ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్

✳  *......క్రిస్మస్.......* ✳

 (రెండవ భాగము) 


*ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి*
యోహాను 1: 14

👉 దేవునిగా ఉన్న వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించెను. 
*యేసు భూలోక అవతారంలో, దైవ స్వభావం చురుకుగా (active) ఉన్నది మరియు మానవ స్వభావం నిష్క్రియగా (passive) ఉంది.* 

👉దేవుడు మనుష్యుడయ్యాడు, కానీ మానవుడు దేవుడు కాలేదు.

 కొలస్సి 2:9  
ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత *శరీరముగా క్రీస్తునందు* నివసించుచున్నది

1తిమో 3:16  
*నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను*

గల 4:4 
 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన *స్త్రీయందు పుట్టి* మనము దత్తాపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రము నకు లోబడినవాడాయెను.

యేసు యొక్క దైవ స్వభావం ఎటువంటి పరిస్థితులలోను  మారదు. వాక్యం దేవునిగా మారినప్పుడు ఆయన యొక్క దైవిక స్వభావంలో ఏ మార్పు చెందలేదు.  దైవిక స్వభావం యొక్క వ్యక్తిత్వమే మానవ స్వభావంలో కొనసాగింది మరియు నివసించింది.

ఆయనలో ఉన్న రెండు స్వభావాల యొక్క *మూలం* భిన్నంగా ఉంటుంది. 
👉యేసు యొక్క దైవ స్వభావం నిత్యత్వం నుండి ఉన్నది 
*అనగా అద్వితీయ కుమారునిగా యేసు జగదుత్పత్తి ముందే తండ్రితో బాటుగా నిత్యత్వంలో ఉన్నటువంటివాడు.* (యోహాను 1:14, 18; 3:16).

 
♻ *యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి*
మత్తయి 2:2 

*స్టార్ (నక్షత్రం):*
(స్వయంగా ప్రకాశించేది)

👉ఈలోకంలో చాలా స్టార్స్ వున్నాయ్. 

*సూపర్ స్టార్ 
*టెరా స్టార్ 
*మెగా స్టార్ 
*ఈ స్టార్స్ గా పిలువబడే  వారిని వెంబడించేవారు లోకంలో కోకొల్లలు. 

*ఈ స్టార్స్ వెలుగులో ఉన్నవారిని చీకటిలోనికి తీసుకెళ్తారు తప్ప, చీకటిలోనున్న వారిని వెలుగు లోనికి నడిపించలేరు.* 

అయితే, 
*ప్రకాశ మానమైన నక్షత్రం ఒకటుంది.*
 అది,
🔺ప్రకాశించింది. 
🔺అత్యానందాన్నిచ్చింది
🔺దారి చూపించింది. 
🔺గమ్యం చేర్చగలిగింది. 

*యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువచుక్కయునై యున్నాను.*
ప్రకటన  22:16

*ఆ స్టార్ మన ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు.*

*ఈ స్టార్ కున్న 5 కోణాలు,*
 
*ప్రియ రక్షకుని 5 గుణగణాలను తెలియజేస్తున్నాయి.* 

1.ఆశ్చర్యకరుడు 
2.ఆలోచనకర్త 
3.బలవంతుడైన దేవుడు 
4.నిత్యుడగు తండ్రి 
5.సమాధానకర్త
        యెషయా 9:6 

👉ఇంతకీ నీ గమ్యమేమిటి?
ఏ స్టార్ ని వెంబడిస్తున్నావ్?

👉 ఈ లోకంలో స్టార్స్ ని నీవు కలవాలంటే? 
👉నీకు ఎప్పటికీ అనుమతి దొరకక పోవచ్చు. 
కాని, 
*ఈ స్టార్ నిన్ను కలసుకోడానికి దివి నుండి భువికి దిగి వచ్చింది.* 

*ఈ లోకంలో స్టార్స్ నిన్ను నలిపేస్తారు.                     కాని, ఈ స్టార్ నీకోసం నలిగిపోయింది.* 

👉దివి నుండి దిగి వచ్చిన స్టార్ ను వెంబడించ గలిగితే? 

🔹ఆశ్చర్య క్రియలు నీ జీవితంలో అనుభవిస్తావ్.
🔹నీ ప్రతీ పరిస్థితిని పరిష్కరించుకోగల ఆలోచన దొరుకుతుంది. 
🔹నీ బలహీన సమయాల్లో ఆయనే నీ బలం.
🔹నిత్యమూ నీకు తండ్రిగా ఉంటాడు.
🔹నీ జీవితమంతా సమాధానమే. 

*ఇదెప్పుడు సాధ్యం?*
 
*ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడు మాత్రమే.*

*ఆ స్టార్ ను వెంబడించినప్పుడు మాత్రమే.*

👉నీ హృదయం ఆయనకింకా దూరంగానుందా?
నేడే ఆయనను చేర్చుకో! 

ఆరీతిగా మన జీవితాలను 
సిద్ద పరచుకుందాం! 


♻ *దూతలు - దూత పాటలు*♻

*పరలోకంలో ముగ్గురు ప్రధాన దూతలు వుండేవారు.*

1⃣ *లూసీఫరు* 
(దేవుని స్తుతించడానికి. కాని,తన గర్వముతో దేవునిమీద ఎదురు తిరిగి పరలోకం నుండి త్రోసివేయ బడింది.)
2⃣ *మిఖాయేలు*
( దేవుని పక్షముగా యుద్దాలు చెయ్యడానికి) 

3⃣ *గాబ్రియేలు:* 
(దేవుని వర్తమానం ప్రజలకు తెలియజేయడానికి)

*దేవదూతలలో కొన్ని రకాలున్నాయి. 
1. కెరూబులు
2. సెరాపులు
ఇట్లా....
*కొన్ని దూతలకు రెండు రెక్కలు, కొన్నింటికి నాలుగు రెక్కలు, మరి కొన్నింటికి ఆరు రెక్కలు వున్నాయి.
*దేవ దూతలు గురించి మాట్లాడేటప్పుడు స్త్రీ లింగమును వాడకూడదు.* ( చెప్పింది అనకూడదు. చెప్పాడు అనాలి.) *పరిశుద్దాత్ముని విషయంలో కూడా ఇట్లానే మాట్లాడాలి.*

♻ *దూత పాటలు:* ♻

*బైబిల్ గ్రంధములో దూతలు పాటలు పాడిన సందర్భాలు రెండు.*

1⃣ *దేవుడు భూమికి పునాది వేసినప్పుడు:*

ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?
యోబు 38:7

*ఉదయనక్షత్రము అంటే?వేకువ చుక్క.*

👉వేకువ చుక్క అంటే? 
🔺సూర్యుని కంటే ముందుగా వస్తుంది. 
*అంటే కొద్ది సేపట్లో సూర్యుడు రాబోతున్నాడు అని తెలియజేస్తుంది.*

వీటితో పాటు దేవదూతలు జయద్వనులు చేస్తుండగా దేవుడు భూమికి పునాధిని వేసాడట.

2⃣ *ప్రియ రక్షకుడు ఈలోకంలో జన్మించినప్పుడు:*

వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి, సర్వోన్నత మైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.
లూకా 2:13,14

👉ఈ మాటలు చదువుతుంటేనే, హృదయమంతా పులకరించిపోతుంది. ఆ దూతలు పాడితే మరెట్లావుందో కదా?
(దేవునిచిత్తం అయితే ఈ దూత పాటను రేపటి దినమున ధ్యానిద్దాం)

👉చివరిగా ఒక్క ప్రశ్న!
దూత ఈ సమాధానం ప్రకటించి సుమారు రెండువేల సంవత్సరాలు దాటిపోయింది.
*పొలములో ప్రకటించ బడిన ఆ సమాధానం, సిలువలో స్థాపించ బడింది.*

అయితే, 
👉నీ జీవితంలో ఆ సమాధానాన్ని పొందుకోగలిగావా?
లేకుంటే? 
*నేడే నీ పాప భారాన్ని ఆయనకు అప్పగించి ఆ సమాధానాన్ని పొందుకో!*

ఆరీతిగా మన జీవితాలను 
సిద్ద పరచుకుందాం!


 ♻ *దూత పాట* ♻

*వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూత తో కూడనుండి, సర్వోన్నత మైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.*
లూకా 2:13,14

👉 ప్రియ రక్షకుడు ఈలోకంలో జన్మించినప్పుడు దూత సమూహం చేసిన స్తుతి స్తోత్ర గీతాలాపన ఇది. 
*ఈ మాటలు చదువుతుంటేనే, హృదయమంతా పులకరించిపోతుంది. ఆ దూతలు పాడితే మరెట్లావుందో కదా?*
 
👉ప్రపంచములోని ఏ సంగీతం కూడా వారి పాటకు సాటిరాదు కదా!

 ♻ *యేసు క్రీస్తు జననం పరలోకంలోనున్న దేవునికి మహిమను తీసుకు వచ్చింది.* 

👉అందుకే యేసు ప్రభువు అంటున్నారు. 
చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని. 
యోహాను 17:4

♻ *యేసు క్రీస్తు జననం భూమిమీదనున్న మనకు సమాధానంను తీసుకు వచ్చింది.* 

👉ఆయన జన్మించి, ఈ సమాధానం చాటింపబడి రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది. 
*పొలములో ప్రకటించ బడిన ఆ సమాధానం, సిలువలో స్థాపించ బడింది.*
అయిననూ, 
👉నేటికి ఈ సమాధానాన్ని అనుభవించ లేకపోతున్నాము. 
🔺 మన జీవితాల్లో సమాధానం లేదు. 
🔺 కుటుంబాలలో సమాధానం లేదు. 
🔺 సంఘాలలో సమాధానం లేదు. 
*కారణమేమిటి?* 
ప్రశ్నలెన్నైనా సమాధానం ఒక్కటే? 
*"ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానము."*
👉ఆ సమాధానాన్ని నేటికీ అనుభవించ లేకపోతున్నాము అంటే? 
*ఆయన కిష్టమొచ్చినట్లు కాకుండా, మనకిష్ట మొచ్చినట్లు జీవిస్తున్నామేమో?*
 
*ఎవరు ఆయనకు ఇష్టులు?*
 
*ఆ సమాధానం మనకు ఎట్లా లభిస్తుంది?* 

👉యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి, పాపమునుండి ఎవరైతే విమోచన పొందుతారో? 
*వారే ఆయనకు ఇష్టులు. వారికే సమాధానం.*
 
🔺ఏ పాపం నిన్ను వెంటాడుతుందో? 

🔺ఏ పాపం నిన్ను బంధించేసిందో? 
🔸శారీరాశా?
🔸నేత్రాశా?
🔸జీవపుడంబమా? 
👉అది ఏదయినా సరే! 
*నేడే నీప్రియ రక్షకుని పాదాలచెంత విడచిపెట్టి, ఆ సమాధానాన్ని అనుభవించు.*
 
ఆరీతిగా మన జీవితాలను 
సిద్ద పరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత 
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...