✳ *దేవుని సృష్టి పట్ల గౌరవం* ✳
*భూమ్యగాధస్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వతశిఖరములు ఆయనవే.*
*సముద్రము ఆయనది ఆయన దాని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను.*
కీర్తనలు 95: 4,5
👉 బైబిలులోని అతి శ్రేష్టమైన స్తుతిగీతాల గ్రంథమే క్రీర్తన గ్రంథం.
*ఆరాధన పలుకుల మధ్యలో హఠాత్తుగా కీర్తన కారుడు దేవుని సృష్టిని ఇంత విస్తరించి చెప్పడం గమనార్హమ్మైన విషయం.*
*దేవుని మహిమ వెల్లడింపులో సృష్టి కూడా ఒక భాగమేనని బైబిలు అభిప్రాయపడుతుంది.*
👉 సృష్టిలోను, మన చుట్టూ ఉన్న మనుషులలోనూ దేవుడు చేసే వాటిని గనక మనం పట్టించుకోకపోతే దేవుణ్ణి గురించి మనకు తెలిసేది చాలా తక్కువ.
*కీర్తన కారుడు ఇక్కడ మన చుట్టూ ఉన్న దానినంతటినీ నిర్మించిన సృష్టికర్తగా దేవుణ్ణి ఆరాధించాలనీ, అంతేగాక మనలను కూడా చేసినవాడుగా ఆయనను పూజించాలనీ మనకు చెబుతున్నాడు
*కీర్తనలు 95: 7*
👉 ఆదాము పతనంతో బాటు అన్నీ పాడైపోయిన సంగతి నిజమే గాని, ఆ కారణంగా సృష్టిని ద్వేషించడం గానీ, మనిషిని కేవలం ఎందుకూ కొరగానివాడుగా ఎంచడం గానీ చేయకూడదు.
*దేవుడు సృష్టిని చేసినప్పుడు అదంతా మంచిదిగా ఆయనకు అనిపించింది. వీటన్నిటిలోకీ అతి శ్రేష్టమైనది మానవ సృష్టి, దేవుని సృష్టిని ద్వేషించకూడదు సరికదా, పాపం ద్వారా ఆ సృష్టి ఎంత వికటించిదో దానికి విచారపడాలి. ఒక నాటికి పూర్తి కానున్న పునరుద్ధరనకై దేవునితో కలిసి పాటుపడాలి.*
*దేవుని పిల్లలంగా ఆయన చేసినదాన్నంతటినీ మనం గౌరవించాలి.* మన ఇళ్ళలో చిన్న చిన్న అలంకరణ సామగ్రీలు ఉంటుంటాయి. వాటన్నిటినీ మనం జాగ్రత్తగా చూసుకుంటాం. ముఖ్యంగా మనం ఇష్టమైన వాళ్ళు, మన గౌరవాన్ని పొందినవాళ్ళు ఇచ్చినవైతే మరీను. అయితే *మనిషి ఎన్నడూ చేయలేనంత మనోహరంగా ఈ ప్రపంచాన్ని దేవుడు చేసి ఇచ్చాడు.దానిని మనం తిరస్కారంగా చూడడం దేవుణ్ణి కించపరచడం అవుతుంది.*
*మానవుడు తన పాపంలో తన స్వార్ధ ప్రయోజనాల కోసం సహజ ప్రకృతిని దుర్వినియోగపరుస్తూ నాశనం చేస్తూనే ఉంటాడు. దేవుడు చేసిన జీవాలు, వృక్షాలు, సహజ సంపద పట్ల గౌరవ భావం అనేది అతనికి లేదు. దీనిని దేవుని స్వంత ప్రజలే చేస్తుంటే అది మరీ శోచనీయం. ఎందుకంటే అలా చెయ్యడం ద్వారా తాము ఆరాధిస్తున్నామని చెప్పుకునే దేవుని గొప్ప తనాన్ని వారే గుర్తించడం లేదన్నమాట.*
*ఆయన చేసిన ఈ ఆశ్చర్యకరమైన ప్రకృతి పట్ల మరింత గౌరవాన్ని మనకు ఇవ్వమని దేవునికి ప్రార్ధన చెద్దాం*.
కీర్తన 95:1-7
♻ *అన్నిటిలోను దేవుణ్ణి మహిమపరచడం*
*ఎఫెసీ 5:15-20*
ఎఫెసీ ప్రత్రికలోని మొదటి మూడు అధ్యాయాలు సిద్ధాంత బోధనకు కేటాయించబడ్డాయి. చివరి మూడు అధ్యాయాలలో పౌలు అంతవరకు చెప్పిన దానిని దైనందిన జీవితానికి అన్వయించాడు. *"అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలే నడుచుకొనుడి"* (వ 15).
*"జ్ఞానుల వలె" అంటే మేధావుల లాగా అని అర్థం కాదు. దేవుణ్ణి గురించిన అవగాహన కలిగి దానిపైననే ఆధారపడిన జీవితం గడపడం అని అర్థం.*
👉 అంతేగాక ఆయనకు నొప్పి కలిగించేవాటి జోలికి వెళ్లకుండా ఉండడం. అయితే 17వ వచనం స్పష్టీకరించిన రీతిగా మానసికమైన అవగాహనా కూడా ఉండవలసిందే.
*ఆధ్యాత్మిక జ్ఞానం మన జీవితంలో ప్రతి కోణాన్ని ప్రభావితం చేస్తుంది.*
🔹సమయాన్ని వినియోగించుకునే విషయాన్నీ(వ 16).
🔹 ఇహలోకపరమైన వస్తువులను వాడుకోవడాన్ని (వ, 18),
*మనం ప్రతి పరిస్థితినీ ఎలా చక్కబెట్టాలన్న నిర్ణయాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది.*
👉 భౌతిక ప్రపంచాన్నీ, ఆత్మ ప్రపంచాన్నీ చేసింది దేవుడే. అసలు సమయాన్ని సృష్టించినదీ దేవుడే. ఇవన్నీ ఆయన మహిమార్థమే వాడాలి.
15వ వచనంలో పౌలు సంతలలో వాడే పదం ఒక దాన్ని ప్రయోగించాడు. దీనికి అక్షరాలా *'సమయాన్ని కొనుక్కోండి'* అనే అర్థం వస్తుంది.
👉 దేవుడు తన కోసం మనం ఎంతో చేయాలని మనకు సమయం, అవకాశాలు ఇచ్చాడు. మనం సమయాన్ని సరిగా ఉపయోగించుకుంటున్నామా, లేక నిష్ప్రయోజనకరమైన కాలక్షేపాలు, కబుర్లు, లేకపోతే ఊరికే గోళ్లు గిల్లుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నామో,
👉 *మనకున్న సమయంలో మనం ఏమి చేయడం దేవుని ఉద్దేశమో తెలుసుకోవడం ఎంతో అవసరం.*
దేవుడు తాను చేసిన ప్రపంచంలో ఆశ్చర్యకరమైన వనరులను ఉంచాడు. వీటిని జ్ఞానయుక్తంగా వాడడమో, లేదా దుర్వినియోగం చేసుకోవడమో మన చేతుల్లోనే ఉంది. లోక సంబంధి ప్రతి దానినీ తన వ్యక్తిగత అవసరం కోసం వాడుకుంటాడు. అయితే *దేవుని బిడ్డ మాత్రం తన జీవితంలో ప్రతిదీ దేవుని మహిమకు వాడబడాలన్న ఉద్దేశంతో అన్నిటినీ క్రమపరచుకుంటాడు* (వ 18). ఆత్మ జ్ఞానానికి గుర్తు తననుతాను అదుపులో ఉండడమే.
మన పరిస్థితులు కూడా సర్వాధిపతియైన దేవుని చేతుల్లోనే ఉన్నాయి.
*ఈ పతిత లోకంలో మనుషులు తమకు లాభకరంగా తమ స్థితిగతులను మలుచుకుంటారు. అయితే దేవుని ప్రజలు తమ పరిస్థితులలో దేవుణ్ణి మహిమ పరచే అవకాశాలు కోసం ఎదురు చూస్తుండాలి.*
👉 ఆ పరిస్థితులు సౌఖ్యవంతంగా ఉన్నా, కష్టతరంగా ఉన్నా, అందుకోసం దేవునికి వందనాలు చెల్లించాలి. అన్ని విషయాలలోనూ మరీ మరీ దేవుణ్ణి మహిమపరచగల కృప కొరకు దేవుణ్ణి ప్రార్థిద్దాం.
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి