ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రసంగి పరిచయం

ప్రసంగి

పరిచయం

రచయిత:

ఎవరు రాశారన్నది ఈ పుస్తకంలో లేకపోయినా సొలొమోను ఈ పుస్తకాన్ని రాశాడనడానికి కొన్ని సూచనలు ఉన్నాయి – 1:1, 12, 16; 2:4-9; 12:9.

వ్రాసిన కాలం:
క్రీ.పూ. 970-930 మధ్య సొలొమోను రాజ్యపాలన చేశాడు. బహుశా అతని జీవితం చివరి దశలో ఈ పుస్తకాన్ని రాసి ఉండవచ్చు.

ముఖ్యాంశం:

మనుషులకు తెలిసినదంతా చాలా తక్కువ అని దేవుడు చూపించాలనుకున్నాడు. దేవునికి దూరమైనప్పుడు మానవుని జీవితం, అతని పనులు ఎంత వ్యర్థంగాను, అర్థరహితంగాను ఉంటాయో ఆయన తెలియజేయదలచాడు. 

ఈ సత్యాన్ని రాతపూర్వకంగా తన వాక్కైన బైబిలులో ఉంచాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఈ సత్యాన్ని బయలు పరచడానికి ఆయన ఒక వ్యక్తిని నియమించుకున్నాడు. 

ఈ లోకంలో అందరికంటే మించిన జ్ఞానం గల వ్యక్తిగా అతన్ని ఆయన చేశాడు. అతని జ్ఞానం సొక్రటీసు లేక బుద్ధుడు లేక కన్ఫ్యూషియస్ లేక ఏ ఇతర ప్రసిద్ధుడైన వ్యక్తికన్నా మించినది (అయినా గాని ఈ విషయంలో యేసు క్రీస్తును మినహాయించాలి. 

ఎందుకంటే ఆయనే దేవుని జ్ఞానమై ఉన్నాడు – 1 కొరింతు 1:24, 30). ఈ లోకంలో ఉన్నవారందరికంటే మించిన ఆస్తిపరునిగా దేవుడు అతన్ని చేశాడు. మనుషులు అనుభవించే సమస్తాన్ని అనుభవించడానికి అతనికి అన్ని రకాల అనుకూలతలు, సామర్థ్యం, అవకాశాలను దేవుడు కల్పించాడు.

 దేవుడతనికి అన్నిటిని పరిశోధించగల మనస్సును జీవితంయొక్క అర్థాన్ని కనుగొనాలన్న బలమైన ఆశను అతనిలో ఉంచాడు. తార్కిక దృష్టితో సంగతులను, సాక్ష్యాధారాలను వడగట్టి చూడగల మనస్సును దేవుడతనికి అనుగ్రహించాడు. దేవుడు నియమించుకొన్న ఆ వ్యక్తే సొలొమోను. 

ఈ దైవకార్య ఫలితాల్లో ఒకటి ఈ ప్రసంగి పుస్తకం.

విషయసూచిక

పుస్తకం సారాంశాన్ని సొలొమోను తెలియజేయడం 1:1-2

అతడిచ్చిన కొన్ని సాదృశ్యాలు 1:3-11

తన గురించి మరెక్కువ పరిచయం 1:12-16

జీవితంయొక్క అర్థం తెలుసుకోవడానికి అతని తీర్మానం 1:17—2:16

జ్ఞానం, పతనం గురించి అతని ప్రయత్నం 1:17; 2:3

సుఖభోగాల ప్రయత్నం 2:1-2

మధ్యపాన ప్రయత్నం 2:3

కొన్ని ఘనకార్యాలను అతడు చేపట్టడం 2:4-6

సిరిసంపదలను, ఐశ్వర్యాన్ని కూడగట్టడం 2:7-8

వాద్య సంగీత, లైంగిక సుఖభోగ ప్రయత్నం 2:8-9

మనసు కోరిన ప్రతిదాన్ని ప్రయత్నించడం 2:10

కొన్ని విషయాల గ్రాహ్య సారాంశం 2:11

జ్ఞానం, పతనం గురించి మరో ప్రయత్నం 2:12-14

వీటి గురించి అతడు గ్రహించిన సారాంశం 2:15-16

నిరాశ 2:17-23

ఈ జ్ఞాని దానినంతటి గురించి ఆలోచించగలిగిన విషయం 2:24-26

ప్రతిదానికొక సమయం 3:1-8

కాలాన్ని అనంత యుగాలతో పోల్చడం 3:9-14

దేవుని తీర్పును గురించి కొన్ని తలంపులు 3:15-17

జంతువుల, మనుషుల గురించి కొన్ని సంగతులు 3:18-22

ఉనికి కంటే ఉనికి ఉండకపోవడమే మేలనుకోవడం 4:1-8

స్నేహం యొక్క విలువ 4:9-12

వర్థిల్లడం వ్యర్థం 4:13-16

దేవుని పట్ల భయభక్తులు 5:1-7

సిరిసంపదలు వ్యర్థం 5:8—6:12

జీవితంలోని వివిధ పరిస్థితులను గురించి కొన్ని అభిప్రాయాలు 7:1—11:8

జ్ఞానార్జనకు అతని ప్రయత్నం 7:23-25

భవిష్యత్తును గురించి తెలుసుకోలేకపోవడం 8:7-8

కొన్ని సార్లు న్యాయానికి కూడా అపజయం ఎదురౌతుంది 8:14

మానవుడు తన తర్క జ్ఞానంతో జీవితంయొక్క అర్థాన్ని గ్రహించలేడు 8:17

మనుషులందరి చివరి గతి ఒక్కటే అనడం 9:1-12

జ్ఞానానికి ఒక ఉదాహరణ 9:13-18

యువకులకు సలహా 11:9—12:7

విషయానికంతటికీ ముగింపు 12:8-14

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...