఙ్ఞాపకం చేసుకోవడం లేఖనాల ప్రకారం సరైనదే,*
👉 *కాని సమాధులకెళ్లి కొవ్వొత్తులు వెలిగించి పూలదండలేసి వారికొరకు ప్రార్థించడము విగ్రఆరాధనకు సమానము. దయచేసి ఈ విషయము సరైనదో కాదో ఆలోచిద్దాము.*
👉ఇప్పటి వరకు మనము తెలియక చేశాము కాబట్టి, పశ్చాత్తాపముతో ప్రభువును క్షమాపణ కోరినయడల ఆయన మనలను క్షమించును. ఇకమీదటనైనా ఇటువంటివి చేయక వాక్యానుసారంగా జీవిద్దాం.
యిర్మీయా 22 : 10
*చనిపోయినవానిగూర్చి యేడవవద్దు, వానిగూర్చి అంగ లార్చవద్దు; వెళ్లిపోవుచున్నవానిగూర్చి బహు రోదనము చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు.*
👉కాబట్టి ప్రియులార,
🔹 *బ్రతికిన వారిగురించి ఆలోచిద్దాం,*
🔹 *ప్రేమిద్దాం,*
🔹 *గౌరవిద్దాం,*
🔹 *మంచిగా వారికి ప్రేమను పంచుదాం.*
👉ఇప్పటి వరకు మనము తెలియక చేశాము కాబట్టి, పశ్చాత్తాపముతో ప్రభువును క్షమాపణ కోరినయడల ఆయన మనలను క్షమించును. ఇకమీదటనైనా ఇటువంటివి చేయక వాక్యానుసారంగా జీవిద్దాం.
పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీ నామమునకు వందనములు చెల్లిస్తున్నాము. ఇప్పటివరకు మాకు తెలియక చేసిన తప్పులను క్షమించి ఇకమీదట ఇటువంటి తప్పులు చేయకుండునట్లు బ్రతకిని వారిని మేము గౌరవించి ప్రేమించేలాగానా సహాయము చేయమని యేసు క్రీస్తు నామములొ ప్రార్తిస్తున్నాము తండ్రి
*ఆమేన్*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి