ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కాపరులకు ఛార్లెస్ ఫిన్ని యిచ్చిన సలహాలు*

♻️ *కాపరులకు ఛార్లెస్ ఫిన్ని యిచ్చిన సలహాలు*✳️
💐💐💐💐💐💐💐💐💐💐💐
👉1 సువార్తను క్రీస్తువలె ప్రేమించి ప్రకటించుడి.(రోమా 2:16)

👉2. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొంది సేవ చేయండి.(అపొ 1:4,8)

👉3.మీ పిలుపు, వాక్యజ్ఞానం తలకు గాక హృదయానికి చెందినదై యుండ నీయండి.(యెష61:1-3)

👉4.దేవునితో కలిసి నడవండి, పనిచేయండి. (యోహాను 5:19,20,30)

👉5.మోకరించి బైబిలు చదవండి. ఆత్మ వెలుగు కోసం కనిపెట్టండి.(కీర్త119.105-130)

👉6.వ్యాఖ్యానాల మీద ఆధారపడవద్దు. పరిశుద్ధాత్మ సహాయంతో మీ ఆత్మలో వివేచించండి. తరువాత అవసరాన్ని బట్టి వాటిని చూడండి.
(1యోహాను 2:20; 5:20, యోహాను 14:26, 16:13)

👉7.తలంపు. తీర్మానం, అనుభూతి, మాట, క్రియల్లో పరిశుద్దులుగా ఉండండి.(1 తిమోతి 4:11-12)

👉8.పాపుల పట్ల ప్రేమ, కనికరము కలిగి, వారి రక్షణకై ఆసక్తి కలిగియుండండి.(మార్కు 6:34).

👉9.ఆత్మల రక్షణార్ధమై ప్రాణం పోగొట్టుకొనుటకైనను సిద్ధపడండి.(అపొ 20:24)

👉10. ఏలాగు ఆత్మల్ని రక్షించగలను, పెంచగలను? అనే అంశాలను, పద్ధతులను రేయింబగళ్ళు అద్యయనం చేయండి. (రోమా 1:14, 15; 1 కొరింథీ 11:28)

👉11. దేవుడు నిన్ను తన సేవకు పిలిచాడు గనుక, ఆ పనికి అవసరమైన శక్తి,సరంజామా అంతా ఇమ్మని దేవుని గోజాడండి. (రోమా 8:32).

👉12. నీ సంఘస్థులందరితో మాట్లాడి వారు రక్షణ పొందారో, లేదో తెలుసుకోండి.అంతేకాదు, వారి హృదయాన్ని తెలుసుకొని వారు రక్షణ పొందేలా చేయండి.మొహమాటం, నిర్లక్ష్యం ప్రమాదకరం. (1 సమూయేలు 9:25-27; 10:9)

🙏13. దేవుని పనులు తేలిక భావంతో చేయడానికి చూడక, భారం గల నిర్వాహకుడిగాపనిచేయి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు.(యిర్మీయా 48:10)

👉14.ప్రసంగవేదిక పైన, బయట కూడా ఒక్కలాగే మాట్లాడు. అప్పుడే నీ మాటలుప్రజలు వెలగట్టి అంగీకరిస్తారు.(మత్తయి 5:19)

👉15. నీ బోధ నీ జీవితంలో తప్పక సార్థకం కావాలి.

👉16. స్త్రీలతో మాట్లాడేటప్పుడు నీ పవిత్రతను కాపాడుకో! లేశమాత్రమైనా అపవిత్రత అంటనీయకు.

👉17. నీ బలహీనతల్ని కప్పిపెట్టుకొనక దేవుని కృపతో సరిచేసుకో!

👉18. సహజంగా నీలో కలుపుగోలుతనం లేకుంటే, ఆయన కృప ద్వారా అలవర్చుకో!

👉19. నీవు ఎవరివో అలాగే జీవించు. అప్పుడు ఇతరులను నమ్మించే బాధ ఉండదు.

👉20. నిరాడంబరత, యథార్థత నీ జీవిత చిహ్నాలుగా ఉండనివ్వు!

👉21.రోజూ దేవునితో ముఖాముఖిగా సంభాషించు! అదే నీ సేవకు కావలసిన శక్తి దానికి సాటియైనది మరొకటి లేదు. ఇలా చేయలేకపోతే నీవు అందరిలో బలహీనుడవే!

👉22 .వాక్య భావాన్ని నిర్ణయించి, బోధించడానికి పరిశుద్ధాత్మకు పూర్తి అధికారం యివ్వు

👉23. ప్రతి ప్రసంగం హృదయం నుండి పుట్టనీ; తల నుండి కాదు.

👉24. అనుభవజ్ఞమైన బోధ కావాలి. చదివి తిరిగి వల్లించడం కాదు.

👉25. పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఉంచిన భారాన్ని బట్టి మాత్రమే బోధించు!

👉26. ప్రతి ప్రసంగానికి ముందు ప్రసవ వేదనతో ప్రార్థించు!

👉27. నీ హృదయం వాక్యాలతోను, క్రీస్తు ప్రేమతోను నిండిపోనీ! అప్పుడు భారంతో మాటలు వస్తాయి.

👉28. మనుష్యులకు కాక దేవునికి భయపడి, నిర్మొహమాటంగా వాక్యాన్ని చెప్పు!అప్పుడు నీవు దేవునికి భయపడేవాడవని సంఘం అర్థం చేసుకొంటుంది.

👉29. నీ పేరు ప్రఖ్యాతులు నీ ప్రసంగానికి అడ్డు రానియ్యకు!

👉30. నీ జీవితం, సంఘం యొక్క అంగీకారం, ఆగ్రహం ఇవేమీ నీ ప్రసంగాన్ని అడ్డగించనీయకు!

👉31. నీ ప్రజల్ని నీవు నిజంగా గద్దిస్తే నీ విలువ తగ్గదు గాని పెరుగుతుంది. నీవు వెనుకాడితే వారు నశిస్తారు. నీవు లెక్క అప్పగించాలి!

👉32. నీ బోధ, జీవితం ప్రతి మనిషి మనస్సాక్షిని తాకాలి. ఇది దేవుని చిత్తం!

కామెంట్‌లు