ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్

🌲💥💫 క్రిస్మస్ 💫💥🎄
          (ఐదవ భాగము) 

🧚‍♀️దూతలు - దూత పాటలు🧚‍♀️

పరలోకంలో ముగ్గురు ప్రధాన దూతలు వుండేవారు. 

🧜‍♀️ 1. లూసీఫరు: దేవుని స్తుతించడానికి.  కాని,తన గర్వముతో దేవునిమీద ఎదురు తిరిగి పరలోకం నుండి త్రోసివేయ బడ్డాడు.

🧜‍♀️ 2.మిఖాయేలు: దేవుని పక్షముగా యుద్దాలు చెయ్యడానికి) 

🧜‍♀️ 3.గాబ్రియేలు: దేవుని వర్తమానం ప్రజలకు తెలియజేయడానికి 

💮 దేవదూతలలో కొన్ని రకాలున్నాయి. 
🔹1. కెరూబులు
🔹2. సెరాపులు
ఇట్లా....  కొన్ని దూతలకు రెండు రెక్కలు, కొన్నింటికి నాలుగు రెక్కలు, మరి కొన్నింటికి ఆరు రెక్కలు వున్నాయి. 

🧚‍♀️ దేవ దూతలు గురించి మాట్లాడేటప్పుడు స్త్రీ లింగమును వాడకూడదు. ( చెప్పింది అనకూడదు. చెప్పాడు అనాలి.) పరిశుద్దాత్ముని విషయంలో కూడా ఇట్లానే మాట్లాడాలి. 

🧜‍♀️ దూత పాటలు:

బైబిల్ గ్రంధములో దూతలు పాటలు పాడిన సందర్భాలు రెండు. 

♻️ 1. దేవుడు భూమికి పునాది వేసినప్పుడు: 

ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు? (యోబు 38:7)

ఉదయనక్షత్రము అంటే? వేకువ చుక్క. 
వేకువ చుక్క అంటే? సూర్యుని కంటే ముందుగా వస్తుంది. అంటే కొద్ది సేపట్లో సూర్యుడు రాబోతున్నాడు అని తెలియజేస్తుంది. వీటితో పాటు దేవదూతలు జయద్వనులు చేస్తుండగా దేవుడు భూమికి పునాధిని వేసాడట. 

♻️ 2. ప్రియ రక్షకుడు ఈలోకంలో జన్మించినప్పుడు దూత సమూహం చేసిన స్తుతి స్తోత్ర గీతాలాపన ఇది. 

వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి, సర్వోన్నత మైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. (లూకా 2:13,14)

ఈ మాటలు చదువుతుంటేనే, హృదయమంతా పులకరించిపోతుంది. ఆ దూతలు పాడితే మరెట్లావుందో కదా?ప్రపంచములోని ఏ సంగీతం కూడా వారి పాటకు సాటిరాదు కదా!

💮 యేసు క్రీస్తు జననం 
👉 పరలోకంలోనున్న దేవునికి మహిమను తీసుకు వచ్చింది. అందుకే యేసు ప్రభువు అంటున్నారు. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని. యోహాను 17:4

💮 యేసు క్రీస్తు జననం 
👉 భూమిమీదనున్న మనకు సమాధానంను  తీసుకు వచ్చింది. ఆయన జన్మించి, ఈ సమాధానం చాటింపబడి రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది. పొలములో ప్రకటించ బడిన ఆ సమాధానం, సిలువలో స్థాపించ బడింది. అయిననూ, నేటికి ఈ సమాధానాన్ని అనుభవించ లేకపోతున్నాము. 

🔸మన జీవితాల్లో సమాధానం లేదు. 
🔸కుటుంబాలలో సమాధానం లేదు. 
🔸సంఘాలలో సమాధానం లేదు. 

కారణమేమిటి? ప్రశ్నలెన్నైనా సమాధానం ఒక్కటే? ఆయన కిష్టులైన మనుష్యులకు మాత్రమే భూమిమీద సమాధానము. ఆ సమాధానాన్ని నేటికీ అనుభవించ లేకపోతున్నాము అంటే? ఆయన కిష్టమొచ్చినట్లు కాకుండా, మనకిష్ట మొచ్చినట్లు జీవిస్తున్నామేమో? 

👉ఎవరు ఆయనకు ఇష్టులు? 
👉ఆ సమాధానం మనకు ఎట్లా లభిస్తుంది? 

యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి, పాపమునుండి ఎవరైతే విమోచన పొందుతారో? వారే ఆయనకు ఇష్టులు. వారికే సమాధానం. 

👉ఏ పాపం నిన్ను వెంటాడుతుందో? 
👉ఏ పాపం నిన్ను బంధించేసిందో? 
శారీరాశా? నేత్రాశా? జీవపుడంబమా? 
అది ఏదయినా సరే! నేడే నీప్రియ రక్షకుని పాదాలచెంత విడచిపెట్టి, ఆ సమాధానాన్ని అనుభవించు. ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

కామెంట్‌లు