✨💥💫 *క్రిస్మస్* 💥 ✨💫
( మూడవ భాగము)
*క్రిస్మస్ తాత:*
క్రిస్మస్ లో క్రీస్తు ఉన్నాడో లేదో తెలియదు గాని, క్రిస్మస్ లో క్రిస్మస్ తాత లేకపోతే అది క్రిస్మస్సే కాదు. క్రిస్మస్ లో క్రిస్మస్ తాత క్రీస్తునే మించిపోయాడు.
క్రిస్మస్ ను చాలామంది x-mas
(ఎక్స్ మాస్ )అని పిలుస్తుంటారు. అది నిజమే అనిపిస్తుంది కూడా.
లెక్కలు మాస్టారు "తెలియని దానిని" x (ఎక్స్ )అనుకోండి అని చెప్తారు. లెక్క చివర్లో ఆ "x" (ఎక్స్ )విలువ ఎంతో చెప్తారు.
*x-mas *
"x"అంటే? తెలియబడనిది. "mas"అంటే? ఆరాధన. x-mas పేరుతో "తెలియని దానినే ఆరాధిస్తున్నాం." ఆ "x" (ఎక్స్ ) ఏంటో నేటికీ కనుగొనలేని పరిస్థితిలోనే ఉన్నాము.
4 వ శతాబ్ధంలో, టర్కీ దేశంలో
నికోలస్(శాంతా క్లాజ్) అనే వ్యక్తి ఉండేవాడు. సంపన్న కుటుంబములో పుట్టి పెరిగి, చిన్నప్పుడే తలిదండ్రులు కోల్పోయాడు. ఇతడు చాలా జాలిగల హృదయం కలిగిన వాడు. ప్రజల అవసరాలు తెలుసుకొని రహస్యముగా వెళ్లి కొంత సొమ్ము వారింట్లో వేసి వస్తుండేవాడు.
చిన్న పిల్లల విషయంలో కూడా అట్లా జరిగేది, పెద్ద వాళ్ళు చెప్పడంవల్ల డిసెంబర్ 24 రాత్రి క్రిస్మస్ తాత వచ్చి రహస్యంగా బహుమతులు ఇచ్చి వెళ్తాడని వాళ్ళు నమ్మేవారు. తర్వాత కాలంలో ఆయన సెయింట్ గా పిలువబడి , బిషప్ గా కూడా పని చేసినట్లు చరిత్ర చెబుతుంది.
క్రిస్మస్ అంటే? బహుమతుల పండుగని, యేసు క్రీస్తు ఈ లోకానికి బహుమానంగా అనుగ్రహించ బడ్డాడని, క్రిస్మస్ సందర్భముగా ఒకరికొకరు బహుమతులిచ్చు కోవడం, గ్రీటింగ్స్ పంపుకోవడం చేస్తుంటారు. ఫేస్ బుక్, వాట్సాప్ వంటివి వచ్చాక వీటికి అంతేలేదు.
నికోలస్(శాంతా క్లాజ్) కూడా ఇట్లా బహుమానాలు ఇచ్చేవాడని తీసుకొచ్చి క్రిస్మస్ లో అంతర్భాగం చేసేసారు. అది ఎంత వరకూ వచ్చిందంటే? పిల్లలకు క్రీస్తు అంటే తెలియకపోయినా గాని, క్రిస్మస్ తాత అంటే మాత్రం తెలియకుండా వుండదు.
క్రిస్మస్ తాత వస్త్రాలు, అలంకరణ వస్తువుల పేరుతో కోట్ల బిజినెస్ జరుగుతుంది. క్రీస్తు జననానికి, క్రిస్మస్ తాతకు ఎక్కడైనా సంబంధం ఉందా అంటే? లేనే లేదు. ఆచారాల ముసుగులోపడి, దేవుని ఆరాధించలేక పోతున్నాం. దేవునికి చెందవలసిన మహిమ వేటికో అర్పిస్తున్నాం.
ఇది "సృష్టికర్తను మరచి సృష్టిని పూజించడం" కాదంటారా? దేవుని యొక్క స్థానాన్ని మరొకటి తీసేసుకుంటే? అది విగ్రహారాధన కాదంటారా? పది నిమిషాల పిల్లల సంతోషం కోసం ఇట్లాంటి కార్యక్రమాలు ప్రోత్సహించే మనం నిజరక్షకుని ఎట్లా ఆరాధించాలో వారికి తెలియజేయగలిగితే? వారి జీవితమంతా సంతోషమే కదా!
ఈ క్రిస్మస్ లో మనమెందుకు ప్రత్నించ కూడదు? ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి