💫✨⚡️ *క్రిస్మస్* ⚡️✨💫
(ఆరవ భాగము )
గొర్రెల కాపరులు
🐑———————
🔸అత్యంత అనాగరికులు, కాని, ప్రప్రధమంగా రక్షకుని చూచిన ధన్య జీవులు.
🔸దూతలు తరువాత, యేసును చాటిన ప్రప్రధమ సువార్తికులు.
🔹లోకజ్ఞానం లేనివారు.
(నేను నేటి దినాలలో వుండే గొర్రెల కాపరులను గురించి మాట్లాడడం లేదు. నేడు వారు అత్యంత జ్ఞానము కలిగినవారే.)
🔹గొర్రెలే వారికి సర్వస్వం.
🔹గొర్రెలను ఎట్లా మేపాలి?
🔹ఎట్లా కాయాలి?
🔹వాటికి ఎదురయ్యే సమస్యలు ఏంటి ?
వాటిని గురించిన పరిపూర్ణమైన అవగాహన తప్ప, ఇక వేరే విషయాలేమి వీరికి తెలియదు.
🔹వారి జీవితం వాటితోనే ప్రారంభమవుతుంది. వాటితోనే ముగిసిపోతుంది.
🔹వారి ఆటలు, పాటలు, సంతోషం, దుఖం అన్నీ పొలాల్లోనే. ఆ గొర్రెలతోనే.
🔹సమాజంలోని వ్యక్తులతో వీరికి పరిచయాలు కూడా చాలా తక్కువ. కారణం? వీరు ఎక్కువ సమయం గడిపేది గొర్రెలతోనే.
అయితే, ఈలోకంలో ఎంతో మంది జ్ఞానులు, రాజులు , గొప్పవారు వుండగా, రక్షకుని జననవార్త వీరికే తెలియజేయబడింది. అట్లా అని, ఇశ్రాయేలు దేశంలో నున్న గొర్రెల కాపరులందరికి కాదు. కొందరికే.
దూత చెప్పిన "రక్షకుడు పుట్టాడు" అనే,
ఒక చిన్న సువార్తమానమునకు వారియొక్క ప్రతిస్పందన, బండబారిన మన రాతిహృదయాలకు గొప్ప ఆధ్యాత్మిక పాటం.
ఆ గొఱ్ఱలకాపరులు జరిగిన యీకార్యమును ప్రభువు మనకు తెలియజేయించి యున్నాడు (లూకా 2:15) దూతలు పైనుండి వెళ్తూ పొలంలో మనం కనబడ్డాము కాబట్టి, మనకు చెప్పారు అని కాకుండా, దేవుడే స్వయంగా ఈవర్తమానమును మన దగ్గరకు పంపించాడు అని వారు నమ్ముతున్నారు.
ఈ చిన్న వర్తమానం నీదగ్గరకు తీసుకు రాబడుతుంది అంటే? ఎవరో పనీ పాటులేక చేసే పనికాదు గాని, ప్రభువే ఈ వర్తమానం నీకు తెలియజేస్తున్నాడు. ఆయన ప్రణాళికలో నీవున్నావు. అనే విషయాన్ని నీవు గ్రహించగలగాలి. అట్టి గ్రహింపు నీకు లేకపోతే నీ హృదయం ఎప్పటికీ స్పందించదు.
Note: వర్తమానాలు పంపేవారిని సంతోష పెట్టడం కోసం మనము చెప్పే "ఆమెన్" మన ఆధ్యాత్మిక జీవితాలకు మేలు చెయ్యలేవుగాని, నీ దగ్గరకు తీసుకు రాబడిన వర్తమానాన్ని మనఃపూర్వకంగా అంగీకరించి, అట్టి రీతిగా జీవించడానికి, స్థిర నిశ్చయం చేసుకొని నీవు చెప్పగలిగితే? అది నీ ఆత్మీయ జీవితానికి మేలు.
అనాగరికులైన గొర్రెల కాపరుల ప్రతిస్పందన నీ, నా జీవితాలకు గొప్ప మేలుకొలుపు. ఆయన మాటకు ప్రతిస్పందిద్దాం! ఆయన పాదాల చెంతచేరి ఆరాధిద్దాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి