✳ *దేవుని నుండి వినే అలవాటును పెంపొందించుకొనుట....✍*
దేవుడు అనేక రీతులుగా మనతో మాట్లాడును. ముఖ్యముగా దేవుని వాక్యములో నుండి మనతో ఆయన మాట్లాడును. దేవుని వాక్యములో ఏదైనా ఒక విషయము స్పష్టముగా బయలు పరచినయెడల, ఆ విషయయై దేవుని చిత్తము కనుగొనుటకు ప్రార్థించవలసిన అవసరములేదు.
♻ *పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడును.* ప్రతి తలుపుయొక్క తాళపు చెవిని ప్రభువు కలిగియున్నాడు (ప్రకటన 1:18) మరియు ఆయన ద్వారమును తెరువగా దానిని ఎవ్వరు మూయలేరు. ఆయన ద్వారమును మూయగా ఎవ్వరు తెరువలేరు (ప్రకటన 3:18).
*ఒక ప్రత్యేకమైన మార్గములో మనము వెళ్లవలెనా లేదా అని తెలుసుకొనుటకు మన పరిస్థితులే సూచనగా ఉండును.*
👉 దేవుడు మూసిన తలుపు దగ్గర మనము తట్టుచూ ఉండనవసరము లేదు.
*కాని ఒక తలుపు మూయబడినప్పుడు ప్రార్థించాలి. కాని అనేకసార్లు ప్రార్థించిన తరువాత కూడా తలుపు మూయబడియున్నట్లయితే, బహుశా మనము ఆ ద్వారము గుండా వెళ్లుట దేవుని చిత్తము కాకపోవచ్చును.* మనము అలాగే ప్రార్థనలో కొనసాగవలెనా లేదా అనునది దేవుని అడుగవలెను (లూకా 11:5-9).
♻ *పరిణితి పొందిన భక్తిగల సహోదరుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడవచ్చును.* అటువంటివారు ఎన్నో అనుభవములద్వారా వెళ్ళియుంటారు మరియు మనకు తెలియని ఆత్మీయ గోతులను గూర్చి హెచ్చరించెదరు. వారికి మనము గ్రుడ్డిగా లోబడము గాని వారి ఆత్మీయ సలహాలు మనకు ఎంతో మేలు చేస్తాయి.
♻ *మనము ఇతర విశ్వాసులతో సహవాసము చేయునప్పుడు దేవుడు మనతో మాట్లాడును.* దేవుని వాక్యము యొక్క ప్రత్యక్షత కొరకు కూడా క్రీస్తు శరీరములోని ఇతరుల మీద మనము ఆదారపడుటను దేవుడు నేర్పిస్తాడు.
♻ *మనము ఏదైన శోధన (పరీక్ష)లో గుండా వెళ్ళునప్పుడు లేక మనకు రోగము వచ్చినప్పుడు ముఖ్యమైన సంగతి దేవుడు మనతో మాట్లాడాలని ఆశించుచున్నాడని గమనించవలెను.*
♻ *ఇతరుల తప్పిదములను బట్టి కూడా దేవుడు మనలను హెచ్చరించును.* ఉదాహరణకు, ఒక దైవజనుడు పాపములో పడినప్పుడు, మనమందరము బలహీనులము గనుక అతని ఓటమినుండి మనము ఏమి నేర్చుకొనగలమనియు మరియు మనము ఏవిధముగా కాపాడబడగలమనియు దేవునికి ప్రార్థించవలెను.
♻ *ఎవరికైనా కీడు జరిగిందనిగాని మరియు ఎవరికైనా అపాయము (యాక్సిడెంట్స్) జరిగిందనిగాని మనము వినినప్పుడు దేవుడు మాట్లాడును.*
పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను మరియు సిలోయములోని గోపురము పడి కొందరు చనిపోయిరని ప్రభువైన యేసుతో ఉన్నవారు వినినప్పుడు ఇటువంటివి ఎవరికైనను జరుగును గనుక మారుమనస్సు పొందుడని వారికి ఆయన చెప్పారు (లూకా 13:1-4).
👉 *బైబిలును తెరిచి మొదటిగా కనబడిన వచనము చదువుట ద్వారా దేవుని స్వరమును వినుటనుగూర్చి నన్ను హెచ్చరించనివ్వండి.*
🔹 *నీవు ఒక అమ్మాయిని పెళ్లిచేసుకొనవలెనని నిర్ణయించుకొని, నిశ్చయతకొరకు బైబిలు తెరచి చదువవచ్చును. అటువంటి వచనము నీవు కనుగొనువరకు ఆ విధముగా బైబిలు చదువుతూనే ఉంటావు. ఆ విధముగా నిన్ను నీవు మోసగించుకొనవచ్చును.*
👉 ఈ విధముగా బైబిలు చదివి దేవుని చిత్తమును కనుగొనవలెనని ప్రయత్నించిన ఒక వ్యక్తిని గూర్చి విన్నాను.
మొదటిగా *''అతడు పోయి ఉరిపెట్టుకొనెను''* (మత్తయి 27:5) అని చదివెను. అతడు మరలా బైబిలు తెరచి *''నీవును వెళ్లి అలాగు చేయుము''* (లూకా 10:37) అని చదివెను. ఈ విధముగా దేవుని చిత్తమును కనుగొనుటనుండి ఇది అతనిని శాశ్వతముగా విడిపించెను.
👉 *కొన్నిసార్లు మనము ఒత్తిడిలో ఉన్నప్పుడు బైబిలు తెరువగానే మన ప్రోత్సాహము నిమిత్తము ఒక వచనము ద్వారా ప్రభువు ప్రోత్సహించవచ్చును. కాబట్టి ఈ పద్ధతి ప్రోత్సాహముకొరకు బాగానే ఉంటుంది కాని నడిపింపుకొరకు కాదు.*
👉 *సహోదరులారా, ఈ విధముగా దేవునియొద్దనుండి వినే అలవాటును వృద్ధి చేసుకొనుడని మిమ్మును ప్రోత్సహించుచున్నాను. మీరు వృద్ధిచేసుకొనగల ఒకే ఒక ముఖ్యమైన అలవాటు ఇది.*
*జాక్ పూనెన్*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి