✳️ *తప్పు సిద్ధాంతం* ✳️
(రెండవ భాగము)
4️⃣ *మన అసంపూర్ణ అవగాహన*
*I కొరింథీ 13:9-13*
*మనము కొంతమట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాముగాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును.*
*నేను పిల్లవాడనైయున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.*
*ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును.*
*పరిణతి లేని మనుషులతో వచ్చిన చిక్కేమిటంటే తమ లోతుపాతులను వారు గ్రహించారు.*
👉 వయసులో ఉన్నవారు ప్రతీదానినీ అవును,కాదు – ఈ రెండు మాటలతోనే చూస్తారు. కొంచం వయసు మల్లితేనే గాని సమస్యలు వాల్లనుకునేటంత చిన్నవి కాదు అని అర్ధమౌతుంది. *ఆత్మ సంబంధంగా కూడా ఇదే నిజం. దీనికి మరొక సమస్య తోడవుతుంది. వయసు పెరగడమంటే ఆత్మ సంబంధమైన పరిణతి కూడా దానికదే వచ్చేయ్యదు.*
👉 ప్రభువును చిరకాలంగా ఎరిగి ఉన్నవారు కూడా కొందరు ఆధ్యాత్మికంగా పసి పిల్లలుగానే ఉంటారు. అయితే చాలా సార్లు *ఆత్మ సంబంధంగా పరిపక్వం చెందకపోవడంతో బాటే తానూ పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే తత్త్వం కూడా కలిసి ఉంటుంది.* ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చడానికి ఈ మాత్రం అర్హత లేనివాళ్ళు ఎక్కువ దైర్యంగా మాట్లాడుతుంటారు.
కొరింథీ సంఘాన్ని పీడించే సమస్యలలో ఇదొకటి.తమ విశ్వాసాన్ని దైనందిన జీవితంలో అన్వయించుకునేటప్పుడు ఎవడికి వాడు ఎదుటివాడ్ని విమర్శించసాగారు. ఇందుమూలంగా అంటా గందరగోళం లేచింది. అయితే కొరింథీ వారికి మాత్రం చీమకుట్టినట్టయినా లేదు. ప్రతీవాడూ మరొకడి పైకి తప్పును నెట్టేసి చేతులు కడుక్కున్నారు.
👉 మన ఆధ్యాత్మిక అవగాహన పాక్షికమైనదని పౌలు చెబుతున్నాడు. *“మనము కొంతమట్టుకు ఎరుగుదుము”* (వ.9). *“ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతుము”* ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాము. అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదుము” (వ.12). మొదటి భాగములో మనం చూచినట్టుగా ఖచ్చితంగా *మనం నమ్మదగిన, నిజ విశ్వాసులంతా ఒప్పుకోవలసిన మూల సత్యాలు కొన్ని ఉన్నాయి.* కానీ ఈ సత్యాలలోనే మనం కొంతవరకు మాత్రమె అర్ధం చేసుకోగలిగినవి ఉన్నాయి. ఉదాహరణకు, మానవ శరీరం ఎలా పని చేస్తుందో మనకందరికీ కొంతవరకు తెలుసు. మెదడు, గుండె ఇతర అంగాలు చేసే పని తెలుసు. కాని మన అవగాహన సంపూర్ణమైనది కాదు. వైద్య శాస్త్రానికి తెలియనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. మనం తెలుసుకున్నట్టు ఈ *మూల సత్యాలను నమ్మె వారిలోనే వారి వారి అవగాహానలలో, అభిప్రాయాలలో ఎన్నో తేడాలు ఉన్నాయి. విశ్వాసులుగా మనం ఈ తేడాలను సహృదయంతో అర్ధం చేసుకోవాలి.*
అధ్యాయం చివరి భాగంలో పౌలు, *విశ్వాసం, నిరీక్షణల కంటే ప్రేమ గొప్పది అని చెబుతున్నాడు. ఆధ్యాత్మిక విషయాలలో మన అవగాహన పాక్షికమేననీ, వాటిని మరింతగా నేర్చుకోవడంలో దేవుని ప్రజలు ఏకం కావాలనీ గుర్తింపజేసే ప్రేమ మనలో లేకపోతే మన విశ్వాసం, నిరీక్షణ వాడిపోతాయి. ఇలాంటి నేర్చుకునే ప్రవృత్తి కోసం ప్రార్ధిద్దాం.*
5️⃣ *సత్యం పక్షాన నిలవడం*
_1తిమోతి 4:1-10_
*సంఘ జీవనంలో సరైన సిద్ధాంతాలు ఎంత ప్రాముఖ్యమో పౌలు తిమోతికి, తీతుకు రాసిన లేఖల్లో వివరంగా రాసాడు. సరైన సిద్ధాంతాలను మనం గట్టిగా సంరక్షించుకోవాలని కూడా పౌలు చెబుతున్నాడు.* దేవుని ప్రజలను తప్పు సిద్ధాంతాలెంత చిన్నా భిన్నం చేసేస్తాయో పౌలుకు భాగా తెలుసు. *"వేషదారణ వలన మోసపరచు ఆత్మలయందును, దయ్యముల బోధ డును"* (వ.1) లక్షముంచేవారు సంఘాలను ఆక్రమించుకుంటారని ఇక్కడ తిమోతిని మరీ మరీ హెచ్చరిస్తున్నాడు పౌలు (వ.1-3).
👉 సంఘంలో తప్పు సిద్ధాంతాలకు జవాబు ఏమిటి? ముందుగా వ్యక్తిగతమైన ఆదర్శం ద్వారా జవాబు చెప్పవచ్చు. తిమోతి *స్థిరంగా నిలబడి, ఇతరులను కూడా స్థిరపరచాలంటే ముందు అతడు మంచి సిద్ధాంతాలను వంటబట్టించుకుని ఉండాలి* (వ.6)
*ఒక మనిషి అస్తమానమూ నేర్చుకుంటూ ఉండకపోతే అతడు మంచి ఉపాధ్యాయుడు కాలేదు. అజ్ఞాని చేసే పరిచర్య సంఘ ఆధ్యాత్మిక జీవనానికి చేటు. క్రైస్తవ సిద్ధాంతాలను చక్కగా అర్ధం చేసుకోగలిగితే, దారి తప్పిపోతున్న వారి విషయంలో ఖచ్చితమైన అభిప్రాయాన్ని నిర్ణయాన్ని చూసుకునే అవకాశం ఉంటుంది.* అంటే గాక విశ్వాసానికి కేంద్ర సత్యాలనబడే నాటి నుండి దృష్టి మరల్చి (వ.7) చిన్న చిన్న సంగతుల గురించి కొట్లాడుకునే పరిస్థితిలో పడకుండా తప్పించుకుంటాము.
6వ వచనంలో పౌలు ఈ సంగతులను సహోదరులకు వినిపించు అంటాడు. *పౌలు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన మాట వాడాడు. ప్రజలు మన మాట వినకుండా లేచి వెళ్లిపోవాలంటే మంచి ఉపాయం మనకు సత్యమని తెలిసినదాన్ని, గర్వంగా నాకే అంటా తెలుసునన్నట్టు చెప్పడమే. పౌలు ఉపయోగించిన మాట దీనికి సరిగ్గా వ్యతిరేఖం.
*పౌలు మాట్లాడుతున్నదేదో భాగా తెలిసి ఉండి సత్యాన్ని ప్రజల ముందు ఉంచి దాని పనిని దాన్నే చేసుకోనిచ్చి ప్రజలు తమకి తామే గ్రహించగలిగేలా చేసే బోధకుడే వివేకవంతుడు.*
అర్ధం చేసుకుని బోధించడంలో మనస్సునుంచడమే గాక, భయభక్తుల్లో, ఎదగడంలో కూడా అంతే శ్రద్ధ వహిస్తూ ఇతరులకు మార్గ దర్శకంగా ఉండాలి (వ.7,8). ఆత్మ పూర్ణత లేక పౌలు మాటల్లో చెప్పాలంటే *“జీవముగల దేవునిపై మనం పెట్టుకున్న ఆశ”* (వ.10). *మన వ్యక్తిత్వం మొత్తాన్నీ ఆవరించాలి.* ఏ బోధ అయినా సరైనదా కాదా అని తేల్చాలంటే దానివల్ల కలిగిన ఫలితాలను పరిశీలించాలి.
*వ్యక్తిత్వమంతటినీ ఆవరించిన దైవభక్తి క్రైస్తవ విశ్వాసానికి మంచి సాక్ష్యం. తప్పు సిద్ధాంతాలకు సరైన విరుగుడు.*
*మన బోధల ద్వారా, జీవితం ద్వారా సత్యాన్ని గట్టిగా సంరక్షించగలగాలని ప్రార్ధన చేద్దాం.*
6️⃣ *తప్పు సిద్ధాంతాన్ని కనుగొనడం*
_తీతు 3:8-11_
ఈ వాక్యభాగంలో చర్య తీసుకోవలసిన అవసరతను పౌలు నొక్కి చెప్తున్నాడు. *ఇతరుల్లో తమకు కనిపించిన తప్పు సిద్ధాంతాలను తెగనాడేందుకు కొందరు సర్వసన్నద్ధంగా ఉంటారు. అయితే మంచి సిద్ధాంతాల ఫలితాన్ని తమ బ్రతుకుల్లో ఏ మాత్రం కనపరచరు. ఇతరుల తప్పుల్ని వెతికే హక్కు పొందబోయేముందు సరియైన దాన్ని మన జీవితంలో చూపడం ముఖ్యం.*
మత సమస్యలను గ్రీకు, యూదా తత్వవేత్తలు రోజుల తరబడి చర్చించేవారు. వీటిని చర్చించడంలో గొప్పతనమంతా ఉంది అన్నట్టు ఉండేది వీరి ధోరణి. నేటి దేవుని బిడ్డల్లో కూడా ఇదే వరస కబడుతుంది. *తమకు నచ్చిన సిద్ధాంతాలను ఆచరణలు సమర్ధిస్తూ ఎంత గట్టిగానైనా వాదిస్తారు గాని, అంత గట్టిగా తాము వాదించిన దాన్ని తమ జీవితాల్లో ఆచరించడానికి ఏ మాత్రం ప్రయత్నించరు.*
👉 ఇవన్నీ *"నిష్ప్రయోజనం , వ్యర్థం"* (వ. 9). *మనం నమ్మేదేమిటో మనకు తెలిసి ఉండాలి. అయితే విశ్వాసికి గుర్తు అతని జీవిత విధానమే గాని, ఇది నా నమ్మకం అని అతను చెప్పుకునేది కాదు.*
ఇదంతా చెప్పక సంఘంలో సరైన నిర్ణయాలు చేయగలగడం మన బాధ్యత. *ఏ స్థానిక సంఘానికైనా కొన్ని మూలా సత్యాలు ప్రాథమికంగా అవసరం.* ఆ సత్యాలను నిరాకరించేవారికి దేవుని ప్రజల సహవాసంలో స్థానం లేదు. ఇలాటివారు *'మత బేధం'* కలిగించే మనుష్యులు (వ 10) తమ స్వంత అభిప్రాయాలను అన్ని సత్యాలకు ప్రామాణికంగా భావించేవారిని ఉద్దేశించి పౌలు ఈ మాట వాడాడు. తాను చెప్పింది రైటని, మిగతా అందరిది తప్పని ఇలాటివారు ముందే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఇతరులతో సహవాసం అతనికి పట్టదు. దేవుని వాక్య హెచ్చరికలు కూడా అతనికి ఎక్కవు. అలాటివాడికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పి విసర్జించుము అంటున్నాడు పౌలు.
ఇతర విశ్వాసులనుండి విడదీసి ఇతరుల ద్వారా దేవుడు తనతో చెప్పడానికి ప్రయత్నిస్తున్న దాన్ని కూడా విననీయకుండా అతని మనస్సు మూసేసి సిద్ధాంతం ఆ మనిషికి బహు ప్రమాదకరమైనది. *నిజమైన విశ్వాసం ఎప్పుడు మనుషులను కలుపుతుంది. అది విశ్వాసికీ, అవిశ్వాసికీ మధ్య స్పష్టమైన తేడా కలుగజేస్తుంది గాని ఇద్దరు విశ్వాసులను మాత్రం ఎప్పుడు వేరు చేయదు.* ఇతరులపై తీర్పు తీర్చే భారభరితమైన బాధ్యతను మనపై వేసుకోబోయేముందు మన జీవితంలో తీర్పుకు అర్హమైన అభిప్రాయాలూ, ప్రవృత్తులు ఎమన్నా ఉంటే చూపించమని దేవుణ్ణి అడుగుదాం.
7️⃣ *యెహూ*
_2రాజులు 10:23-31_
_2రాజులు 10:16-31; 19:31; రోమా 16:17; యోషీయా 22:5_
*ఈ వచనాలలో మనం యెహూ వ్యక్తిత్వమనే నాణెం రెండు వైపులా చూస్తున్నాము. యెహోవా విషయంలో అతని తీవ్రత, తన స్వంత జీవితాన్ని క్రమంగా చూసుకోలేని విచారకరమైన బలహీనత.*
యెహోరాము రాజు క్రింద ఇశ్రాయేలీయుల సైన్యాలకు అధిపతి యెహూ. యెహోరాము ఆహాబు కొడుకు. యుద్ధంలో తగిలిన గాయాలకు యెహోరాము చికిత్స పొందుతూ ఉండగా యెహూను రాజుగా అభిషేకించమని ఎలీషా ఒక ప్రవక్తను పంపించాడు. ఆహాబు ఇంటివారినందరినీ తుదముట్టించే పని అతనికి ఇయ్యబడింది. తన సహజమైన ఉత్సాహంతో, తీవ్రతతో యెహూ పనంతటినీ పూర్తిచేయడమేమో కాని కొంచం అతిగా కూడా ప్రవర్తించాడు.
యెహూ చేతిలో యెహోరాము హతమయ్యాడు. ఏలియా చెప్పిన రీతిగా యెజెబేలు తన అంతఃపురములో నుండి వాకిట్లోకి పడద్రోయబడి చచ్చింది. బయలు గుడిలో అర్చకుల మరణాల గురించి నేటి మన వాక్య భాగం వివరిస్తున్నది.
*ఇశ్రాయేలు నుండి బయలు ఆరాధనను తుడిచిపెట్టేసాడు యెహూ* (వ.28). ఆ తదుపరి మన విషయాల్లో అతని అసలు రంగు బయటపడసాగింది. బెతేలు, దాను ఊళ్ళలో బంగారు దూడ ఆరాధనను కొనసాగనిచ్చాడు (వ.29). ఇశ్రాయేలు వారికి ఆహాబు కుటుంబం పీడ విరగడ చేసినందుకు దేవుడతన్ని మెచ్చుకున్నాడు (వ.30). కాని ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెహోరాము చేసిన పాపములను యెహూ ఏమాత్రమూ విసర్జించని వాడై ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నియమించిన దర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్దాభక్తులు లేనివాడాయెను (వ.31). అతని ఏలుబడిలో దేశం ఏమాత్రమూ ప్రగతి సాధించలేకపోవడంలో ఆశ్చర్యం లేదు.
యెహూ ఆసక్తిలో ఉన్న లోపం ఏమిటి? చెడునంతటినీ అమితోత్సాహంతో నాశనం చేసేసాడు గాని యెహోవా మార్గాలకు విధేయత చూపవలసి వచ్చేసరికి బలహీనుడైపోయాడు. *చెడు అనే పునాదిపై మన ప్రభువు కోసం మన జీవితాన్ని నిర్మించుకోలేము. మనలో గాని, మన సంఘంలో గాని ఏది పాపమో దాన్ని విసర్జించడానికి సిద్ధం కావాలి. అయితే చెడును పరిహరింపచేయడంతోనే సరిపోదు. నిజమైన విశ్వాసం ఎప్పుడూ విధేయతను నడిపించేదిగా ఉండాలి. అది మన జీవితాల్లోనూ, సంఘ జీవనంలోనూ మన ప్రభువు యొక్క ప్రమాణాలను స్థాపించేదై ఉండాలి.*
_*పాపాన్ని విసర్జించడంతోనే ఆగిపోక మన ప్రభువును వెంబడించేవారుగా ఉండాలనే ఆశ మన హృదయాల్లో పుట్టాలని దేవుణ్ణి ప్రార్ధిద్దాం.*_
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి