ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సామెతలు

❇️—— సామెతలు ——❇️
క్లుప్త ధ్యానములు ( Part: 7)

జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయు చున్నది పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానములేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు  ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించు  కొందురు? 
           సామెతలు 1: 20-22

♻️ ప్రతీ మనిషిని ప్రధానముగా రెండు స్వరాలు పిలుస్తున్నాయి. 

1️⃣ జ్ఞానము 
2️⃣ మూర్ఖత్వము 

♻️ ఈ రెండు పిలుపులలో దేనికి మనము విధేయత చూపుతామో? అవి మనకు రెండు విషయాలను నిర్ణయిస్తాయి

1️⃣ ఈ లోకంలో మన జీవితవిధానం 
2️⃣ శాశ్వతలోకంలో మన స్థితి

♻️జ్ఞానము అంటే?
▫️దేవుని వాక్యం 

*జ్ఞానమను నేను* చాతుర్యమును నాకు నివాసముగా చేసికొనియున్నాను. (సామె 8:12)

♻️మూర్ఖత్వము అంటే?
▫️మనుష్యుల చెడ్డ సలహా 

బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది అది కాముకురాలు దానికేమియు తెలివిలేదు. సామె 9:13

అందుకే, దుష్టుల ఆలోచన (సలహా) చొప్పున నడువకూడదు. (కీర్తనలు 1:1 )

బైబిల్ అంతటా జ్ఞాన స్వరం వినిపిస్తూనే వుంది. బైబిల్ ఎక్కడకి వెళ్లిందో, ఎక్కడెక్కడైతే దేవుడు మనుష్యులతో మాట్లాడుతున్నారో అన్నిచోట్లా కూడా ఈ స్వరం వినబడుతూనే వుంది. ఈ జ్ఞాన స్వరం వినడం యిష్టంలేక వారి అజ్ఞానాన్ని ( మూర్ఖత్వాన్ని) బయటపెట్టుకొంటున్నారు. మూర్ఖులు తమ బుద్ధిహీనతనే అంటిపెట్టుకొని, జ్ఞానాన్ని వెక్కిరిస్తూ, వివేకాన్ని తిరస్కరిస్తూ, అందులోనే సంతోషిస్తూ ఉండడం నిజంగా విపరీతమైన విషయం. 

చివరిగా ఒక్క విషయం!
👉జ్ఞాన స్వరానికి లోబడితే? ఈలోకంలో క్రమమైన జీవితవిధానం, శాశ్వత లోకంలో నిత్యజీవం పొందగలము. 
👉జ్ఞాన స్వరాన్ని తిరస్కరిస్తే? ఈలోకంలో అక్రమమైన జీవితవిధానం, తాను అపహాస్యం చేస్తూ, అపహాస్యం పాలవుతాడు. చివరికి, శాశ్వతలోకంలో నిత్యమరణమే శరణ్యమవుతుంది. 

వద్దు! అది అత్యంత భయంకరం! జ్ఞాన స్వరానికి లోబడి, నిత్యజీవానికి స్వతంత్రులవుదాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!  ఆమెన్!  ఆమెన్!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...