ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్ సందేశాలు

✳ *క్రిస్మస్ సందేశాలు* ✳

(4 వ భాగము )

*గొప్ప దేవుని గొప్ప నామము "యేసు"*

మత్తయి 1:21  తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు *యేసు* అను పేరు పెట్టుదువనెను.

*యేసు అను నామం* అన్ని నామముల కన్నా పై నామం అనగా గొప్ప నామం. కీర్తనలు 76:1 యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో ఆయన *నామము గొప్పది*. 

గొప్ప నామము అనగా ఎక్కువమంది ఎరిగిన నామము. *యేసు నామం* అన్ని నామములకన్న ఘనమైన నామం. కారణం యేసు నిజమైన దేవుడు. నిజ దేవుణ్ణి ఎరిగి ఉండడమే ఒక వ్యక్తికి ఉండగలిగిన అతి శ్రేష్ఠమైన ధన్యత. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల ధన్యత ఇదే. ఇప్పుడు ఈ ఏకైక నిజ దేవుడు యేసు లోకమంతా వ్యాపించి ఉన్న క్రీస్తు విశ్వాసులందరికీ తెలిసి ఉన్నవాడు గనుక యేసు నామము గొప్ప నామము.

యేసు నామం గొప్పది కారణం యేసు తనను తగ్గించుకున్నంత దీన స్థితికి ఎవరూ తగ్గించు కోలేదు. ఆయన హెచ్చించబడినంత ఉన్నత స్థితికి ఎవరినీ హెచ్చించడం జరగలేదు. ఆయన మాత్రమే దానికి అర్హుడు కాబట్టి యేసు *నామమునకు* ఎంతో ఎత్తయిన స్థానం ఉంది. 

ఫిలిప్పి 2:9-11 అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును *యేసు నామమున* వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.

అటువంటి *గొప్పనామము* కలిగిన యేసును ఎరుగుటయే నిత్యజీవమును పొందుకొనుట. (యోహాను 17:3  అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.)

దేవుని నామము అంటే ఆయన స్వభావం. ఆయన పేరును కీర్తించడమంటే ఆయన పేర్లలో ఒకదాన్ని పదేపదే వల్లించడం కాదు. ఆయన స్వభావాన్ని, గుణశీలాలను ఆనంద పూర్వకంగా గుర్తించి తలచుకోవడం ద్వార జరగాలి అనగా యేసు నామమునకు మాత్రమే స్తుతులు చెల్లించాలి.  

(కీర్తనలు 113:2 ఇది మొదలుకొని యెల్లకాలము *యెహోవా నామము* సన్నుతింపబడునుగాక.) ఈ లోకంలో మనం ఎటువంటి ఆందోళన చెందకూడదు. కారణం మనం *యేసు నామంలో ప్రార్ధన* అనే గొప్ప ఆయుధం మనకు దేవుడు ఇచ్చాడు. సఫలమైన ప్రార్థన క్రీస్తు *పేరట* చేసేదే. ఏ ఇతర నామం, ఏ ఇతర మధ్యవర్తీ అవసరం లేదు. ఆయన పేర చేసే ఎలాంటి ప్రార్థనకైనా ఆయన తానే జవాబిస్తాడు కాబట్టి మన ప్రార్థనలకు జవాబు కోసం పరలోకంలో గానీ భూమిపై గానీ మరెవరి సహాయమూ మనకు అవసరం లేదన్నది స్పష్టమే. 

ఇక్కడ “యేసు నామములో ప్రార్ధన” ఆయనలోని సమస్తాన్ని, ఆయన స్వభావాన్ని, లక్షణాన్ని, అధికారాన్ని, సంకల్పాన్ని సూచిస్తున్నది. ఆయన గురించి సమస్తము మనకు వాక్యంలో వెల్లడి చేయబడినది. అందువల్ల మన ప్రార్థన దానికి అనుగుణంగా ఉండాలి. యోహాను 14:14 *నా నామమున* మీరు నన్నేమి అడిగినను నేను చేతును.

*యేసు నామం గొప్పది* కారణం

👉 *1. యేసు నామం ద్వారా రక్షణ:* మత్తయి 1:21  తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను అపో 4:12  మరి ఎవని వలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.

👉 *2. యేసు నామం ద్వారా పాప క్షమాపణ:* అపో 10:43  ఆయనయందు విశ్వాసము ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్త లందరు ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చు చున్నారనెను

👉 *3. యేసు నామం ద్వారా ప్రార్ధన:*   యొహాను 14:13-14  మీరు నా నామమున దేనినడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై  దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.

👉 *4. యేసు నామం ద్వారా బోధించుట:* అపో 9:29  ప్రభువు నామమునుబట్టి ధైర్యముగా బోధించుచు, అపో 4:18  అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి యెంత మాత్రమును మాటలాడ కూడదు,  బోధింపను కూడదని వారికాజ్ఞాపించిరి అపో 5:28  ప్రధానయాజకుడు వారిని చూచిమీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా?

👉 *5. యేసు నామం ద్వారా ఆజ్ఞాపించుట:* 2 థెస్స 3:6  సహోదరులారా, మావలన పొందిన బోధన ప్రకారముకాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్దనుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించు చున్నాము.

👉 *6. యేసు నామం ద్వారా అధ్బుతాలు:*  అపో 3:6 అంతట పేతురు వెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు *క్రీస్తు నామమున నడువుమని* చెప్పి వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను.

👉 *7. యేసు నామం ద్వారా స్వస్థత:* అపో 4:10  మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసిన దేమనగా,  మీరు  సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన *యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థతపొంది* మీ యెదుట నిలుచుచున్నాడు.

👉 *8. యేసు నామం ద్వారా దయ్యపు శక్తుల నుండి విడుదల:* అపో 16:18  ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగినీవు ఈమెను *వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున* ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను; వెంటనే అది ఆమెను వదలి పోయెను. లూకా 10:17  ఆ డెబ్బదిమంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి  ప్రభువా, *దయ్యములు కూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవని* చెప్పగా...

👉 *9. యేసు నామం ద్వారా బాప్తిస్మము:* అపో 2:38  పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు *యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము* పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అపో 8:16  అంతకు ముందు వారిలో ఎవనిమీదను ఆయన దిగియుండ లేదు, వారు ప్రభువైన *యేసు నామమున బాప్తిస్మము* మాత్రము పొందియుండిరి. అపో 10:48  *యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని* ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమయొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి  

👉 *10. యేసు నామం ద్వారా శ్రమలు అవమానం ఎదుర్కొనుట:* అపో 5:41  ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి... అపో 9:16  ఇతడు *నా నామము కొరకు ఎన్ని శ్రమలను* అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను.  

👉 *11. యేసు నామం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట:* 1కొరి 6:11  మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు *క్రీస్తు నామమునను* మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధ పరచబడినవారై *నీతిమంతులుగా తీర్చబడితిరి*

👉 *12. యేసు నామం ద్వారా కృతజ్ఞతా స్తుతులు:* ఎఫెస్సి 5:20  మన ప్రభువైన *యేసుక్రీస్తు పేరట* సమస్తమును గూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును *కృతజ్ఞతా స్తుతులు* చెల్లించుచు... కొలస్సి 3:17  మరియు  మాటచేత గాని  క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన *యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,* సమస్తమును ఆయన పేరట చేయుడి.

👉 *13. యేసు నామం ద్వారా యేకమనస్సు (ఐక్యత):* 1కొరి 1:10 సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాట లాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సు తోను ఏకతాత్పర్యము తోను, మీరు సన్నద్ధులై యుండ వలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు *పేరట* మిమ్మును వేడుకొనుచున్నాను

👉 *14. యేసు నామం ద్వారా చూపిన ప్రేమను దేవుడు మరువడు:* హెబ్రీ 6:10  మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుట చేత *తన నామమును బట్టి* చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు

👉 *15. ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండు యేసు నామం:* కీర్తనలు 113:3 సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యోహాను 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును కీర్తన 25:5  నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము  చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను. 

ప్రభువు తన యొక్క ఘనమైన నామము ద్వారా మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు చేయును గాక. ఆమెన్!
(To be continued..)

దైవాశ్శీసులు

From the desk of..
Pastor Jyothi Raju Vemula
_(Soli Deo Gloria)_

Immanuel Bible College 
NIDUBROLU

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...