ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎస్తేరు గ్రంథ వివరాలు

-ఎస్తేరు  గ్రంధము;-క్లుప్త వివరణ 🌟
💐💐💐💐💐
గ్రంథ విశేషము-4 మాటల్లో
♦️♦️♦️♦️♦️♦️♦️
💎 *1 ) దేవుడు అనిగాని, ప్రభువు అనిగాని, యెహోవా అనిగాని, ఒక్క మాటయైనను లేని గ్రంధము ఈ ఎస్తేరు గ్రంధము*

💎 *2 ) దేవుని పేరు చెప్పకనే యూదులకు కలిగిన రక్షణను గూర్చి గొప్పగా తెలియచేస్తూ, దేవునికి గొప్ప మహిమ చూపించుచున్న గ్రంధము ఎస్తేరు గ్రంధము*

💎 *3 ) ఒక వ్యక్తిని దేవుడు ఎందునిమిత్తము హెచ్చించి ఆ స్థానములో నిలబెడతాడో, ఆపని చేయవలెనన్న మాటను గుర్తుచేసే గ్రంధము ఎస్తేరు గ్రంధము*

💎 *4) దేవుని సంకలవుచొప్పున ఏర్పరచ బడినవారికి మేలుకలుగుటకై సమస్తము సమకూడి జరిగించబడును అనే వాక్యము ఈ గ్రంధములో చాలా చక్కగా నెరవేరినది*

🌟 ఎస్తేరు యొక్క హెబ్రీ పేరు హదస్సా అనబడును (ఎస్తేరు 2:7) పారసీక మాటయైన ఎస్తేరు అనగా నక్షత్రము అని అర్థమునిచ్చును స్టారా అను పారసీక మాటలో నుండి ఉద్భవించినది. గ్రీకు భాషలో గ్రంథము యొక్క పేరు ఎస్తేరు అని యుండగా లాటిన్ భాషలో హెష్టర్ అనియున్నది.

🔖 ఉద్దేశము : 
♦️♦️♦️♦️♦️
తన ప్రజలను గూర్చిన దేవుని అధికారము, ప్రేమ, బాధ్యత అనునవి బయలుపరచుట*

📝 *గ్రంథకర్త : 
⭐⭐⭐⭐⭐
మొర్దెకై గా* (ఎస్తేరు 9:29) (రచనా శైలిని తీసికొని యీ పుస్తకమును ఎజ్రాయో, నెహెమ్యానో వ్రాసియుండవచ్చు అని అభిప్రాయపడువారున్నారు.)

⏳ కాలము : 
♻️♻️♻️♻️♻️♻️
అహష్వేరోషు యొక్క పరిపాలనా కాలము క్రీపూ 486 నుండి క్రీపూ 464 వరకు. రాజు ఏర్పాటు చేసిన విందు ఆయన పాలన యొక్క మూడవ సంవత్సరము (ఎస్తేరు 1:3) గ్రంథము యొక్క 3 నుండి 10 వరకు గల అధ్యాయములలో వివరించు కార్యక్రమములు జరిగినవి క్రీపూ 483 నుండి 473 వరకు గల 10 సంవత్సరముల కాలపరిమితిలో జరిగినవి. (ఎస్తేరు 3:7-12) 
💠 అహష్వరోషు చనిపోయిన సంవత్సరమైన క్రీ.పూ. 464 తరువాత దానికి సమీప కాలములో ఎస్తేరు గ్రంథము మొర్దకై ద్వారా వ్రాయబడి యుండ వచ్చును. 

❇️ తమ స్వదేశమునకు తిరగి వెళ్లక, పారసీక దేశములో జీవించుచున్న యూదుల ఉపయోగము కొరకై వ్రాయబడిన గ్రంథము ఇది. దైవభక్తులైన యూదులందరు పాలస్తీనమునకు తిరిగి వెళ్లలేదు. ఈ రీతిగా చెరనివాసము కొనసాగించ తీర్మానించి జీవించిన వారికొరకు దేవుడు వారియందు దృష్టించియున్నాడు. వారిని కూడా పరామర్శించువానిగా యున్నాడనునది. ఈ గ్రంథము తెలుపుచున్నది.

👉*పూర్వ చరిత్ర* : 
♦️♦️♦️♦️♦️♦️♦️
పరిశుద్ధ గ్రంథములో నెహెమ్యా తర్వాత ఎస్తేరు గ్రంధము వచ్చినప్పటికిని నెహెమ్యా కార్య క్రమములకు 30 సంవత్సరములకు ముందే ఎస్తేరు కార్య క్రమములు జరిగినవి. ఈ కార్యములు జరిగిన స్థలము పారసీక సామ్రాజ్యము యొక్క రాజధానియైన షూషనులోను, చక్రవర్తి అంతఃపురములోను జరిగినవి.

👸*ముఖ్య మనుష్యులు* : 
🔸🔸🔸🔸🔸🔸🔸
ఎస్తేరు, మొర్దకై, అహష్వరోషురాజు, హామాను.

*ముఖ్య స్థలము* : 
🔺🔺🔺🔺🔺🔺
పారసీక షూషను అంతఃపురము

🥀 *విశేషము: స్త్రీల పేర్లలో కనబడు రెండు గ్రంథములలో ఇది యొక్కటి*. (రూతు మరియొక గ్రంథము) ఈ గ్రంథములో దేవుడు అనుమాట ఏమాత్రము ఉపయోగించబడలేదు. అయినను వీటి చర్యలన్నిటిలో దేవుని సన్నిధి ఎంతో తేటగా కనబడుచున్నది.

📖 *ముఖ్యవచనములు* : 
🌹 *ఎస్తేరు 4:14; నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కునుండి వచ్చును గాని, నీవును నీ తండ్రి యింటివారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను*

🌹 *ఎస్తేరు 8:17 రాజుచేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోష మును కలిగెను, అది శుభదినమని విందుచేసికొనిరి. మరియు దేశజనులలో యూదులయెడల భయముకలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి*

👉మొర్దెకై దేశములో రెండవ అధికారిగా హెచ్చింపబడుటను, ఆయన యూదులు యొక్క సంరక్షకునిగా మార్చబడుట చెప్పుచూనే ఈ గ్రంథము ముగియుచున్నది.

 🌷 *తెలియని రీతిగా జరిగినవని భావించు అనేక సంఘటనలు ఒక దండవలె ఐక్యపరచబడిన రీతిగా ఇచ్చుటయే ఈ గ్రంథము యొక్క విశేషిత వష్తి రాణి యొక్క మొండితనము ద్వారా ఆమె పదవి తొలగించబడినది. రాజు యొద్దకు తీసుకొని రాబడిన అనేక కన్యకలలో ఎస్తేరు రాణిగా ఎన్ను కొనబడుట, ఒక రాత్రి రాజు నిద్రలేక బాధపడుట ఆ రాత్రి రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని ఆజ్ఞాపించుట, మొర్దెకై రాజును కాపాడిన సంఘటన చదువుట తటస్థించుట, అదే సమయములో హామాను అచ్చటికి రావడము జరుగుట అను కార్యములన్నియు మానవదృష్టిలో తెలియని రీతిగా జరిగిన సంఘటనలు. దేవుని ప్రజల యొక్క జీవమంతయు దేవుని ఆధీనములోనున్నది. వారి జీవితములో ఏదియు తెలియని రీతిగా జరిగినవి కావు*

✡️ హామాను నుండి హిట్లర్ వరకు పగ తీర్చుకొను మనస్సు కలిగిన నాయకుల యొక్క ద్వేషమునకు గురియైన యూదుల వలె మరియొక ప్రజలు లోకములో వేరేలేరు. వేరే ఏ జనసమూహము ఆపధలను అధిగమించి జీవించుటకు ఇంత గొప్ప శక్తిని పొందలేదు.

*కొన్ని ముఖ్య వివరములు* : 
💥💥💥💥💥💥💥
పరిశుద్ధ గ్రంథము యొక్క 17వ గ్రంథము; అధ్యాయములు 10; వచనములు 167; ఆజ్ఞలు 11; ప్రశ్నలు 21; ప్రవచనములు లేవు; వాగ్దానములు లేవు, దేవుని యొద్ద నుండి విశేషమైన వర్తమానము లేదు.

గ్రంథ విభజన
♦️♦️♦️♦️♦️♦️
వష్తిరాణి పతనం 1:1-22

రాజు కోసం రాణిగా ఉండగల కన్యను వెదకడం 2:1-18

మొర్దెకై పరిచయం 2:5-11

ఎస్తేరు క్రొత్తరాణి అవ్వడం 2:5-18

మొర్దెకై రాజుకు విరుద్ధంగా జరుగుతున్న పన్నాగాన్ని గుర్తించడం 2:19-23

యూదులను చంపడానికి హామాను చేసిన పన్నాగం 3:1-15

హామానును ఓడించడానికి సహాయం చేయమని మొర్దెకై ఎస్తేరును కోరడం 4:1-17

రాజుకు ఎస్తేరు విన్నపాలు 5:1—9:17

మొదటి విన్నపం 5:1-6

రెండో విన్నపం 5:7-8

హామాను సంతోషం, కోపం, ప్రగల్భం,మొర్దెకైని చంపించడానికి ఏర్పాటు 5:9-14

రాజు మొర్దెకైని సన్మానించాడు 6:1-14

రాజుకు ఎస్తేరు చేసిన మూడో విన్నపం 7:1-6

హామాను పై దేవుని శిక్ష 7:7-10

అతి ఉన్నతమైన స్థానాన్ని రాజు మొర్దెకైకి ఇచ్చాడు 8:1-2

రాజుకు ఎస్తేరు చేసిన మరో విన్నపం 8:3-6

యూదులకోసం రాజు శాసనం 8:7-17

యూదుల జయం 9:1-17

ఎస్తేరు చివరి విన్నపం 9:13

పూరీము పండుగ 9:18-32

మొర్దెకై గొప్పతనం 10:1-3


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...