ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమయ సద్వినియోగము

✳ *సమయ సద్వినియోగము* ✳

1⃣ *దేవుని దృష్టిలో సమయాన్ని వాడిన విధం*

ఆదికాండము 1: 14
*దేవుడుపగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు,*
*భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను.*

ఆదికాండము 1:14 -19

 ప్రపంచంలో ఆయా ప్రదేశాల్లో, లేదా వివిధ పరిస్థితుల్లో సమయాన్ని వినియోగించడం పట్ల మనుషులు వేరు వేరు దృక్పథాలను కలిగి ఉంటారు. ఆధునికత ప్రబలిన పాశ్చాత్య దేశాలల్లో ప్రాశ్చదేశాల కంటే సమయాన్ని మరింత విలువైనదిగా భావిస్తారు. 

  👉 *సమయం పట్ల ఏదైనా ఆధ్యాత్మికంగా మనం కలిగి ఉండవలసిన దృక్పథం ఏదన్నా ఉందా?* 

 *ఆరాధన, ప్రార్ధన అన్నింటికీ గడియారంతో సంబంధం ఉంది. ఆధ్యాత్మికంగా బలపడిన వాళ్ళు సమయాన్ని పట్టించుకోరాదన్న భావం విశ్వాసిని విర్రవీగేలా చేస్తుంది. ఒక టైంటేబుల్ ను బట్టి బిగదీసుకుపోయి ప్రవర్తించడమూ పొరపాటే. అసలు సమయాన్ని పాటించకుండా వ్యర్ధము చెయ్యడమూ పొరపాటే.*

       సృష్టి కథలో దేవుడు సూర్యున్ని, చంద్రున్ని చేసాడని చదువుతాము. 
*అంటే సమయాన్ని సృష్టించాడన్నమాట.*

 సూర్య భ్రమణం ఋతువులను నిర్ణయిస్తుంది. చంద్ర భ్రమణం నేలలను,భూమి తన ఇరుసుపై తానూ పరిభ్రమించడం రాత్రింబగళ్ళనూ నిర్ణయిస్తాయి. అందువల్ల దేవుని దృష్టిలో కాలం అనేది విడదీయరాని అంతర్భాగం. 

*దేవుని సృష్టి కార్యం కూడా ఆయనే నిర్ణయించుకున్న టైంటేబుల్ ప్రకారం పూర్తి అయింది. ఆరు రోజుల్లో అంతా పూర్తి అయిపోయి ఏడవ రోజు విశ్రాంతి దినం అయింది.*

 👉 *సృష్టి అంతటిపైనలాగానే దేవుడు సమయం మీద కూడా సర్వాధికారి.* ఖగోళంలో తిరుగుతున్న గోలాలను తన ఇష్టం వచ్చిన రీతిలో ఆపివేయ్యగలదు. యెహోషువా గ్రంథంలో ఇశ్రాయేల్ వారికి అమోరీయులపై జయాన్నిచ్చిన సందర్భంలో ఇలాంటి ప్రత్యేకమైన అద్భుతాన్ని చేసాడు (యెహోషువా 10:12-14). అయితే ఆయన చేసిన వైజ్ఞానిక సూత్రాలను ఆయనే చేజేతులా మాటిమాటికీ నిర్వీర్యం చేయడు. 

*దేవుడు క్రమశిక్షణను కోరుకునే దేవుడు.* ఇలాంటి క్రమబద్ధమైన ప్రపంచంలో తప్పక పాటించ వలసింది సమయాన్ని. 

*దేవుడు సమయాన్ని పాటించాడు. మనమూ అదే చెయ్యాలని ఆశిస్తున్నాడు. సృష్టి కార్యంలో ఆయన సమయాన్ని పాటించడంతో మనకు ఆదర్శం చూపాడు. ఇది క్రమబద్దమైన జీవితం, కార్యాలన్నిటి విషయాల్లోనూ మనకు ఆదర్శమే.*

   సమయం అనేది మానవుని ఉపయోగం కోసమే. మనల్నేదో తన చెప్పుజేతల్లో ఉంచుకుందామని ఆయన దాన్ని మనకియ్యలేదు. అంతే గాక ఇష్టం వచ్చినట్టుగా నిర్లక్ష్యం చేసి ఖర్చు పెట్టమనీ కాదు. ఆయన సృష్టి కార్యంలో మనకు తగిన స్థానం దొరికే విధంగా యీ సమయం మనకియ్యబడింది. 

*మన సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగేలా ప్రార్ధన చెద్దాం.*

2⃣ *క్రమశిక్షణ సాధకము*

ప్రసంగి 3: 1-11

*ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.*

*దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడుగాని దేవుడు చేయుక్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.*

     జీవితంలో అనేకమైన అనుభవాలు ఎదురవుతుంటాయి. కాలం అస్తమానం మార్పులను తెస్తూ ఉంటుంది. యవ్వనం నుండి వృద్ధాప్యం, క్రమశిక్షణ నుండి బహుమానం, విత్తనాలు చల్లటం నుండి పంట కోయడం, సుఖదుఖాఃలు మొదలైన మార్పులను తెస్తుంటుంది. దీనంతటి భావమేమిటి? *ప్రభువును ఎరుగని వారికి జీవిత అనుభవమంతా అంతం వచ్చేదాకా ఎదో ఒక కాలక్షేపం చెయ్యడానికే పనిచేస్తుంది.* 

ఏ అనుభవం వెనుక ఏది వస్తుంది అన్నదానికి ప్రాధాన్యత లేదు. ప్రతి అనుభవమూ అశాశ్వతమే కాబట్టి దేనికీ ఒక అర్ధమంటూ లేదు. సమయాన్ని లాభదాయకంగా వాడడానికీ, దాన్ని వ్యర్ధం చేయడానికీ తేడా ఎమీ లేదు.  ఒకదానికంటే ఒకటి మెరుగేమీ కాదు. దేవుడు లేని మనుషులు కాలాన్ని ఖర్చుపెట్టవలసినదాన్ని గానే చూస్తారు. అది కలిగించే అనుభవాలకు ఏమీ విలువ లేనట్టే భావిస్తారు. 

      అందువల్ల ప్రసంగీ ఇక్కడ రెండు సంగతులు  చూపిస్తున్నాడు. *దేవుడు లేనివారికి సమయం నిరుపయోగం.* 

*“కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? (ప్రసంగి 3: 9).”*
 ఏమీ లేదు అని జవాబు. ఎందుకంటే కాలం శాశ్వతంగా కొనసాగుతుంది.  వాళ్ళు పడిన కష్టమంతా నిరర్ధకమైపోతుంది. అయితే ఒక విశ్వాసికి సమయం ఎంత ప్రాముఖ్యమైనదో కూడా చెప్తున్నాడు. 

*“దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించు యున్నాడు”* ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచియున్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుడుకోనుటకు అది చాలదు (ప్రసంగి 3: 11). 

రాబోయే అంతాన్ని మొదటే తెలుసుకోవడం సాధ్యపడకపోవచ్చు  గాని దేవుడు మాత్రం ఒక అంతాన్ని నియమించాడని ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడనీ, ఈ మధ్య కాలంలో జరిగేదంతా అర్ధరహితమైనదేమీ కాదని, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకునేందుకు ఇదంతా సిద్దబాటు అని విశ్వాసికి తెలుసు. 

*దేవుని ఆత్మ మూలంగా జీవం పొందిన మనిషిలో నిత్యత్వం గురించి ఇదమిద్దమైన ఉద్దేశం ఉంటుంది. ఆ కాలం వచ్చేదాకా జరిగేదంతా “దాని కాలంలో అది చక్కగా జరుగుతుంది”. ఎందుకంటే దీని ద్వారానే దేవుడు మనల్ని నిత్యత్వం కోసం సిద్దపరుస్తున్నాడు.*

  🔺   *దేవుడు మన మేలు కోసం పంపించే వివిధ అనుభవాలను పొందే అవకాశం సమయం మనకు ఇస్తుంది.*

🔹 నేర్చుకునే అవకాశాన్ని, నేర్చుకున్న తరువాత దేవుడు సిద్దపరిచిన అనుభవానికి వెళ్లే అవకాశాన్ని ఇస్తుంది. 

🔹దేవుని చిత్తం తెలుసుకుని, దాన్ని జరిగించే అవకాశాన్నీ, సంతోషించే వారితో సంతోషిస్తూ దుఃఖించిన వారితో దుఃఖించే అవకాశాన్ని కూడా ఇస్తుంది.

దేవుడు మనకు చూపించవలసినవి ఎన్నో ఉన్నాయి. *అయితే క్రమశిక్షణ లేకుండా నేర్చుకోవడం ఉండదు.*

 ఒక సంగతి కోసం ఎంత సమయాన్ని వెచ్చించాలో, తరువాతి సంగతిలోకి ఎప్పుడు వెళ్ళాలో తెలుసుకుని ఉండాలి.

*ప్రభువు మార్గాలలో ఎదగాగలిగే క్రమశిక్షణను సమయం మనకు ఇస్తుంది. మన సమయాన్ని దేవుని మహిమ కోసం వాడగలిగే జ్ఞానాన్ని ప్రసాదించమని దేవున్ని వేడుకుందాo.*

3⃣ *ఇతరులకు సహపడే సాధనం*

_యోహాను 9:1-7_

  👉 *సమయాన్ని సరిగా వాడుకోవడం క్రమశిక్షణ సాధకం.* 

అయితే మన సమయాన్ని క్రమశిక్షణలో మనం ఉంచుకోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిల్లో కొన్ని పూర్తిగా స్వార్ధపూరిత కారణాలు కావచ్చు. మంచి కట్టుబాట్లలో జీవించే మనిషి ఇతరులకు పూచికపుల్ల ఎత్తు సాయం కూడా చేయకుండా బ్రతికే అవకాశాలు లేకపోలేదు. బైబిలు చెబుతున్న దానికి ఇది వ్యతిరేకం.

           *యేసు కూడా కట్టుబాటు, క్రమశిక్షణ గల జీవితం గడిపాడు. వ్యక్తిగత ప్రార్ధనకు కొంత సమయాన్ని ఆయన కేటాయించాడు.*

🔹 సునగోగులో సామూహిక ఆరాధనల్లో ఆయన పాల్గొన్నాడు. 

🔹శిష్యులకు బోధించడంలో చాల సమయం గడిపేవాడు. ఆయనను అనుసరించిన జన సమూహాలకు వాక్య పరిచర్య చేసాడు. 

🔹 పుట్టు గుడ్డివాన్ని బాగుచేసిన ఈ సంఘటనలాంటి స్వస్థత కార్యాల ద్వారా వ్యక్తిగత అవసరతలు కూడా తీర్చాడు.

       *మన ప్రభువు జీవితంలో అవకతవకలేవీ లేవు. దైవజ్ఞానం ద్వారా ఆయన తన పరిచర్యలు అన్నింటిలో నడిపించబడ్డాడు.*

🔹 అది ఆయన జీవితాన్ని క్రమబద్ధంగానే నడిపింది. జన సమూహాలలో ఉండి ఇక ఏకాంత ప్రార్ధనకు శక్తి లేనంతగా ఆయన అలిసిపోలేదు. తన ధ్యాన ప్రార్ధనలలో నిమగ్నుడై శిష్యులకు ఉపదేశించడాన్ని నిర్లక్ష్యం చేయలేదు. *శిష్యుల కోసం ఆయన చేసిన పరిచర్య ఆయన చుట్టూ మూగే జన సమూహాలకు సేవను మూలాన పడేయ్యలేదు. తన పరిచర్యలోని ఒక్కొక్క భాగాన్నీ ఇతరుల ప్రయోజనం కోసమే సిద్ధపరిచాడు. ప్రతిదానికీ అందుకు నియమింపబడిన సమయం ఉంది. ప్రార్ధన లేకుండా ఇతరులకు సేవ చేయాలన్న దృక్పథమే కలగదు.*

      తానూ సేవించేందుకే గాని గాని సేవ చేయించుకునేందుకు రాలేదని మన ప్రభువు చెప్పాడు (మార్కు 10:45). అయితే నిజమైన సేవను ఆ జీవితంలోని ఇతర సంగతుల నుండి విడదీసేందుకు వీలు లేదు. 

*దేవునితో మనకు సరియైన సంబధాలు లేకపోతే మన సాటి మనుషులకు మనం సేవ చేయలేం. ఈ ప్రాముఖ్యమైన విషయాలకు చోటు ఉండేలా మన సమయాన్ని క్రమపరచుకోకపోతే మన సేవ సరియైన పద్ధతిలో ఉండదు.*

      *పగటి వెలుగు ఉన్నప్పుడే పని చెయ్యాలి (4), ఇతరులకు సహాయకరంగా ఉండేలా మన సమయాన్ని వాడాలి. మన జీవితాలను ఇతరుల సేవలో వారి ఆత్మ నేత్రాలను తెరిచేందుకు వాడగలిగే జ్ఞానం కోసం ప్రార్ధన చెద్దాం*

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...