ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దేవుని సేవ-పరిచర్య అర్ధము.

✳ *దేవుని సేవ-పరిచర్య* ✳

( మూడవభాగము) 

3⃣ *దేవుని సేవ-పరిచర్య అర్ధము.....✍*

Mark(మార్కు సువార్త) 16:15

15. *మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి*



  👉 ఇది యేసుప్రభులవారు ఇచ్చిన చివరి ఆజ్న!  ఇక్కడ మీరు అనగా 
*అది ఒక అపోస్తులులుకు మాత్రమే కాకుండా రక్షింపబడిన ప్రతీవిశ్వాసికి ఇచ్చిన ఆజ్ఞ!*

👉 సేవ కేవలం పాష్టర్లు, సువార్తికులు, ఇవాంజిలిస్టులు, మిషనరీలు మాత్రమే చేయాలి, నేను చేయకూడదు అనుకొంటున్నావా? 

ఈ మార్కు 16:15 
*పిలుపు అందరికి చెందినది. అందరూ సువార్త ప్రకటించాలి.*

👉 అయితే 
*దేవుడు నీకు ప్రత్యేకముగా తనసేవకు పిలచుకొంటే అప్పుడు నీవు చేస్తున్న నీ పని ఆపి, full time minstry- సంపూర్ణ సేవ చేయాలి.* 

 ♻️ *ఇంతకీ సేవ- పరిచర్య అనగా ఏమిటి?*
 
*బైబిల్ సంచి బుజాన వేసుకొని, ఇంటింటికి తిరుగుతూ సువార్త ప్రకటించడమే సేవా?*

 *కరపత్రాలు పంచడమే సువార్తనా?*

 *ప్రసంగాలు చేయడమే సేవా?*

👉 *మరి ఏమిటి?* 
పౌలు మహాశయుడు కొరింథీయులకు వ్రాసిన పత్రికలో – 

*మా హృదయముల మీద వ్రాయబడి, మనుష్యులందరూ తెలుసుకొనుచు చదువుకొంటున్న మా పత్రిక మీరే కారా?* అంటున్నారు. 2కొరింథీ 3:2

  👉 ఎంతగొప్ప ధన్యత ఈ కొరింథీయులది. 
*వాళ్ళ ప్రవర్తనే ఒక కరపత్రికగా మారిపోయింది.*
🔹 వారి మారిన ప్రవర్తన,
🔹 మారిపోయిన మాటలు,
🔹 మారిన జీవితం వారు దేవుని బిడ్డలు అని సాక్ష్యం చెబుతున్నాయి.

*కేవలం ప్రసంగాలు, కరపత్రికలే కాదు* 

*మారిన మన జీవితం సాక్ష్యం చెప్పగలగాలి.*

👉 నీ భాష , వేషధారణ, అబద్దాలు, మోసాలు, బూతులు అన్నీ మారిపోవాలి. నీ మాటలలో, జీవితంలో యేసయ్య – యేసయ్య ప్రేమ పలకరించాలి.

*అప్పుడు నీవు సువార్త ప్రకటించక పోయినా నీ జీవితాన్ని చూసి ప్రజలు రక్షింపబడతారు.*

 (జీవితం మారాక సువార్త చెప్పకపోయినా పర్వాలేదు అని నా ఉద్దేశ్యం ఎంత మాత్రము కాదు). 

*నీ మంచి నడవడిక ప్రజల్ని యేసయ్యవైపు ఆకర్షిస్తుంది*.
 
▪️_ఇంతక్రితం నీవు అబద్ధికుడవు_, 
▪️_వ్యభిచారివి,
▪️ త్రాగుబోతువు ఇప్పుడెలా మారిపోయావు అని నిన్ను అడిగితే నీవు చెప్పే చిన్నిసాక్ష్యం- 

*యేసయ్య నా జీవితాన్ని మార్చారు* 

👉ఈ చిన్ని సాక్ష్యం అనేక ప్రసంగాలకంటే బలమైనది.  ఇలా ప్రజలు నిన్ను ఎప్పుడు అడుగుతారు? 

*నీవు మారి సాక్ష్యార్ధమైన జీవితం జీవించినప్పుడు!!*

👉ఈ సందర్భముగా ఇద్దరు వ్యక్తులను మీకు గుర్తు చేస్తాను. వీరెప్పుడు యేసయ్యని నమ్ముకోండి అని వీదులలో గాని, సభలలో గాని ప్రసంగాలు చెయ్యలేదు.
 గాని వేలాదిమందిని ప్రభువుకై తమ ప్రవర్తన ద్వారా గెలిచుకోగలిగారు.

1⃣ అమ్మ తర్వాత అందరితోను మదర్ అని పిలువబడిన వారు ఇద్దరే!
🔹 ఒకరు *Mother Mary,*

 🔹మరొకరు *మదర్ థెరీసా!* 
మదర్ థెరీసా గారు ఎవ్వరికి ఎక్కడ వాక్యం చెప్పినట్లు లేదు, కేవలం నిర్మల్ సదన్ ఇంకా సిస్టర్స్ కి తప్ప! 

👉ఆమె పేదలకు, నిరాశ్రయులకు, గ్రుడ్డివారికి, కుష్టురోగులకు చేస్తున్న పరిచర్యను చూసిన అనేకమంది ప్రేరణ చెంది, ఆమెను అడిగేవారు: 
*ఇలా ఎలా సేవ చేయగలుగుతున్నారు అని!*

👉 ఆమె చెప్పేవారు, నేను చేసే పరిచర్య వీళ్ళకు చెయ్యడం లేదు, 
*వీళ్ళలో ఉన్న దేవునికి చేస్తున్నాను, నేను రోగికి సేవ చెయ్యడం లేదు! యేసయ్యకు చేస్తున్నాను! అంతే,*
 (మత్తయి 25:31-46)

👉ఈ సాక్ష్యానికి ప్రభావితం చెంది ఎందరో కన్నీరు కార్చి, మారిపోయారు. 
*మరి అలాంటి జీవితం, అలాంటి సాక్ష్యం నీకుందా?*

2⃣ ఆఫ్రికా ఖండంలో సేవ చేసిన స్కాటిస్ మిషనరీ *డేవిడ్ లివింగ్స్టన్* గారికి ఆయన చేసిన/చేస్తున్న సేవకు ఖండాంతరాల్లో ఎంతో పేరు వచ్చింది.

*ఇది కిట్టని ఒక ఎతిస్ట్, జర్నలిస్ట్ స్నేహితుడైన డేవిడ్ గారి మిత్రుడు, నేను అతను చేసే ప్రలోభాలను, మోసాలను బయటికి తీస్తాను, అతను ఏదో మందురాసి, మాయ చేసి క్రైస్తవులుగా మారుస్తున్నాడు, అని ప్రెస్ మీటింగ్ పెట్టి, ఆఫ్రికా దేశం ప్రయాణమై పోయి, వెంటనే తిరిగి వచ్చేసాడు.* 

👉ఏమయ్యా ఎందుకు తొందరగా వచ్చేశావు? అని అడిగితే సమాధానం చెప్పకుండా ఇంటికి పోతాడు.నాలుగు రోజుల తర్వాత మొత్తం విలేకరులంతా ఆయన ఇంటికి పోయి అడిగితే ఆయన జవాబు వినండి.

👉 *ఎన్ని రోజులున్నావు: తొమ్మిది*

👉 *ఏం మాట్లాడావు: ఏమీ మాట్లాడలేదు*

👉ఎందుకొచ్చేసావు తొందరగా: 
*మరోక్కరోజు అక్కడుంటే నేనుకూడా క్రైస్తవుడుగా మారిపోతానేమో అని భయపడి వచ్చేసాను.*

👉ఏం ఆయన ఏం చేస్తున్నాడు: 
*సేవ- పరిచర్య, ఒక సామాన్య మానవుడు అలా చేయలేడు, ఆయనలో ఏదో శక్తి చేయిస్తుంది.*

♻ *ఎంత గొప్పసాక్ష్యం!!!!*

సోదరీ/సోదరుడా!  కేవలం నీ ప్రవర్తనే ఒక కరపత్రికగా, గొప్ప సాక్ష్యముగా మారిపోవాలి! 

*అప్పడు నీవు ప్రజల్ని యేసయ్యకోసం గెలవగలవు.* 

👉 *నీ ప్రవర్తన ఎలా వుంది?*
ఇంట్లో, బయట, ఆఫీసులో, నీళ్ళ కొళాయి దగ్గర! 
*నీవు యేసయ్యను చూపిస్తున్నావా?*
 
👉లేక నీలో సాతానుగాడ్ని చూస్తున్నారా? 

👉 ఒక వేల నీ జీవితం సరిలేకపోతే ఇప్పుడే సరిచేసుకో! ప్రభు సన్నిధిలో ఇప్పుడే మోకరించి, నీ జీవితాన్ని ఒక కరపత్రముగా మార్చుకో! 

దేవుడు నిన్ను దీవించును గాక!

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...