ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్

✳ *.....క్రిస్మస్*..... ✳

 (మూడవ భాగము)

♻ *గొర్రెల కాపరులు* ♻

 1⃣ *అత్యంత అనాగరికులు, కాని, ప్రప్రధమంగా రక్షకుని చూచిన ధన్య జీవులు.* 

లూకా 2: 8-12
ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా
ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి.
అయితే ఆ దూత భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను;
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము)
దానికిదే మీకానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను.

*అత్యంత అనాగరికులు, కాని, ప్రప్రధమంగా రక్షకుని చూచిన ధన్య జీవులు.* 

*దూతలు తరువాత, యేసును చాటిన ప్రప్రధమ సువార్తికులు.*

*లోకజ్ఞానం లేనివారు.* 
(నేను నేటి దినాలలో వుండే గొర్రెల కాపరులను గురించి మాట్లాడడం లేదు. నేడు వారు అత్యంత జ్ఞానము కలిగినవారే.)

🔺గొర్రెలే వారికి సర్వస్వం. 
🔺గొర్రెలను ఎట్లా మేపాలి? 
🔺ఎట్లా కాయాలి? 
🔺వాటికి ఎదురయ్యే సమస్యలు ఏంటి ?

👉వాటిని గురించిన పరిపూర్ణమైన అవగాహన తప్ప, ఇక వేరే విషయాలేమి వీరికి తెలియదు. 
🔺వారి జీవితం వాటితోనే ప్రారంభమవుతుంది. వాటితోనే ముగిసిపోతుంది. 
🔺వారి ఆటలు, పాటలు, సంతోషం, దుఖం అన్నీ పొలాల్లోనే. ఆ గొర్రెలతోనే. 
🔺సమాజంలోని వ్యక్తులతో వీరికి పరిచయాలు కూడా చాలా తక్కువ. కారణం? వీరు ఎక్కువ సమయం గడిపేది గొర్రెలతోనే.

అయితే, 

*ఈలోకంలో ఎంతో మంది జ్ఞానులు, రాజులు , గొప్పవారు వుండగా, రక్షకుని జననవార్త వీరికే తెలియజేయబడింది.*
 
అట్లా అని, 
👉ఇశ్రాయేలు దేశంలో నున్న గొర్రెల కాపరులందరికి కాదు. కొందరికే.

దూత చెప్పిన 
*"రక్షకుడు పుట్టాడు"* అనే, ఒక చిన్న సువార్తమానమునకు *వారియొక్క ప్రతిస్పందన,*
👉బండబారిన మన రాతిహృదయాలకు గొప్ప 
ఆధ్యాత్మిక పాటం.

👉 ఆ గొఱ్ఱలకాపరులు జరిగిన యీకార్యమును ప్రభువు మనకు తెలియజేయించి యున్నాడు
లూకా 2:15

*దూతలు పైనుండి వెళ్తూ పొలంలో మనం కనబడ్డాము కాబట్టి, మనకు చెప్పారు అని కాకుండా,*

👉 దేవుడే స్వయంగా ఈవర్తమానమును మన దగ్గరకు పంపించాడు అని వారు నమ్ముతున్నారు.

👉ఈ చిన్న వర్తమానం నీదగ్గరకు తీసుకు రాబడుతుంది అంటే? 

*ఎవరో పనీ పాటులేక చేసే పనికాదు గాని, ప్రభువే ఈ వర్తమానం నీకు తెలియజేస్తున్నాడు.*
👉 ఆయన ప్రణాళికలో నీవున్నావు. అనే విషయాన్ని నీవు గ్రహించగలగాలి.

👉అట్టి గ్రహింపు నీకు లేకపోతే నీ హృదయం ఎప్పటికీ స్పందించదు.
*దేవుని మాటలు అంటే మనకెంత నిర్లక్ష్యం అంటే?*
 
👉హాయ్! అని మెసేజ్ పెడితే ఒక్క క్షణంలో హాయ్! అని సమాధానం వచ్చేస్తుంది.
👉 గంటలు తరబడి ఆ చాటింగ్ అట్లానే సాగిపోతుంది.
కాని, 
*ఎవరన్నా ఒక చిన్న దేవుని వర్తమానం పంపిస్తే?*
👉 కనీసం *"ఆమెన్"* అనే చిన్న మాట టైపు చెయ్యడానికి కూడా మన చేతులు ఒప్పుకోవు.

*కారణం?* 
👉దేవుడన్నా, దేవుని మాటలన్నా మనకంత నిర్లక్ష్యం.
ఆమెన్ అంటున్నావు అంటే? 
*నీ దగ్గరకు తీసుకు రాబడిన వర్తమానం నీ జీవితంలో నెరవేరాలని కోరుకొంటున్నట్లే!*

*Note:* 
వర్తమానాలు పంపేవారిని సంతోష పెట్టడం కోసం మనము చెప్పే "ఆమెన్" మన ఆధ్యాత్మిక జీవితాలకు మేలు చెయ్యలేవుగాని, 
*నీ దగ్గరకు తీసుకు రాబడిన వర్తమానాన్ని మనఃపూర్వకంగా అంగీకరించి,                     అట్టి రీతిగా జీవించడానికి, స్థిర నిశ్చయం చేసుకొని నీవు చెప్పగలిగితే?                     అది నీ ఆత్మీయ జీవితానికి మేలు.*

*అనాగరికులైన గొర్రెల కాపరుల ప్రతిస్పందన నీ, నా జీవితాలకు గొప్ప మేలుకొలుపు.*

ఆయన మాటకు ప్రతిస్పందిద్దాం! 

ఆయన పాదాల చెంతచేరి ఆరాధిద్దాం!

 2⃣  దూత చెప్పిన 
*"రక్షకుడు పుట్టాడు"*
 అనే, 
👉ఒక చిన్న సువార్తమానమునకు వారియొక్క ప్రతిస్పందన,
బండబారిన మన రాతిహృదయాలకు గొప్ప 
ఆధ్యాత్మిక పాటం.
*"మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని"*
లూకా 2:15

*"ఐకమత్యమే మహా బలం"* అంటూ చిన్నప్పుడు నేర్చుకున్న పాటాలు లెక్కలేనన్ని.

*గడ్డి పరకలు అన్నీ కలిస్తే బలమైన ఏనుగునే బంధించేస్తాయి.*
 
*చలి చీమలన్నీ కలిస్తే విష సర్పాన్నే చంపేస్తాయి.*

*గొర్రెల కాపరులు సమాజములో బలహీనులే. కాని వారిబలం వారి ఐకమత్యమే.*

👉బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొనినప్పుడు, *వారిలో ఒక్కరు కూడా వ్యతిరేకించినట్లు చూడము.*
 
👉వారిదంతా ఒకే మాట. ఒకే బాట.
అందుకే దూత చాటించిన సమాధానాన్ని పొందుకోగలిగారు.

👉 *షోమ్రోను పట్టణం* శత్రువుల ముట్టడి వల్ల, పిల్లలను సహితం వండుకుతినే భయంకరమైన కరవుతో అల్లాడుతున్న సమయంలో,
సిరియా దండు పేటకు వెళ్దామని నలుగురు కుష్టు రోగులు ఒకరితో నొకరు చెప్పుకొంటున్నప్పుడు, 
*వారిలో ఒక్కరుకూడా వ్యతిరేకించ లేదు. వారిదంతా ఒకే నిర్ణయం.*

👉 వారు బ్రతకనిస్తే బ్రతుకుదాం!
👉 చంపేస్తే చచ్చిపోదాం! 
*ఒకే మాట, ఒకే బాట.*

👉ఆ నలుగురు కుష్టురోగుల ఐక్యత షోమ్రోను పట్టణమునకు సంవృద్దియైన ఆహారం పెట్టగలిగింది.

*ఇట్లాంటి పరిస్థితులు మన జీవితాల్లో లోపించాయి.*
👉 ప్రతీ ఒక్కరూ నేను అనుకున్నట్లే జరగాలంటూ ఇతరులతో ఏకీభవించలేని పరిస్థితి.
అందుకే, 
🔺మన సంఘాలను,
🔺 మన కుటుంబాలను సాతాను చీల్చి చెండాడు తున్నాడు.
👉వాడి ఆటలు సాగుతున్నాయంటే? 
కారణం? 
*మనలో ఐక్యత లోపించింది.*
 
👉ఐక్యత లోపించింది కాబట్టే,
👉 సమాధానం లోపించింది.
వద్దు!
*ఒకరినొకరు అర్ధం చేసుకుందాం!*
 
*ఒకరితోనొకరు ఏకీభవిద్దాం!* 
*కలసి కట్టుగా దేవునికోసం జీవిద్దాం!* 

*సమాధానాన్ని అనుభవిద్దాం!*

  3⃣  దూత చెప్పిన 
*"రక్షకుడు పుట్టాడు"* అనే, 
ఒక చిన్న సువార్తమానమునకు గొర్రెల కాపరుల యొక్క ప్రతిస్పందన.

*త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి.* 
లూకా 2:16

👉నిదానమే ప్రధానం అనికాకుండా, 
ఆలస్యమైతే అమృతం సహితం విషమవుతుంది అన్నట్లుగా...... 
*వర్తమానము వారికందిన వెంటనే ప్రతిస్పందించారు. వెళ్ళిపోయారు.*

*ప్రాణముగా ప్రేమించే గొర్రెలను ఏమి చేసారు?*
 *ఎవరికి అప్పగించారు?*
 
👉లోక పాపములు మోసే గొర్రెపిల్లే ఈ లోకానికే వస్తే? 
🔺ఇక ఈ గొర్రెలకోసం ఆలోచించలేదేమో?

👉నిజమైన గొర్రెల కాపరి, ప్రధానకాపరి యొక్క తలంపులతో వారి గొర్రెలు గుర్తురాకుండా పోయాయేమో?

👉మా కంటేముందు ఆయనను మరెవ్వరూ చూడకూడదు, ఆరాధించకూడదు అనుకున్నారేమో?

👉ఎక్కడి వాటిని అక్కడ విడచిపెట్టి పరుగులు తీసారు. 
కారణం? 
*వారి ఆశ ఒక్కటే?* 
🔹ఆయన్ని చూడాలి. 
🔹ఆయన్ని ఆరాధించాలి.
*గొర్రెల కాపరుల జీవితాలు నీ, నా జీవితానికి గొప్ప ఆధ్యాత్మిక పాటం.*

👉దేవుడన్నా, దేవుని మాటలన్నా? 
👉దేవుని మందిరమన్నా? *ఇట్లాంటి ఆశ మనలో లోపించింది కదా?*

*ఎందుకో? దేవుని విషయాలంటే అంత వేగంగా స్పందించలేక పోతున్నాం కదా?*

👉కారణం ఏమయ్యుంటుంది? 
*ఆ ప్రియరక్షకుని గొప్పతనం మనకింకా అర్ధం కాలేదా?*
 
*ఆయన త్యాగం మనకు చులకనయ్యిందా?*

👉ఇస్కరియోతు యూదా యేసు ప్రభువారిని అప్పగించడానికి రోమా సైన్యముతో కలసి వచ్చినప్పుడు, యేసయ్య అంటున్నారు. యూదా నీవు చేయబోవునదేదో త్వరగా చెయ్యి.
👉అంటే? 
*యేసయ్య మనకోసం ప్రాణం పెట్టడానికి త్వరపడుతున్నాడు.*
 
👉కాని, మనమైతే ఆయన త్యాగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయనకోసం త్వరపడలేకపోతున్నాం.

ఇంతకీ, 
🔺గొల్లల వలే ఆయనను ఆరాధించడానికి ఎక్కడికో వెతుక్కొంటూ వెళ్లనక్కరలేదు.
🔺 ఆయనే వెతుక్కొంటూ నీ దగ్గరకి వచ్చాడు. 
*సంవత్సరాల తరబడి నీ హృదయమనే తలుపునొద్ద నిలిచి తట్టుచున్నాడు.*
👉 కనీసం ఇప్పుడైనా ఆ స్వరాన్ని విని,తలుపు తీసి, ఆయనను చేర్చికోగలిగితే? 
*నీ జీవితం ధన్యమౌతుంది.*

ఆరీతిగా మన జీవితాలను 
సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత 
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*


కామెంట్‌లు