ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్

✳ *.....క్రిస్మస్ ......* ✳

(మొదటి భాగము)

*దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.*
లూకా 2:11

👉 *క్రిష్టమస్* అనే మాట బైబిల్ లో వ్రాయబడక పోయినా, 
👉 *ఈస్టర్* అనే మాట బైబిల్ లో లేకపోయినా,  
👉అంత మాత్రం చేత, 
🔹క్రీస్తు పుట్టుక, 
🔹క్రీస్తు మరణం,
🔹క్రీస్తు పునరుత్థానం,

 గురించిన ఆత్మీయ సత్యాలను ధ్యానం చేయకుండా వదిలివేయడం సమంజసం కాదని నా అభిప్రాయం . 
 *బైబిల్లో ఎక్కడా అక్షరార్ధంగా వ్రాయబడక పోయినంత మాత్రనా క్రీస్తు జీవితంలోని ప్రముఖమైన ఘట్టాలను ధ్యానం చేయకుండా వాటిగురించి వచ్చిన అవకాశాలను వదలి వాటికి సంబంధించిన ప్రసంగాలను వదిలివేయకుడదు అని నా అభిప్రాయం* 

*బైబిల్లో ఉన్న ప్రతి వాక్యంలోని సత్యాలను అత్మీయంగానే అర్ధం చేసుకోవాలిగాని అక్షరార్ధంగా కాదు.* 

*మిషనరీ లు చాలామంది సంఘ ఎదుగుదల గురించి ప్రయాసపడి సంఘాల్లో ఇలాంటివి పెట్టి సంఘాలను బలపరచారు*
🔺 *వారు ప్రవేసాపేటినందుకు తప్పు లేదు కాని "ఈ సమాజం ఆచారంగా ఆచరిస్తే తప్పు"*

*పరిశుద్ధ గ్రంధం పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడినది కనుక బైబిల్ లోనే ప్రతి విషయం మనం ఆత్మీయంగా తీసుకుంటేనె వాటిలోని ఆత్మీయ మర్మాలను గ్రహించి ఆత్మీయంగా ఎదగగలం అనేది నా అభిప్రాయం.*
👉 ప్రతీది అక్షరార్ధంగా తీసుకుంటే ప్రభువులో ఎదగలేము.

*ఎందుకంటే అక్షరం చంపుతుంది గాని ఆత్మ జీవింప జేస్తుందు*, 

మేము అక్షరానికి కాదు, ఆత్మకే సేవకులం అని పౌలు భక్తుడు చెప్పుచున్నాడు. 
2 కొరి 3:6  
*ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి యున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును*

1తిమోతికి 6: 3 - 5
*ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను(ఆరోగ్యకరమైన వాక్యములను) దైవభక్తికి అనుగుణ్యమైన బోధనుఅంగీకరింపక, భిన్నమైన బోధనుపదేశించినయెడల వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును,చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యులవ్యర్థవివాదములును కలుగుచున్నవి.*

యోహాను 21: 25
*యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.*

🔺 *విజ్ఞులు ఈ సంగతులను ఆలోచించెదరు,ఆత్మీయంగా బలపడి ,అనుమానములు రేపక. దేవుని వాక్యాంతో అనేకులను ప్రభువువైపు త్రిప్పువారుగా మనలను మార్చను గాక!*
ఆమేన్.
*క్రిస్మస్ అంటే?*
 
👉 క్రీస్తును ఆరాధించడం.

*క్రైస్ట్ అంటే క్రీస్తు*
 
*మాస్ అంటే ఆరాధన*

👉కాని నేటి, 
*"క్రైస్ట్ మాస్ లో క్రైస్ట్ మిస్"* అయిపోతున్నాడు.

👉 కారణం? 
నేటి క్రిస్మస్!!
*"ఇంటి పైన స్టార్ ఇంట్లో బార్"* లా 
మారిపోయింది.

👉నేటి క్రిస్మస్
1⃣ *ఇంటి క్రిస్మస్:* 
🔺ఇంటి శుభ్రం 

2⃣ *ఒంటి క్రిస్మస్* 
🔺క్రొత్త బట్టలు 

3⃣ *పంటి క్రిస్మస్* 
🔺వండుకొని తినడం 
వీటికే పరిమితం.

👉క్రీస్తుఆరాధనా కాస్త 
క్రిస్మస్ సెలబ్రేషన్స్లా మారిపోయాయి. 
*వాటిలో వేసే డాన్సులు రికార్డింగ్ డాన్స్ కి ఎంతమాత్రం తీసిపోవు.*

👉అదేంటి అంటే? 
*దావీదు నాట్యం చెయ్యలేదా?                అంటూ క్లారిఫికేషన్.*

👉దావీదు నాట్యం చేసిన 
సందర్భం వేరు. 
నాట్యం చేసినా?
*ఆయన ఒక గ్రూపు తయారుచేసి స్టెప్పులు నేర్చుకొని నాట్యం చెయ్యలేదు.*

👉క్రిస్మస్ ఎందుకింత 
వికృత రూపం దాల్చుతుంది? 

👉కారణం ఒక్కటే? 
ఆయన జన్మించి రెండు వేల సంవత్సరాలు దాటిపోయినా? 

*నేటికీ మన హృదయాల్లో జన్మించక పోవడమే.*

🔹ఒకరేమో క్రిస్మస్ చెయ్యకూడదంటారు.

🔹మరొకరేమో చేసి తీరాలంటారు.

👉కాని ఒక్కటి మాత్రం గుర్తుంచుకో! 
*దేవునికి దగ్గరయ్యే పని ఏదయినా చెయ్యి.*
 
*దేవునికి దూరమయ్యే పని ఏదీచెయ్యొద్దు.*

👉ఇంతకీ ఈ క్రిస్మస్ నిన్ను దేవునికి దగ్గర చేస్తుందా? దూరం చేస్తుందా?

👉నీ జీవితంలో అనేక క్రిస్మస్ లు దొర్లిపోయాయేమో?
*కనీసం ఈసారి అయినా నిజమైన క్రిస్మస్ ను ఆరాధన చెయ్యగలవా?*

*నేడే ప్రియరక్షకుని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం!*
 
*క్రిస్మస్ తెచ్చే శాంతిని, సమాధానాన్ని అనుభవిద్దాం!*

ఆరీతిగా మన జీవితాలను 
సిద్ద పరచుకుందాం!

*దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.*
లూకా 2:11
👉క్రిస్మస్ అంటే? 
*క్రీస్తు పేరుతో వ్యాపారమా?* 

👉అట్లానేవుంది కదా?

*ప్రపంచ చరిత్రలో ఎక్కువ వ్యాపారం జరిగేది క్రిస్మస్ దినాల్లోనేనట.*

*ఎక్కువ మద్యం అమ్ముడుపోయేది         క్రిస్మస్ దినాల్లోనేనట.* 

*క్లబ్ లు , ఫబ్ లు, రెస్టారెంట్లు రద్దీగా వుండేది క్రిస్మస్ దినాల్లోనేనట.*

👉క్రిస్మస్ పేరుతో క్రీస్తుని ఆరాధించడం మాని, క్రీస్తునే అమ్మేసు కొంటున్నాము. 

*ఇస్కరియోతు యూదా  క్రీస్తుని 30 వెండి నాణెములకు అమ్ముకున్నాడు*

*పేరుకు  మాత్రమే క్రిస్మస్*
👉 ఆరాధించు కొనేది మాత్రం *"మనకు మనమే".*

*మన టేలంట్ చూపించుకోవడానికి క్రిస్మస్ ను వేదికగా మలచుకొంటున్నాం.*
 
*క్రిస్మస్ ఆరాధనలో సినిమా పాటలకు సహితం  డాన్స్ చేసే దుస్థితికి దిగజారిపోయాం.* 

👉ఒక్కమాటలో చెప్పాలంటే? 

*క్రిస్మస్ లో, కనీసం  క్రిస్మస్ ట్రీ కి, క్రిస్మస్ తాతకిచ్చిన ప్రాధాన్యత కూడా క్రీస్తుకు ఇవ్వలేక పోతున్నాం.*
 
*ఆరాధించాల్సిన దేవుని సంగతే మరచిపోతున్నాం.* 

👉దీనికేనా మనం క్రిస్మస్ అని పేరు పెట్టుకున్నది?

👉ఆరాధించే మనసులేకపోతే?
👉ఆరాధించడం చేతకాకపోతే? 
చేతులు కట్టుకొని కూర్చోవడం శ్రేయస్కరం. 

అంతేగాని, 
*క్రిస్మస్ పేరుతో ఆయన అద్భుతమైన త్యాగాన్ని లోకంలో నవ్వులుపాలు చేసే ప్రయత్నం చెయ్యొద్దు.* 

👉అందుకే ఆయన అంటున్నాడు. 
మిమ్మును బట్టియే కదా నా నామం అన్య జనుల మధ్య దూషించ బడుచున్నది? 

అవును! 
👉మన ఆరాధన ఆయనను దూషణ పాలుచేసేదిగా కాకుండా, 
*ఆయనకు మహిమ తెచ్చేదిగా వుండి, అనేక మంది అన్య జనులను రక్షణ లోనికి నడిపించేదిగా వుండాలి.* 

👉ఇదెప్పుడు సాధ్యం? 

*ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడు మాత్రమే. లేకపొతే, నీవు చేసే ఆరాధన ఒక ఆచారమౌతుంది తప్ప, ఆయనకు మహిమను, నీ జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకొని రాలేదు.* 

నీ హృదయం ఆయనకింకా దూరంగానుందా?
నేడే ఆయనను చేర్చుకో! 

ఆరీతిగా మన జీవితాలను 
సిద్ద పరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత 
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!

*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
➖➖➖➖➖➖➖➖➖➖

కామెంట్‌లు