ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యేసయ్యకు నీ జీవితముపై సర్వాధికారము ఉన్నదా

🌈 _*యేసయ్యకు నీ జీవితముపై సర్వాధికారము ఉన్నదా?*_ 🌈

🌸 జాన్ అనే అతను తనకి ఉన్న డబ్బుతో అందమైన భవనము నిర్మించుకుంటాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ సంతోషముగా జీవిస్తున్న సమయములో ఒకదినము ఎవరో తలుపు తట్టినట్లు ఉంటె వెళ్లి చూడగా యేసయ్య. అత్యానందభరితుడై యేసయ్యను తన ఇంటిలోనికి ఆహ్వానించి తనకి ఉన్న పది గదులలో ఒక గదిని యేసయ్యకు ఇస్తాడు.

🌸 మరుసటి రోజు తలుపు తట్టినట్లు ఉంటె వెళ్లి చూడగా వచ్చింది సాతాను , అతన్ని చూచి అమ్మో అని అరచి తనని ఇంట్లోకి రానివ్వకుండా ఎంతగానో పోరాడటానికి ప్రయత్నిస్తుండగా సాతాను అతన్ని ఎన్నో శోధనలు ద్వారా, పాపాల ద్వారా, అనుమానాల ద్వారా, పరీక్షల ద్వారా అతను ఓడిపోయేలా చేసి సాతాను వెళ్ళిపోతాడు.

🌸 అప్పుడు జాన్ యేసయ్య నా ఇంట్లో ఉన్నప్పటికీ ఇంత యుద్ధము జరుగుతుంటే వచ్చి నాకు ఎందుకు సహాయము చేయలేదు అనుకుని వెళ్లి యేసయ్యను అడుగుతాడు, నువ్వు నీ జీవితమనే ఇంటిలో కేవలము ఒక గదిపై మాత్రమే నాకు హక్కులు ఇచ్చావు, ఒక గదిలో మాత్రమే నన్ను ఉండమన్నావు  మరి నీవు వేరో గదిలో ఉండి యుద్ధము చేస్తుంటే నేను ఎలా రాగాలను అని అడుగుతాడు.

🌸 నిజమే ప్రభువా నన్ను క్షమించు అని అడిగి యేసయ్యకు మరో ఐదు గదులలో ఉండటానికి అవకాశం ఇస్తారు, హక్కును ఇస్తారు.

🌸 మరుసటి రోజు కూడా ముందు రోజులానే సాతాను వస్తాడు, ఎన్నో ఆటంకాలు, అవరోధాలు కలిపిస్తాడు. మరలా ఇతను ఓడిపోతాడు. ఇదేంటి ఇప్పుడు నేను మరలా ఓడిపోయాను యేసయ్య ఇప్పుడు కూడా నాకు ఎందుకు సహాయము చేయలేదు అనుకుని వెళ్లి  యేసయ్యను అడుగుతాడు.

🌸 జాన్ నీవు నాకు అధికారము ఇచ్చిన గదుల యొద్దకు సాతాను రాలేదు కాబట్టి సాతాను వచ్చిన, నిన్ను జయించిన గదులలో నేను లేను కదా అందుకే నీవు ఓడిపోయావు నీ జీవితమనే ఇంటిలో నాకు సర్వాధికారము లేదు నీవు కొన్ని విషయాలలోనే (గదులలోకే) నన్ను అనుమతించవు కాబట్టే నీవు ఓడిపోయావు అని చెప్తారు.

🌸 నిజమే ప్రభువా నేను తప్పు చేశాను అని చెప్పి జాన్  యేసయ్యకు తన జీవితమనే ఇంటిని సంపూర్ణముగా సమర్పించి ఆ ఇంటి తాళపు చెవులను యేసయ్యకు అప్పగిస్తాడు.

🌸 యధాప్రకారముగా మరుసటిరోజు సాతాను వచ్చి తలుపు తడతాడు. అప్పుడు యేసయ్య వెళ్లి తలుపు తెరవగా సాతాను భయపడి  యేసయ్య ఎదుట మోకరించి వేరే ఇంటికి వెళ్ళాల్సింది పొరపాటున ఇటు వచ్చాను అని చెప్తాడు.

🌿 నిజమే జాన్ వలే మనము కూడా దేవునికి మన జీవితముపై సర్వాధికారమును ఇవ్వము, కొన్ని విషయాలలోనికి (గదులలో) దేవుణ్ణి మనం అనుమతించము, ఆ గదులలో ఎదో రహస్య పాపము, అబద్దము, మోసము, అపరిశుద్ధత, దేవునికి ఇష్టములేని జీవితమును కలిగి ఉంటాము వాటిపై దేవునికి అధికారము ఇవ్వము, యేసయ్య వాటిని కడిగి మనల్ని పరిశుద్ధపరచుటకు అనుమతించము కానీ దేవునికి ఇదంతా తెలుసు అనే విషయము మర్చిపోయి దేవుణ్ణే మోసము చేస్తుంటాము.

🌿 అందుకే మనం ఇంకా సాతాను దాడులకు ఓడిపోతున్నాము, శోధనలలో కృంగిపోతున్నాము, అపజయము పాలవుతున్నాము. కానీ ఎప్పుడైతే యేసయ్యతో అన్యోన్య సహవాసము కలిగి ఆయనకు మన జీవితమనే ఇంటిపై పూర్తి అధికారము ఇస్తామో అప్పుడు ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పరిశుద్ధపరచి, జయజీవితమును మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి మన ప్రవర్తన అంతటియందు, మన జీవితముపై సర్వాధికారమును దేవునికి ఇద్దాము. యేసుక్రీస్తు ద్వారా మనకు నిరంతరము విజయము చేకూరుతుంది.

🌿 నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును - సామెతలు 3:6👍🙏

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...