ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సామెతలు

▫️——— సామెతలు ———▫️
      క్లుప్త ధ్యానములు ( Part: 4)

నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మాతోకూడ రమ్ము మనము ప్రాణముతీయుటకై పొంచియుందము నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము. పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదము సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ  బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. పలువిధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన యిండ్లను దోపుడుసొమ్ముతో నింపుకొందము నీవు మాతో పాలివాడవై యుండుము మనకందరికిని సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు. 
           సామెతలు 1:10-14

ప్రార్ధనాపరులైన తలిదండ్రులకు పుట్టిన పిల్లలెందరో, పోకీరీలవలె తిరగడం మనం చూస్తూనే వున్నాము. కారణం? స్నేహమే కావొచ్చు. కొన్నిసార్లు స్నేహము మితిలేని మేలు చెయ్యడానికి ప్రోత్సహిస్తే, మరికొన్నిసార్లు వారి జీవితాలను పతనం అంచులకు చేర్చొచ్చు. 

♻️ తలిదండ్రులుగా పిల్లలకు కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పిస్తూ, సరిచేస్తూ ఉండాలి. 

👉స్కూల్స్ లో నుండి ఇతరుల పెన్సిల్స్ వంటికి తీసుకొస్తున్నప్పుడు 
👉ప్రక్కవారి పెరట్లే కాయలు కోసుకొస్తున్నప్పుడు 
👉పొరుగువారి పిల్లలను గిచ్చుతూ వున్నప్పుడు చూసీ, చూడనట్లుగా మిన్నకుండిపోకూడదు. 
👉నేటిదినాన్న తనతోడివారిని ఏడిపించడం వారికి వినోదంలా వుండొచ్చు. తర్వాత అది శాడిజానికి దారితీయొచ్చు. 
👉అట్లాంటివి సరిచెయ్యాల్సి వచ్చినప్పుడు, మన పిల్లలు బాధపడతారేమో అనుకుంటే, మన జీవితాంతం వారి గురించి బాధపడాల్సివస్తుంది. తలనొప్పితో పోయేది, గుండెపోటుకు చేరుకొనే ప్రమాదముంది. 
👉కొంతమంది పిల్లలు బూతులు తిడుతుంటే, తలిదండ్రులు పగలబడి నవ్వుతుంటారు. మరికొందరైతే పనిపెట్టుకొని మరీ బూతులు, తిట్లు  నేర్పిస్తుంటారు. ఇట్లాంటి తలిదండ్రులు వారి జీవితాంతం పశ్చాత్తాపపడక తప్పదు. 
👉నేటిబాలలే రేపటి పౌరులు అన్నట్లు, నేడు చిలిపి పనులు చేసే పిల్లలే, రేపటి త్రాగుబోతులు, జూదగాళ్లు, హంతకులు, రౌడీలు, దొంగలు, వ్యభిచారులు కావొచ్చు. 
👉నేటి దినాల్లో అనేకులు డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యారు. డ్రగ్స్ దొరక్క, కాఫ్ సిరప్స్ కొని త్రాగేస్తున్నారు. ఇక సిగరెట్స్, బీర్లు వీటిగురించి చెప్పాల్సిన పనిలేదు. 
👉వారి బాల్యమునుండి స్కూల్స్ లోగాని, కాలేజస్ లోగాని, పొరుగువారితోగాని వారి స్నేహాలు ఎట్లా వుంటున్నాయో పరిశీలించి, ఆధ్యాత్మిక, నైతిక విలువలతోకూడిన బోధచేయ్యాలి. అవసరమైతే దండించాలి, సరిచేయాలి. 

ఇట్లాంటి భయభక్తులతో పెరిగిన బిడ్డలు, పాపులు పాపము చేయుటకు ప్రేరేపించినప్పటికీ వారు తప్పుకుంటారు తప్ప, ఒప్పుకొనరు. 

పాపులు ఎప్పుడూ, వారు చేస్తున్న దుర్మార్గపు, ఇతరులకు కీడుకలిగించే పనులు చెయ్యడానికి ఇతరులను లాగడానికి ప్రయత్నిస్తుంటారు. వారిమాటలు ఎంత బాగుంటాయో? 

ఏ పాపం తెలియని పిల్లాడిని కిడ్నాప్ చేసేద్దాం. ఇన్ని లక్షలు కావాలని డిమాండ్ చేద్దాం. పిల్లవాడిని విడిపించుకోవడం కోసం చచ్చినట్లు చెల్లిస్తారు. ఒక్కరాత్రిలో లెక్కలేనంత డబ్బు. మనమంతా సమానంగా పంచుకోవచ్చు. ఏమాత్రం కష్టపడకుండా లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చెయ్యొచ్చు. నీవేమి భయపడాల్సింది లేదు. మాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ వుంది. పట్టుబడే ప్రశ్నే లేదు. నీవు చెయ్యాల్సింది ఏమీ లేదు. మాతో వుంటే చాలు. అంటూ వారి ఉచ్చులోనికి నిన్ను లాగే ప్రయత్నం చేస్తారు. ఒక ఇంటిని లేదా బ్యాంకు ను దోచేద్దాం! దోపుడు సొమ్ము పంచుకుందాం అంటూ అనేకమైన ఆఫర్స్ యిస్తారు. 

ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. (1 తిమోతికి 6:9)

అట్లా అని, ఈ వాక్యం కేవలం యువకులకు  మాత్రమే పరిమితం కాదు. వీళ్ళకంటే యువతులు చేసేపనులు లెక్కలేనన్ని. తలిదండ్రుల దగ్గర నటించడంలో వారికి వారే సాటి. 

యువతీ యువకులారా, మిమ్ములను బట్టి, మీ కుటుంబ గౌరవం, మీ ఆధ్యాత్మిక జీవితం పతనం కాకూడదు. మీ స్నేహం చెడ్డదైతే వారి తలంపులలోనూ, వారి క్రియల్లోనూ, వారితోనూ చేరొద్దు. వారి ప్రలోభాలకు లొంగవద్దు. నీజీవితాన్ని యేసయ్యకు సమర్పించి ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించుటకు నీ హృదయాన్ని సిద్ధపరచుకో! అట్టి కృప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...