ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దేవుని స్తుతించుట, ఆరాధించుట

✳ *దేవుని స్తుతించుట, ఆరాధించుట ....✍*

అందరికి ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు.
*ఈ రోజు ఆదివారం, అందరూ దేవుని మందిరానికి వెళ్తున్నారుగా?*

👉మందిరానికి వెళ్ళడం మాత్రమే కాదు, 
*దేవుని స్తుతించి, ఆరాధించాలి.*
👉 పాటలు పాడటం వేరు, ఆరాధించుట వేరు. 

♻ *స్తుతి, ఆరాధన - ఈ రెంటికి భేదముంది.* ♻

♻ *స్తుతి*

 *ప్రశంసను ,ఆమోదాన్ని ప్రాథమికంగా వ్యక్తీకరించడం స్తుతి.* పొందిన అనుగ్రహాలకు కృతజ్ఞతాభివందనాలను వ్యక్తీకరించడం కూడా ఇందులో ఇమిడి ఉంది.
*అలా స్తుతి, కృతజ్ఞతలు రెండు తరచుగా జంటగా వెళుతూ ఉంటాయి.*
👉 అయితే శుద్ధమైన స్తుతిలో కృతజ్ఞత ఇమిడి ఉండదు. *ఒకరి నుండి మేలు పొందినా, పొందకున్నా అతనిపై గల ప్రశంసా, మెచ్చుకోలులను వ్యక్తీకరించడమే స్తుతి.*

♻ *ఆరాధన*

👉 *ఆరాధన అంటే ఏమిటి ?*

🔹 ఒకరిని గూర్చి సదభిప్రాయాన్ని వ్యక్తపరచడం ,
🔹ప్రశంసించడం,
🔹 అభినందించడం,
🔹 కొనియాడడం,
🔹 శ్లాఘించడం,
🔹 ప్రస్తుతించడం, 
🔹కీర్తించడం, 
*పొగడడమే స్తుతి .*

*భక్తి ప్రపత్తులు కలిగి ఉండడం, ఒకరిపట్ల ఆశ్చర్యకరమైన మెప్పును ప్రదర్శించడం, ఆరాధ్య వ్యక్తి ముందు సాష్టాంగ పడడం, ప్రణమిల్లడమే ఆరాధన.*

👉 *అర్హుమైన వారిని ఆరాధిస్తాం.*

*దేవుని ఆరాధన ప్రధానంగా ఆయన వ్యక్తిత్వాన్ని, నడవడికను, లక్షణాలను, పరిపూర్ణతను ప్రస్తుతించడం, ఆయన ఎవరు ,ఆయన ఎలాంటివాడు, అన్నదాన్ని బట్టి దేవుని ప్రస్తుతించడం ఆరాధన.*

👉 ఆయన మనకు చేసిన దానిని బట్టి మనం పొందిన మేలులను బట్టి ఆయనను ప్రస్తుతించడమే ఆరాధన కాదు.
 
*ఆరాధన అనేది ప్రప్రథమంగా ఒక హృదయ వైఖరి.తన సృష్టికర్త పై  హృదయపు భక్తి గౌరవభావమే ఆరాధన.*

కీర్తనలు 29: 2
*యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడి.*

👉 దేవుని అర్హతను గూర్చి మొదట అంతరంగంలో ఎరిగి ఉండడమే ఆరాధన. ఆ అంతరంగిక  ప్రశంసే తర్వాత  బాహ్యంగా వ్యక్తీకరింప బడుతుంది. బాహ్యంగా వ్యక్తీమయ్యేంత వరకు ఆరాధన కాజాలదు. హృదయంలో మనసులోనూ ఉన్నంతవరకు అది ప్రశంస మాత్రమే. 
*అది నోటి మాటలతో, దృశ్యంగా వ్యక్తమైనప్పుడు ఆరాధన అవుతుంది.*

♻ *ఆరాధనను గూర్చి బైబిల్ లోని ప్రథమ ప్రస్తావనలు*

👉 బైబిల్ వ్యాఖ్యాన  సిద్ధాంతాలలో ఒకటి *"ప్రథమ ప్రస్తావనా సూత్రం."*
  
👉బైబిల్లో ఒక విషయం అదెక్కడ సంభవించినప్పటికీ *బైబిల్లో దాన్ని మొదట ప్రస్తావన దాని అర్థాన్ని ,ప్రాధాన్యతను స్పష్టంగా సూచిస్తుంది.*
 బైబిల్లో ఆ పదం లేక విషయం యొక్క భావాన్ని అర్థం చేసుకోవడానికి కీలకమైనది ఆ మొదటి ప్రస్తావనే ఆదికాండము 22: 5.

👉 *ఆరాధన అన్న పదాన్ని మొదటగా చూస్తాం.* తమవెంట మోరియా పర్వతం వరకు వచ్చిన సేవకులతో 
ఆదికాండము 22: 5
*తన పని వారితోమీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి*
అబ్రహాము ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం *షాకా*(shawkaw) 

👉 *అనేది దానికి అర్థం దేవునికి లేదా రాజరికానికి సాష్టాంగంగా ప్రణమిల్లడం, ఆరాధన భావముతో వంగి నమస్కరించడం, అణిగి వినయం చూపడం, సాగిలపడడం.*

✳ *స్తుతి యాగం* ✳

*దేవుని పిల్లల యొక్క ఉన్నతమైన కార్యము దేవుని స్తుతించుట.*

👉 దేవుని పిల్లలు చేయు స్త్రోత్రముల పైన దేవుడు ఆశీనుడై యున్నాడని కీర్తన 22:3 లో తెలియజేయుచున్నాడు.

🔹 భక్తుడైన దావీదు దినమునకు *మూడు సార్లు* ప్రార్ధించేవాడు ( కీర్తన 55:17).
🔹 అయితే *ఏడుసార్లు* స్తుతించేవాడు ( కీర్తన 119:164 ). 

👉దేవుని స్తుతించుచున్నపుడు దావీదు దేవుని ఆత్మ చేత ప్రభావితం చేయబడుచుండేవాడు.
*ఘనమైన స్తుతి, కష్టతరమైన అనుభవాలనుండి వస్తుంది.* 
👉ఈ రకమైన స్తుతి దేవుని సంతోషపరుస్తుంది. 
👉మనము సంతోషకరమైన పరిస్థితులను అనుభవించునపుడు మాత్రమే ఆయనను స్తుతించాలి అని ఆయన కోరుకొనడములేదు.
*గాఢాంధకార లోయలలో సంచరించుచున్నపుడు ఆయనను స్తుతించాలి అని ఆయన కోరుకొనుచున్నాడు.*

👉 ఇది నిజమైన స్తుతి. మనము ఉదయము లేవగానే దేవునిని స్తుతించుట నేర్చుకోవాలి. 
👉ప్రార్ధించుటే కాదు, స్తుతించాలి ఆయనను ఆరాధించాలి. 
*పరలోకంలో దూతలు చేసే పని ఇదే, ఆ దేవధూతలు పరలోకంలో చేసే పని, మనం ఇక్కడే చేద్దాం.*

 బైబిల్ మొదట నుండి చివర వరకు దైవ మూర్తిత్వమును, మహత్యమును గూర్చి గానం చేసిన స్తుతి కీర్తనలు ఎన్నో మనకు కనిపిస్తాయి. 

👉 ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విముక్తి పొందినపుడు దేవుని మహిమ పరిచారు. ( నిర్గ 15:1-21)
👉 మరియ స్తుతి గీతం (లూకా 1:46-55)
👉 జెకర్యా స్తుతి గీతం (లూకా 1:68-79)
👉 యేసు జనన సమయంలో దుతాళి స్తుతి గీతం (లూకా 2:13-14)
ఇదే పరంపర తరతరాల సంఘ చరిత్రలో కొనసాగింది. మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ మొదలగు వారు గొప్ప గీత రచయితలు. వారి పాటలు ఇంకా పాడుతున్నాం. 

♻ *దేవుని లేఖనాల ప్రకారం విశ్వాసి దేవుని స్తుతించి పాడుటకు నాలుగు కారణాలు ఉన్నాయి.*

1⃣ *రక్షణ*

*రక్షించబడిన వారి హృదయములో నూతన గీతం ఉంటుంది.*

 యేసు ఇచ్చే రక్షణ అంగీకరించిన ప్రతి విశ్వాసి ఆయనకు స్తుతించడానికి పాటలు పాడటానికి అద్భుతమైన కారణం ఉంది.
👉 అతను ఇంకా పాపానికి బానిస కాదు, అపరాధ భావన అతనిని ఇంకా వేధించదు. 
👉అతని గమ్యం నరకం కాదు. 

అప్పుడతడు యేసు రక్తములో కడుగబడి, పరిశుద్ధ పరచబడి, దేవుని వాగ్దానాల చేత బాలపరచబడి నిత్య జీవానికి అర్హత పొందుతాడు. ఇంకా అతని ఆనందానికి అవధులు ఉండవు. 
*నీవు రక్షణ పొందిన తరువాత కూడా నీ జీవితములో స్తుతిగీతం లేదంటే నీ జీవితములో ఏదో ఒక లోపం ఉంది.*

2⃣ *వాక్యం*

👉వాక్యం ధ్యానించే వారి హృదయములో స్తుతిగీతం ఉంటుంది. 

అయన వాక్యం (కొలస్సీ 3:16-17) ప్రకారం 
*దేవుని వాక్యము నీ హృదయములో ఉంటే, నీ హృదయములో స్తుతిగీతం కూడా ఉంటుంది.* 
🔹దేవుని వాక్యాన్ని పఠించడం ద్వారా వాక్యములో ఉన్న దేవుని  తెలుసుకుంటాం.
🔹 ఇంకా పఠిస్తే మన యెడల ఆయన నమ్మకత్వాన్ని , కృపను కనుగొంటాము.
*తద్వారా ఆయన కొరకు స్తుతి- గానాలు మన హృదయములో నుండి వెలువడతాయి.*

3⃣ *పరిశుద్ధాత్మ*

*దేవుని ఆత్మ కలిగిన వారి హృదయములో నుండి ఆయన గూర్చిన స్తుతులు సహజ సిద్ధముగానే ప్రవహిస్తాయి.*

👉 పరిశుద్ధాత్మ నివసించే హృదయములో చెప్ప శక్యముగాని సంతోషము ఉంటుంది. అలా ఆనందించే హృదయాలు పరవశం పొంది ప్రభువుని స్తుతిస్తూ పాటలు పాడతాయి (ఎఫెసి 5:18-19).

4⃣ *త్యాగం*

*క్రీస్తు కొరకు శ్రమలు పొందేవారి హృదయములో పాట ఉంటుంది.*
 ఆపొ.కా.16:25 లో పౌలు, సీలల అనుభవం చూస్తాము. వీరు దెబ్బలు, అవమానం, చెరసాల జీవితం అనుభవించారు. మరణానికి చేరువలోకి వెళ్లారు. అయినప్పటికీ ప్రభువు కొరకు నిందలు, శ్రమలు, బాధలు భరిస్తున్నాము అని గ్రహించారు. 
*దేవుని కొరకు నిందలు బహు ఆనందముగా భరించి చెరసాలలో పాటలు పాడి స్తుతించారు.*

👉క్రైస్తవ జీవితములో ఆయనను స్తుతించడం, మహిమ పరచడం, వీటిని పాటల ద్వారా వ్యక్త పరచడం జీవితములో అంతర్భాగం.
 *"యెహోవా విమోచించినవారు పాటలు పాడుచు తిరిగి సీయోను వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును"* (యెషయా35:9).

👉 ఇది నిజమైన స్తుతి. మనము ఉదయము లేవగానే దేవునిని స్తుతించుట నేర్చుకోవాలి. 
👉ప్రార్ధించుటే కాదు, స్తుతించాలి ఆయనను ఆరాధించాలి. 
*పరలోకంలో దూతలు చేసే పని ఇదే, ఆ దేవధూతలు పరలోకంలో చేసే పని, మనం ఇక్కడే చేద్దాం.*
 
*యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱలము.*
కీర్తనలు 100:1-3

*సమస్త దేశాలు ఎందుకు యెహోవాను స్తుతించాలి?*
 
*ఆయనకెందుకు ఉత్సాహ ధ్వని చెయ్యాలి?*
 
*ఆయన సన్నిధిని చేరి ఎందుకు ఆయనను స్తుతించాలి?* 

👉దానికి గల కారణాలు దావీదు చెప్తున్నాడు. 

*ఆయనే మనలను పుట్టించాడు.*

*మనము ఆయనకు చెందినవారము.*

*ఆయన ప్రజలము*

*ఆయన మేపు గొర్రెలము.*

👉మనలను పుట్టించినవాడు ఆయనే. పోషించే వాడు ఆయనే. 
👉మన కోసం ప్రాణం పెట్టినవాడు ఆయనే. 

*ఆయన గొర్రెల కాపరిగా మన పట్ల ఎట్లాంటి శ్రద్ధ తీసుకొంటున్నాడో గమనించు:* 

*పర్వతముల మీదను, వాగుల వద్దను, మంచి మేతగల స్థలముల యొద్ద వాటిని  మేపెదను.*

*తప్పిపోయిన వాటిని వెదకుతాను.*

*గాయపడిన వాటికి కట్టుకడతాను.*
 
*బలహీనమైన వాటిని బలపరుస్తాను.* 

*నేనే నా గొర్రెలను మేపి పరుండబెడతాను.* 
        యేహెజ్కేలు 34: 13-16

👉ఇంతకంటే నీకు చేసేవారు ఎవరూలేరు. 
👉ఇంతకంటే నీకు చెయ్యాల్సింది కూడా ఏమీలేదు. 

ఈ విషయాన్ని నీవు గుర్తించి, అంగీకరించినప్పుడే సజీవ యాగముగా నీశరీరాన్ని ఆయనకు సమర్పించి ఆయనను సేవించగలవు. నిజమైన స్తుతి చెయ్యగలవు. 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...