ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సామెతలు

❇️ —— సామెతలు —— ❇️
    క్లుప్త ధ్యానములు (Part: 10)

నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా  ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును. సామెతలు 2:1-5

♻️ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో జీవించేవారికి జ్ఞాన వివేకములు లభించవు. 

కారణం, వారి హృదయంలో దేవునికి చోటులేదు కాబట్టి, వారు దేవునియందు భయభక్తులు నిలుపలేరు. తద్వారా జ్ఞానమైయున్న దేవుడిచ్చే, జ్ఞాన వివేకములను పొందలేరు. 

🔸యెహోవాయందలి భయభక్తులే జ్ఞానము. 
🔸దుష్టత్వము విడచుటయే వివేకము 
               యోబు 28 : 28

♻️ జ్ఞానాన్ని నిర్లక్ష్యంగా, సోమరితనముగా వెదికితే, దానిని పొందుకోలేరు. 

🔸విలువైన ధనరాశులను వెదకినట్లు వెదకాలి. 
🔸మన పితరులు మనకొరకు దాచిపెట్టిన ధననిధిని వెదకినట్లు వెదకాలి. 
🔸పట్టుదలతో వెదకాలి. 
🔸అవి దొరికే వరకు వెదకాలి

♻️ జ్ఞానము ఎక్కడ దొరకును? వివేచన దొరకు స్థలము ఎక్కడ నున్నది?

🔹నరులు దాని విలువను ఎరుగరు 
🔹ప్రాణులున్న దేశములో అది దొరకదు.
🔹అగాధము అది నాలో లేదనును 
🔹సముద్రము నాయొద్ద లేదనును.
🔹సువర్ణము దానికి సాటియైనది కాదు 
🔹దాని విలువకొరకై వెండి తూచరాదు.
🔹అది ఓఫీరు బంగారమునకైనను 
🔹విలువగల గోమేధికమునకైనను 🔹నీలమునకైనను కొనబడునది కాదు.
🔹సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటికావు 
🔹ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్య బడదు.
🔹పగడముల పేరు ముత్యముల పేరు దానియెదుట ఎత్తనేకూడదు. 
🔹జ్ఞానసంపాద్యము కెంపులకన్న కోరతగినది.
🔹కూషుదేశపు పుష్యరాగము దానితో సాటికాదు. 
🔹శుద్ధసువర్ణమునకు కొనబడునది కాదు.         

♻️ అట్లైన జ్ఞానము ఎక్కడనుండి వచ్చును? వివేచన దొరకు స్థలమెక్కడ నున్నది?

🔹అది సజీవులందరి కన్నులకు మరుగై యున్నది 
🔹ఆకాశపక్షులకు మరుగుచేయబడి యున్నది.
🔹మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును.
🔹దేవుడే దాని మార్గమును గ్రహించును 
🔹దాని స్థలము ఆయనకే తెలియును. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించి  నప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరచి నప్పుడు ఆయన దాని చూచి బయలుపరచెను దానిని స్థాపనచేసి దాని పరిశోధించెను.
🔹యెహోవాయందలి భయభక్తులే జ్ఞాన మనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. యోబు 28 : 12-28

🔹వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి. (సామెతలు 8:10)

🔹యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచునుయెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవితేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి.
           కీర్తనలు 19 :9,10

🔹వేలకొలది వెండి బంగారు నాణములకంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. కీర్తనలు 119:72

మనిషి తన జీవితకాలం ధన సంపాదనకై పరుగులు పెట్టుచూ, మూర్ఖత్వంలోనే చనిపోతున్నాడు. జ్ఞానాన్ని వెదికితే అది దొరుకుతుంది. కానీ, దానిని వెదకకుండా ధనరాశులను వెదకుతున్నాడు. క్షణికమైన సంతోషాలను ప్రక్కనబెట్టి, దేవుడైయున్న జ్ఞాన్నాన్ని వెదకి పట్టుకుంటే, శాశ్వతకాలమూ నిత్య సంతోషమే. ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!  ఆమెన్!  ఆమెన్!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...