✳ *క్రిస్మస్ సందేశాలు* ✳
(1 వ భాగము )
1⃣ *ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును*
లూకా 1:30-32 దూత మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన *గొప్పవాడై* సర్వోన్నతుని కుమారుడనబడును.
ప్రభువు గొప్పవాడు. ఆయన భూమి మీద *గొప్పవాడుగా* జన్మించుటకు గల కారణమేమి?
ఈ భూమి మీద అనేకమైన గొప్పవి కలవు. భూమి మీద అన్నిటికన్నా ఏది గొప్పది.
*1.భూమి మీద ఉన్న మానవుల దోషం (పాపం) భరించలేనంత గొప్పది:* – మానవుల పాపం భరింపలేనంత గొప్పది. ఆదికాండం 4:13 అందుకు కయీను నా దోషశిక్ష నేను భరింపలేనంత *గొప్పది.*
అవును. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వలన జీతం మరణం. పాప శిక్ష బహు భయంకరం. దేవుడు చెప్పిన మాట వినకపోతే, ఆయన ఆజ్ఞాపించే ఆయన ఆజ్ఞలన్నిటినీ ప్రకారం ప్రవర్తించకుండా ఉంటే, శాపాలన్నీ తగులుతాయి ద్వితీయ 28: 15 నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును.
పాపంవల్ల కలిగే *గొప్ప శిక్ష* ఏమంటే దేవుని సన్నిధి నుండి ఎడబాటు, ఒంటరితనం, భయం, నిరుత్సాహం, జీవితాంతం ఉండే శాపం.
తన ప్రజలను శపించాలని దేవునికిష్టం లేదు. శాపాలన్నవి మనిషి చేసే పాపాలు, చూపే అవిధేయత, తిరుగుబాటు మూలంగా కలిగే ఫలితాలు. అవి దేవుని న్యాయవిధి అమలు జరిగే విధానాలు.
*2. భూమి మీద నరుల చెడుతనం గొప్పది:* మనలో కూడా శరీర స్వభావ రీత్యా చెడుతనం ఉన్నది. (ఆది కాండం 6:5 నరుల చెడు తనము భూమిమీద *గొప్పదనియు*, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి..... )
ఆదాము చేసిన ఆ ఒక్క పాపం ఫలితం భూమి విస్తరించిన గొప్ప చెడుతనం. పాపం అంతరంగంలో ఆరంభం కావడం గమనించండి. ఇది హృదయంలోని చెడుతనం. ఇక మనిషిని అతడి చెడు స్వభావానికే వదిలి వేస్తే దేవునికి మంచి అనిపించే ఒక్క తలంపు కూడా ఉండకపోవడం గమనించండి.
*3. భూమి మీద ఉన్న మరణం గొప్పది:* మానవుడు చేసిన పాపం, చెడుతనం మరియు దోషం భూమి మీద గొప్పది కనుక దానికి ప్రతిఫలముగా భూమి మీదకు గొప్ప మరణం వచ్చింది. రోమ 6:23 ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము... 2కొరి 1:10 ఆయన అట్టి *గొప్ప మరణమునుండి* మమ్మును తప్పించెను.
*4. అందరికంటే గొప్పవాడు ప్రభువైన యేసు క్రీస్తు:* ఇటువంటి గొప్ప పాపం నుండి, గొప్ప చెడుతనం నుండి గొప్ప మరణం నుండి మనలను రక్షించుటకు అందరికంటే గొప్పవాడు ఈ లోకంలో పుట్టవలసి యున్నది. ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను.
గొప్ప మరణము నుండి ఆయన మనలను తప్పించుటకు సమర్ధుడు. కారణం మన ప్రభువు మరణం కంటే గొప్పవాడు. అపో.కా 2:24 మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను. కీర్తన 48:1 యెహోవా *గొప్పవాడును* బహు కీర్తనీయుడునై యున్నాడు. హెబ్రీ 13:20 గొఱ్ఱల *గొప్ప కాపరియైన* యేసు అను మన ప్రభువును...
అందుకే ఒక భక్తుడు ఇలా పాడి దేవుని స్తుతించాడు.
"ప్రభువు గొప్పవాడును
అధిక శక్తి సంపన్నుడు,
జ్ఞానమునకు ఆయనే
మితియు లేనివాడని,
దేవునికి స్తోత్రము గానము
చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము
చేయుటయే మంచిది."
కీర్తన 147:5 మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు.
అటువంటి గొప్ప వాడైన యేసును ఈ ఆడ్వెంట్ సమయంలో ఆరాధించి ధన్యుల మవుదాం.
దైవాశ్శీసులు
(To be continued...)
From the desk of..
Pastor Jyothi Raju Vemula
_(Soli Deo Gloria)_
Immanuel Bible College
NIDUBROLU
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి