ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

షారోను పుష్పము

✳ *...షారోను పుష్పము...* ✳
       
 *"నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మమువంటిదానను. I am a rose of Sharon, a lily of the valleys. (పరమ 2:1)".*

👉 పరమ గీతాల పుస్తకం బైబిల్ లో 22వ పుస్తకం.
👉 సామాన్యులకు అర్ధం కాని గ్రంధాలలో ఇది ఒకటి. 
🔺దీనిని సోలోమోను పాట అని, వధూవరుల సంభాషణ అని అంటారు.  
🔺పురాతన ప్రాచ్య సాహిత్యాలంకార సహితమైన ఈ లఘు పద్య కావ్యము సలొమోను విరచితము.

 *యేసుక్రీస్తుకు సంఘానికి గల పవిత్ర స్నేహాన్ని  వివరించే మృదు మధురమైన సంభాషణ ఈ పాట.*
👉 ఇది కట్టు కధా? చారిత్రాత్మకమా? గొప్ప కళాకాండమా? రూపకాలంకారమా? అని రకరకాల ప్రశ్నలు వేసేవారు అనేకులు ఉన్నారు.  

👉ఈ పరమగీతలను అధ్యాత్మికముగా చదవకపోతే విపరీత అర్ధాలు వస్తాయి.  *యూదులు ఈ గ్రంధాన్ని పవిత్రముగా ఎంచుతారు. పెద్ద పండగలోనూ, సమాజమందిరములోను, పస్కా పండుగ 8వ రోజు ఈ గ్రంధాన్ని చదువుతారు.* 
            
 *"నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మమువంటిదానను. I am a rose of Sharon, a lily of the valleys. (పరమ 2:1)".*

ఈ వచనాన్ని 4 భాగాలు చేసి చదువుదాము. 
👉తెలుగు బైబిల్ లో లేని మాట ఇంగ్లీషులో ఉంది  అది రోజ్.

1⃣ *నేను పుష్పమును (I am Flower)*

2⃣ *నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను ( I am a flower like Sharon)*

3⃣ *నాది షారోను పొలము (My Field is Sharon)*

4⃣ *నేను షారోను పొలములో పూయు రోజా పుష్పాన్ని (I am Rose of Sharon)*

ఇప్పుడు ఈ 4 అంశాలను ధ్యానిద్దాము. 

1⃣ *నేను పుష్పమును:*

👉ఒక విశ్వాసి పుష్పము వంటి వంటివాడు / పుష్పము వంటిది. 
👉పువ్వుకు రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. 
🔺మొదటిగా పువ్వు మెత్తనిది, సున్నితముగా ఉంటాది. 
👉వీటిని బైబిల్ భాషలో మారిస్తే సాత్వికము. (సాత్వికము గూర్చి నేను గత అంశాలలో వ్రాసాను, చదవండి). 
*రక్షించ బడిన వారందరికి సాత్వికము కావాలి.*
👉 కొంత మంది రక్షణ పొందినా సరే ఎంత గీరగా ఉంటారో తెలుసా? 
👉ఏంది నీవు నాకు చెప్పేది అంటారు. వీరిని గీర క్రైస్తవులు అనాలి. 

ఈ మధ్య విశ్వాసులు అన్ని నేర్చుకుంటున్నారు. *సాత్వికాన్ని, శాదుగుణాన్ని నేర్చుకోకుండా లోకసంబంధమైన విషయాలు నేర్చుకుంటున్నారు.*

 👉మోటు ప్రజలైన ఫోన్ ఆన్ చేయడం, కాల్ చేయడం నేర్చుకుంటున్నారు కాని సాత్వికాన్ని నేర్చుకోలేక పోతున్నారు. అసలు 

*సాత్వికము ఎలా వస్తుంది?* 
👉వాక్యం చదవడం, గంటల తరబడి ప్రార్ధన చేయడం ద్వారా వస్తుంది కాని ఈ సత్యాన్ని విస్మరించి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. *"సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము (అంతరంగపురుషుడు) మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.*
 (1పేతురు 3:4).

👉 *సాత్వికము ఒక ఆప్షన్ కాదు, అది కంపల్సరీ. కాబట్టి సేవకులైన, విశ్వాసులైన అందరూ సాత్వికము అలవర్చుకోవలసినదే.*
 👉విశ్వాసిని గుర్తు పట్టే లక్షణం సాత్వికము. *సాత్వికము లేకపోవడానికి గల కారణం ఏమిటి?*
 *"అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి*
(యాకోబు 1:21)."

ప్రియ విశ్వాసులారా!
👉 వాక్యాన్ని, వాక్యమైన ప్రభువుని సాత్వికముతో అంగీకరించుడి. మన ప్రభువు సాత్వికుడు. 
*"నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును*
 (మత్త 11:29)

👉సాత్వికము నేర్చుకుంటే వచ్చేది. అది బజారులో దొరికేది కాదు.

 *మోషే*ఒక్క దెబ్బతో ఐగుప్తీన్ని చంపేశాడు. 
"ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెనుగాని, మోషే ఫరో యెదుటనుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి యొక బావియొద్ద కూర్చుండెను (నిర్గమ 2:15)". 

*40 సంవత్సరాల పాటు అరణ్యములో గొఱ్ఱెలు కాస్తూ సాత్వికాన్ని నేర్చుకున్నాడు.*

👉 మోషే సాత్వికములో Ph.D దేవుని దగ్గర చేసాడు. మోషే సాత్వికము గూర్చి బైబిల్ లో ఇలా ఉంది *"యెహోవా ఆ మాటవినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు*
 (సంఖ్యా 12:3)

🔹 మత్త 5:5, సాత్వికులు ధన్యులు, 
🔹 సామెత 14:30, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము.
🔹 సామె 15:4, సాత్వికమైన నాలుక జీవ వృక్షము.
🔹 ఎఫెసి 4:3, సాత్వికముతో నడుచుకొనవలెను.
🔹 కొలసి3:12, సాత్వికమును ధరించుకొనుడి
🔹 1తిమో 3:3, సాత్వికము ఉండవలెను.

2⃣ *నేను షారోను పొలములో పూయు పుష్పము వంటిదానను:*

 *పువ్వుకు రెండవ లక్షణము సువాసన.*
👉 పుష్పానికి వాసన ఉన్నట్టే విశ్వాసికి కూడా సువాసన ఉండాలి.
🔺 వాసన లేని పువ్వును ఎవరు ఇష్టపడరు. 
కొందరు హైందవులు వాసన లేని పుష్పాలను దేవునికి సమర్పిస్తారు. దానిలో గొప్ప భావన ఉంది. నేను వాసన లేని దానను. నన్ను వాసన గల దానిగ చేయుమని భావన.

 *"క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.*
 (ఎఫెసి 5:2-3)

*సువాసన అంటే పరిశుద్ధత.*

👉 బైబిల్ లో 1029 పేజీలు ఉన్నాయి. పరిశుద్ధత అనే మాట 1085సార్లు ఉంది. *దాదాపు ప్రతి పేజీలో పరిశుద్ధత అనే మాట ఉంది.*

 అందుకే 
*మన బైబిల్ పరిశుద్ధగ్రంధం అయింది.*

👉 పరిశుద్థత విషయములో కూడా దేవుడే మాదిరి. 
*"నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది* (1పేతురు 1:14).

 *రక్షింప బడిన వారి దగ్గర నుండి పరిశుద్ధత అనే వాసన రావాలి.*

3⃣ *నాది షారోను పొలము:*

*షారోను అనగా మైదానం.*
👉 ప్రియురాలైన ఘాలమ్మితి ఎలాంటిదో చెప్పింది. 
🔺ఇప్పుడు ఎక్కడిదో చెప్తుంది. 
🔺వాస్తవానికి ఘాలమ్మితి అనే కన్యక ఇశ్శాఖారు గోత్రానికి చెందింది. 
🔺ఆమె నివాసం ఘానేము అనే గ్రామం. 
🔺రాజైన సోలోమోను పరిపాలనలో ఈ గ్రామాలు అతని స్వాధీనములో ఉన్నవి. ఘాలమ్మితిని ఒకనికి ప్రధానము చేసారు. 
🔺ఈమె సోదరులు ఈమెను ద్రాక్షతోటకు కావళిగత్తె గా ఉంచారు. 
🔺సోలోమోను సేవకులలో ఒకడు ఈ ఘాలమ్మితిని తెచ్చి రాజనగరిలో ఉన్న స్త్రీలమధ్య ఉంచాడు. 
*ఇది ఘనేమియుల అలవాటు* (1రాజులు 1:1-4). 

👉గాని ఈమె నాది షారోను పొలము అంటోంది. 
👉అసలు ఈ షారోను పొలము ఎక్కడ ఉంది? 

*కర్మెలు పర్వతానికి -యొప్పేకు మధ్య ఉంది. అది గులాబి తోట. అది షారోను గులాబీల తోట.*

 ♻ *కర్మెలు*

♻ *యొప్పే*

♻ *కర్మెలు ఒక ప్రార్ధనా స్థలం.* 

👉ప్రవక్తయిన ఏలీయా 1రాజులు 18:19-20 వచనాలలో బయలు ప్రవక్తలతో సవాలు చేసాడు.
 *"అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలువారి నందరిని, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగువందల ఏబదిమందిని, అషేరాదేవి1 ప్రవక్తలైన నాలుగువందల మందిని నాయొద్దకు కర్మెలు పర్వతము నకు పిలువనంపుమని చెప్పెను. అహాబు ఇశ్రాయేలువా రందరియొద్దకు దూతలను పంపి, ప్రవక్తలను కర్మెలు పర్వత మునకు సమకూర్చెను. ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి-యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడ బడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుస రించుడి,బయలు దేవుడైతే వాని ననుసరించుడని ప్రక టన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయిరి".*
👉 దీనిని బట్టి కర్మెలు ఒక ప్రార్ధనా స్థలం. 

♻ *యొప్పే కూడా ఒక ప్రార్ధనా స్దలం.*

*"లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుటచేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, అతడు తడవుచేయక తమయొద్దకు రావలెనని వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితోకూడ వెళ్లి అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోనికి అతనిని తీసికొని వచ్చిరి; విధవరాండ్రందరు వచ్చి యేడ్చుచు, దొర్కా తమతోకూడ ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములును చూపుచు అతని యెదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగితబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడామెకు చెయ్యి యిచ్చి లేవనెత్తి, పరిశుద్ధులను విధవ రాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను. ఇది యొప్పేయందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువు నందు విశ్వాసముంచిరి*
(అపో 9:40)."

👉పేతురు ప్రార్ధించిన స్థలం యూప్పే కూడా ప్రార్ధనా స్దలం.

♻ అనగా *షారోను స్థలం రెండు ప్రార్ధనా స్థలాల మధ్య ఉంది.*

👉 షారోను పొలము అనగా ప్రార్ధనా స్థలం అన్నమాట. 

 *మరి మీకు ప్రార్ధనా స్థలం ఉందా?*

👉 ప్రార్ధనకు కూడా యేసే మనకు మాదిరి. 
*"ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యము లోనికి వెళ్లుచుండెను.*
 (లూకా 5:16).
 *విశ్వాసి ఉన్నస్థలం ప్రార్ధనా స్థలం కావాలి.*

4⃣ *నేను షారోను పొలములో పూయు రోజా పుష్పాన్ని:*

👉రోజా పుష్పము ఎక్కడ పెరుగును? 
👉ముళ్ల మధ్యలో. 
*విశ్వాసి కూడా శ్రమలు, నిందలు, శోధనలు అనే ముళ్ల మధ్య పెరుగుతాడు.*
 
*"అందుకతడు మూర్ఖురాలు మాటలాడు నట్లు నీవు మాటలాడు చున్నావు; మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు.* (యోబు 2:10) 

👉కొన్నిసార్లు మనకు సంభవించే కఠిన శ్రమల నుండి అత్యంత మేలుకరమైన ఫలితలు రావచ్చు. 
👉 యోబు చరిత్ర భావితరాలకు ఆదరణ కలిగే విధముగా చేసాడు. 
*ఎడారి అనుభవం ఎంత చేదుగా ఉంటుందో అక్కడి నీరు అంత మధురంగా ఉంటుంది.*

 హెబ్రీయులకు 12:11 *"మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును."*
         
👉ప్రతి గులాబి క్రింద ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు ఎవరు తొలగించలేరు. గులాబి వికసిస్తూ ఉండగా వాటి క్రింద ముళ్ళు ఆటోమాటిక్ గా అవే తొలగిపోతాయి. 

👉 *అలాగే విశ్వాసి క్రీస్తులో వికసిస్తూ ఉండగా శ్రమలు అవే తొలగిపోతాయి.*

🔹 పువ్వులన్నింటిలో గులాబి రాణి. 
🔹గులాబి వాసన, అందం మధురం. 
🔹గులాబి నలిగే కొద్ది వాసన వస్తుంది. 
*విశ్వాసి కూడా శ్రమలలో నలిగే కొద్ది పరిమళ భరితం అవుతాడు.*

👉 సిలువ లేకవుండా సింహాసనం లేదు. గులాబి 10/-  అయినా 10,000/- రూపాయల సూట్ కి పెడితే లక్ష రూపాయల అందం వస్తాది. There is no CROWN without CROSS. There is no THRONE without THORN. 
👉సన్నుతమైన గులాబి రేకులు ముళ్లను అణచివేస్తాయి. 
👉మీరు పూచే గులాబీలా?
👉 వాడిపోయిన గులబీనా? 
 *"అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.* 
(యెషయా 35:1-2)

 👉షారోను పొలములోని అందమైన గులాబి వంటి అందమైన జీవితం మనమందరం కలిగి ఉండాలి అని ఆశిస్తూ,


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...