✳ *అపోస్తలుల బోధ.....✍*
*" ఏలాగనగా మొదట ఒక గుడారమేర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దానిమీద ఉంచబడిన రొట్టెలును ఉండెను, దానికి లపరిశుద్ధస్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను. అందులో సువర్ణధూపార్తియు, అంతటను బంగారురేకులతో తాపబడిన నిబంధనమందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికఱ్ఱయు, నిబంధన పలకలును ఉండెను. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటినిగూర్చి యిప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు."*
(హెబ్రీయులకు 9:2-5 )
👉భక్తుడు హేబ్రియులకు ఒక పత్రిక వ్రాస్తూ....9వ అధ్యాయంలో పాతనిబంధన కాలంలోని మందిర సేవా నియమమును అలాగే అలనాటి ప్రత్యేక్షపుగుడారములోని ముక్య వస్తువులను గురించి వివరించెను.
అలాగే. . . . నిర్గమకాండము 25 నుండి 27 వ అధ్యాయం వరకు అలనాటి ప్రత్యేక్షపుగుడారములోని ముక్య వస్తువులను గురించి క్లుప్తంగా వాక్యం మనకు వివరిస్తుంది.
🔺ఆ వస్తువులు ఏమనగా. . . .
▪బలిఫిఠము,
▪ గంగాళము,
▪దీపస్తంభము,
▪బల్ల,
▪ ధూపవేధిక,
▪మందసము అందులో పదిఆజ్ఞలుగల రెండు రాతి పలకలు, మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన ఆహారోను కర్ర.
ఇవే అలనాటి ప్రత్యేక్షపుగుడారములోని ముక్య వస్తువులు.
నా ప్రియ స్నేహితులారా. . . . గమనించండి.
వాక్యం ఇలాగు చెబుతుంది....
*"ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజరూపము కాదు"* అని.
👉అవును....
🔺అలనాడు మందిరములో వాడిన ప్రతి వస్తువుకి ఒక అర్ధం, నిజస్వరూపం ఉంది.
🔹 బలిఫిఠము....
*పచ్చాత్తపానికి, పాపక్షమాపణకు సాదృశ్యం.*
🔹 గంగాళము....
*మారుమనస్సు, శుధీకరణ, బాప్తిసము, నూతన జన్మకు సాదృశ్యం.*
🔹దీపస్తంభము....
*సంపుర్ణమైన ఆత్మ నింపుదలకు సాదృశ్యం.*
🔹ధూపవేధిక....
*యదార్ధమైన ప్రార్ధనకు సాదృశ్యం.*
🔹మందసములోని రాతి పలకలు....
*తండ్రియైన దేవునికి సాదృశ్యం.*
🔹మన్నాగల బంగారు పాత్ర....
*కుమారుడైన దేవునికి సాదృశ్యం.*
🔹చిగురించిన ఆహారోను కర్ర....
*పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం.*
🔹కరుణాఫిఠము....
*దేవుని సింహాసనానికి, త్రియేక దేవుని ప్రత్యక్షతకు సాదృశ్యం.*
👉 ఇది ఆనాడు దేవుడు ఏర్పరచిన పరిశుద్ధమందిర క్రమము. . . .
👉మన నేటికాలపు పరిశుద్ధమందిరాలలోకూడా ఇవి అన్ని తప్పక ఉండాలి. . . .
👉 అంటే ఈ వస్తువులు ఉండాలి అని కాదు ఈ మందిరపు సాదృశ్యం లక్షణాలు ఉండాలి అని.
👉మీరు చదువుతూ ఒక విషయాన్నీ గమనించారో లేదో. . . .
👉నేను ఒక వస్తువును దాటవేశాను. . . .
👉అదే
*సన్నిధి రొట్టెల బల్ల*
ఈ రోజు మన ద్యానించే అంశం ఇదే.
👉 *" సన్నిధి రొట్టెల బల్ల "* దేనికి సాదృశ్యం ?
( నిర్గమ 25:30) లో దేవుడు నిత్యము ఈ సన్నిధి రొట్టెలు ఈ బల్లపై ఉండాలి అని మోషేతో అజ్ఞానాపించాడు.
మిగిలిన అన్ని వస్తువులవాలే
🔺ఈ *" సన్నిధి రొట్టెల బల్ల "* మందిరములో ప్రధానమైన వస్తువు.
👉ఇది మందిరములో తప్పక ఉండాలి అని మోషేతో దేవుడు అజ్ఞాపించారు.
మరి.... ఈ
👉 *" సన్నిధి రొట్టెల బల్ల "* దేనికి సాదృశ్యం ?
గమనించండి....
👉ఈ సన్నిధి రొట్టెల బల్లపై రెండు వరుసలుగా రొట్టెలు పేర్చి ఉంటాయి. ఒక్కొక వరుసలో 6 రొట్టెల చొప్పున *మొత్తము 12 రొట్టెలు ఉంటాయి.*
( లేవి 24:6).
👉ఈ 12 రొట్టెలే ఎందుకు ? యేసు తనే స్వయంగా కొందరిని తన శిష్యులనుగా ఏర్పరచెను వారిలో ఇస్కారియోతు యూదా తన దారి తప్పిపోయి తన ప్రాణాలు తనే తీసుకున్నాడు అటుతరువాత మిగిలిన అపోస్తలులు చిట్లు వేసి 12వ అపోస్తలుడిని ఎన్నిక చేసారు ఈ 12 మంది కలసి యేసు ప్రారంభించిన పరిచర్యను కొనసాగించారు,
🔺సువార్త ప్రకటించారు, బోధించారు.... వీరి బోధనా సిధంథాన్ని
*అపోస్తలుల బోధ*
అని పిలుస్తారు.
అవును. . . .
👉ఈ సన్నిధి రొట్టెల బల్ల, దాని మీదవున్న 12 రొట్టెలు.... 12 అపోస్తలుల బోధకి సాదృశ్యం.
ఏంత అద్భుతమో ఒక్కసారి చూడండి....
👉ఈ సన్నిది రొట్టెల బల్లపై ఉండవలసిన 12 రొట్టెలు ఒకే కొలతలలో ఉండలి అని వ్రాయబడింది. (లేవి 24:5).
👉అలాగే.... ఈ అపోస్తలులు ఉండటానికి 12 మంది ఉన్నా వారి బోధ మాత్రం ఒకే కొలతలో, ఒకేలా ఉంది; అందుకే వారి బోధను విడదీయకుండా కలిపి *"అపోస్తలుల బోధ"* గా పిలిచారు.
*ఒకే మాట, ఒకే బోధ.*
👉మన నేటికాలపు పరిశుద్ధమందిరాలలో కూడా ఈ *"అపోస్తలుల బోధ"* తప్పక ఉండాలి. ఒకే మాట, ఒకే బోధ.
👉ఈ అపోస్తలుల బోధ ద్వారా కట్టబడ్డయి కనుకే ఆ ఆదిమకాలపు యెరూషలేము, అంతియోకయా మరియు మిగిలిన సంఘాలు అద్భుతాలు చేశాయి, అద్భుతాలుగా నిలచిపోయాయి. ( అపో.కా 2:42).
👉ఈ *"అపోస్తలుల బోధ"* మనిషిని బట్టి మారిపోదు.
👉ఈ *"అపోస్తలుల బోధ"* సంఘాన్ని బట్టి మారిపోదు.
🔺కానీ నేడు సువార్త పరిచర్యలో లక్షలకొద్ది పధతులు,
🔺వేలకొద్ది మార్గాలు.
🔺ప్రతి సంఘానిది ఒక్కొక్క బోధ. . . .
🔺ఒకరు మాదే పరలోకం ఇచ్చి సంఘం అంటారు.
🔺ఒకరు మాదే నిజమైన సంఘం అంటారు.
🔺ఒకరు మందిరంలోనే విగ్రహారాధన చేస్తూ, bible లోని మనుషులను ఆరాధిస్తూ ఉంటారు.
........
మంచిది. . . .
👉 *వీటిలో అపోస్తలుల బోధ ఏది ?*
👉ముందు నాకు అపోస్తలుల బోధ అంటే ఏంటి అనేది తెలిస్తే మిగిలిన దొంగ బోధలకు నేను దూరంగా ఉండగలను.
అపోస్తలుల బోధ గురించి bible మొత్తం తిరగేయకుండానే.... నేర్చుకోవచ్చును.
👉అపో.కా 2వ అధ్యయము.... పెంతుకోస్తను దినమున మెడ గదిలోని శిష్యులకు ఆత్మ అనుగ్రహింపబడింది ఈ క్రమంలో కొందరు శిష్యులను అపహాస్యము చేసారు. . . . అప్పుడు పేతురు లేచి ఆ జనులతో ఒక ప్రసంగం చేసాడు. 3000 మందిని మార్చిన ప్రసంగం అది, మొదటి సంఘం కట్టబడుటకు ప్రేరేపించిన ప్రసంగం అది.
"Acts 2:14-40" వరకు ఈ ప్రసంగం చాలా వివరంగా వ్రాయబడింది. *ఇక్కడే అపోస్తలుల బోధ దాగివుంది.*
👉 అపోస్తలుల బోధలో మొదటగా దేవుని ఆత్మ శక్తితో, ఆత్మ అభిషేకముతో ప్రకటింపబడుతుంది. (అపో.కా 2:1-3)
🔺 *దేవుని వాక్యం మాత్రమై ప్రకటింపబడుతుంది.*
(అపో.కా 2:16-35).
🔺 *సిలువ వేయబడిన యేసుని, పునరుద్ధనుడైన యేసుని గురించి ప్రకటింపబడుతుంది.*
(అపో.కా 2:22-24).
🔺 *యేసు దేవుని కుమారుడని ప్రకటింపబడుతుంది.*
(అపో.కా 2:31-36).
🔺 *యేసే; మెసయ్య ; క్రీస్తు అని ప్రకటింపబడుతుంది.* (అపో.కా 2:22-36).
🔺 *ప్రాముఖ్యంగా యేసుక్రీస్తే దేవుడని ,ప్రభువని ప్రకటింపబడుతుంది.*
(అపో.కా 2:36).
🔺 *పాపక్షమాపణ గురించి ప్రకటింపబడుతుంది.*
(అపో.కా 2:38).
🔺 *మారుమనస్సు, బాప్తిసము గురించి ప్రకటింపబడుతుంది.*
(అపో.కా 2:38).
🔺 *పరిశుద్ధాత్మఅను వరమును ఎలా పొందుకోవాలో ప్రకటింపబడుతుంది.*
(అపో.కా 2:38).
🔺 *ఈ బోధలో అన్వయింపు కూడా ప్రకటింపబడుతుంది.* (అపో.కా 2:38-40).
♻ *ఈ బోధ ఉన్న సంఘం బలముగా కట్టబడుతుంది.* (అపో.కా 2:41).
👉నా ప్రియ స్నేహితులారా....
ఇదే అపోస్తలుల బోధనాక్రమము.
👉మీ సంఘములలో బోధనాక్రమము కూడా ఇలానే వుంటుందా ?
*నీ సమాధానం....*
👉అవును. అయితే " నువ్వు దేవుని హస్తలలోనే ఉన్నావు. ఉచ్చహించి; ఆనందించండి"
👉నీ సమాధానం....
👉కాదు. అయితే *" తస్మాత్ జాగ్రత్త సుమా"*
👉" ఇప్పుడు మనకి కావలసింది క్రొత్త క్రొత్త బోధలు కాదు;
*మనం మరచిపోయి పక్కన పెట్టిన అపోస్తలుల బోధ*
👉" ఇప్పుడు మనకి కావలసింది క్రొత్త క్రొత్త సిధంతాలు కాదు;
*మనం మరచిపోయి పక్కన పెట్టిన అసలు దేవుని వాక్యపుసిధంతం*
👉 ఇప్పుడు మనకి కావలసింది క్రొత్త క్రొత్త సువార్తలు కాదు;
*మనం మరచిపోయి పక్కన పెట్టిన అసలు సువార్త*
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి