ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కుటుంబ లో అందరు ప్రభువుకే ప్రథమ స్థానం ఇవ్వాలి.

✳ *క్రైస్తవ కుటుంబం* ✳

 1⃣  *కుటుంబ లో  అందరు  ప్రభువుకే ప్రథమ స్థానం ఇవ్వాలి.* ♻

లూకా 2: 48,49

*ఆయన తలిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లికుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని అయనతో చెప్పగా ఆయనమీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను;*

లూకా 2:40-45

యేసుప్రభువు పుట్టుకకూ, ఆయన బహిరంగ పరిచర్య ప్రారంభించే సమయానికీ మధ్య కాలంలో జరిగిన ఈ సంఘటనలను మన కొరకు వ్రాసిపెట్టిన వాడు *సువార్తికుడైన లూకా ఒక్కడే.*

👉 మన ప్రభువు తన బలాన్ని తన కుటుంబ భద్రతలో గడిపాడు. *ఇలా చేసి సమాజంలో కుటుంబ స్థానాన్ని కలకాలం పరిశుద్ధపరిచాడు.* 

♻  పస్కా పండుగను యూదులు బహు నిష్ఠతో ఆచరిస్తారు. ఉత్సవం కోసం వేల కొద్దీ యూదుల కుటుంబాలు యెరూషలేము చేరుకుంటాయి. 
*యేసుకు పండ్రెండేళ్లు నిండాయి. యూదా బాలుడు తమ సమాజంలో స్థానం సంపాదించుకునే వయసు ఇదే.*
👉  అంతకు ముందే యెరూషలేమును చూసి ఉండవచ్చును గాని ఆ సంవత్సరం మాత్రం ఆ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన సందర్భం. 

👉యెరూషలేము యాత్రలో భద్రత, తోడు కోసం యాత్రికులు గుంపులుగా కలిసి వెళ్తండేవారు. అందువల్ల తిరుగు ప్రయాణంలో యేసు తప్పిపోయిన సంగతి తెలిసేసరికి  కొంత ఆలస్యం జరిగింది.

👉 మరియ, యోసేపులకు కంగారు కలగడం సహజమే. యేసు దొరికినప్పుడు మరియ ఆయనను మందలించడంలోనే అది అర్ధమైంది (వ.48). 
ఇక్కడ మనకు కనిపించేది 

*భయభక్తులు, ఆనందం నిండి ఉన్న కుటుంబం. ఒకరి క్షేమం గురించి ఒకరికి ఆరాటం, దేవుని పట్ల తమ కర్తవ్యం గురించి శ్రద్ధ ఉన్న కుటుంబం.*

👉 మరియ, యోసేపులు తమ పిల్లలను విశ్వాసులుగా పెంచాలని పాటుపడినవారు. తమ పిల్లల విషయంలో వారికి ప్రగాడమైన  ఆపేక్ష, అనురాగం  ఉన్నప్పటికీ   *అది పిల్లలకూ, దేవునికీ అడ్డుగా నిలబడకుండా జాగ్ర్రత్త పడ్డారు.* 

   యేసు సహజంగానే ఆదర్శప్రాయుడైన కుమారుడు. ఆయనకు సంబందించిన వరకూ ఆ కుటుంబంలో సమస్యలనేవే లేవు. 

40వ వచనంలో ఆయన బాల్యం గురించి *“బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను”* అని వ్రాసి ఉంది. యెరూషలేములో జరిగిన ఈ సంగతి తరువాతి కాలం గురించి 52వ వచనంలో *“యేసు జ్ఞానమునందును, వయస్సునందును, దేవుని దయ యందును వర్దిల్లుచుండెను”* అని వ్రాసి ఉంది. 

👉ఒక మానవ కుటుంబంలో తన సంబంధాలా ద్వారా యేసు తాను ఏ పని చేసేందుకు  వచ్చాడో ఆ పనికి సిద్దపడుతూ ఉన్నాడు.
 *రెండువేల సంవత్సరాల క్రితం ఒక దీన కుటుంబం ద్వారా ఆయన చేసిన దానిని బట్టి ఆయన పట్ల నిజంగా భయభక్తులు గల ఏ కుటుంబాన్నైనా ఆయన ఎలా వాడుకోగలడో అర్ధం అవుతుంది.*

  ♻ *మన కుటుంబ జీవితంలో ప్రభువుకే ప్రథమ స్థానం లభించాలని ప్రార్ధన చేద్దాం.*

_లూకా2:40, 48, 49, 52_

 2⃣  *కుటుంబము -సుఖ దుఃఖాలలో తోడు, నీడ* ♻

_గలతీ 6:1-10_

 👉  క్రైస్తవుని బాధ్యతలు జీవితంలోని ప్రతి రంగంలోనూ ప్రాముఖ్యమైనవే గాని వాటి ఆవశ్యకత కుటుంబంలో మరి ఎక్కువగా కనిపిస్తుంది. పౌలు చెబుతున్న మాటల్లోని సత్యం ఇదే. 

🔹కుటుంబంలో విచారాన్ని తెచ్చే పరిస్థితులు, ఆనందాన్నిచ్చే పరిస్థితులు, దిద్దుబాట్టు, గద్దింపు అవసరమైన పరిస్థితులు వస్తుంటాయి (వ.1).
🔹 పంచుకోవలసిన బరువులు ఉంటాయి (వ.2).
🔹 మన ప్రవృత్తి ఎలాంటిదో దానికి తగినట్టుగానే కుటుంబంలోని వ్యక్తులతో మన సంబందాలు ఉంటాయి (వ7,8). 
🔹కుటుంబ వ్యవస్థలో ఓపిక కలిగి ఉండాల్సిన అవసరం (వ.9), 
🔹సత్ర్కియలు చేసే తరుణాలు అస్తమానము  కలుగుతుంటాయి. 

   *“మంచి దారికి తీసుకురావలెను”* (వ.1) అనే మాట మార్కు 1:19 లో యాకోబు, యోహానులు తమ వలలు బాగుచేసుకునే సందర్భంలో వ్రాయబడింది.

👉 *కుటుంబంలో ఒక వ్యక్తి దారితప్పితే మనకెందుకులే అని మనం ఊరుకోం. వీలైనంతమట్టుకు ఆ గండిని పూడ్చేందుకు ప్రయత్నిస్తాం. దేవుని కుటుంబం విషయంలో కూడా ఇలానే ఉoడాలి.* 

  2-5 వచనాలలో రెండు మాటలున్నాయి – 
*“ఒకని భారమునొకడు భరించి”, “ప్రతీవాడు తన బరువు తానే  భరించుకొనవలెను”.*
 
👉 ఇవి రెండూ వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. రెండు వేరు వేరు మాటలు వాడబడ్డాయి – *భారము, బరువు.*
👉 ఇక్కడ ప్రాముఖ్యమైనా క్రైస్తవ సూత్రం కనిపిస్తున్నది.

 *భారాలు మోయరానివైనప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అయితే ప్రతీవారికీ తానూ మాత్రమే   నిర్వహించవలసిన భాద్యతలు ఉన్నాయి.*

👉 కుటుంబంలో పిన్నలకు కూడా భాద్యతలు ఉన్నాయి వారిని తమ భాద్యతలను నిర్వహించానీయకుండా చేయడం వారి పట్ల ఉన్న మన ప్రేమ వాత్సల్యం చూపడం అనిపించుకోదు. 

👉ఈ రెండు వచనాలలో మరొక విషయం కూడా ఉన్నది. ఇతరులకు సహాయం చేసేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉండాలి (వ.2). 
*అయితే మన భాద్యతలాను మనమే పూర్తి చేసుకుంటూ ఉండాలే గానీ, ఇతరులు వచ్చి మనకు సహాయం చేస్తారులే అని చూడకూడదు.*

🔺  *ఒక వ్యక్తి ప్రవర్తన ఇతరులపై కూడా ప్రభావం చూపుతుంది.*

👉 ఒక కుటుంబం లోపల ఈ ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. *విత్తడం, కోయడం,* వీటికి సంబందించిన సూత్రం ఒకరిపట్ల ఒకరికి ఉన్న మన భాద్యతలను మరింతగా గుర్తించగలిగేలా చేయాలి.

 *వ్యక్తిగత ప్రవర్తనలో మనం ఏ విత్తనాలు చల్లుతామో అలాంటి ఫలితమే ప్రభువు కొరకు మన కుటుంబ సాక్ష్యంలో కనిపిస్తుంది.* 

   *మన కుటుంబ సంబంధాలలో ప్రభువు ఇచ్చే జీవాన్ని మనం అందరికీ వెల్లడి చేయగలగాలని ఆయనను వేడుకుందాం.*   

_గలతీ 6:1-10_ 

3⃣ *కుటుంబం సూక్ష్మ రూపంలో ఉన్న సంఘం* ♻

తీతు 2:1-15_

   పౌలు ఇక్కడ క్రైస్తవ గృహం గురించి వ్రాస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే *క్రైస్తవ గృహం సూక్ష్మ రూపంలో ఉన్న సంఘం.* 
🔹 ఇతరులతో మనకు ఉండే అతి సన్నిహిత బంధాలన్నీ కుటుంబంలోనే ఉంటాయి.
🔹 కుటుంబంలో ఒకరి గురించి ఒకరికి అర్ధమైనంత స్పష్టంగా బయటివారికి అర్ధం కావు. 

👉క్రైస్తవ ప్రమాణాలను కుటుంబంలో పాటించడానికి మనం సమ్మతిస్తామో, నిరాకరిస్తామో దాని పైననే మన ఆధ్యాత్మిక స్థితి ఆధారపడి ఉంటుంది.

♻ *సంఘంలో సహవాసం, పరిచర్య ద్వారా మనం నేర్చుకొన్న సత్యాలను ఇంటిలో ఆచరించాలి.*
 👉తద్వారా *క్రైస్తవ గృహం దేవుని మహిమకు సాక్ష్యంగా ఉంటుంది.* లేదా ఆయన నామానికి అవమానకరమౌతుంది.

  11-14 వచనాలలోని సువార్త వాక్కులను ఆధారం చేసుకొని 1-10 వచనాలలోని హెచ్చరికలు వ్రాయబడ్డాయి. అనుదిన జీవితంలో క్రీస్తు అవతరంలోని శక్తిని  ఇంత ప్రస్ఫుటంగా ఎత్తి చూపించిన ఇలాటి వాక్య భాగాలు బైబిలులో అరుదుగా కనిపిస్తాయి. 

ఈ అధ్యాయంలో ఉన్నట్టుగా *క్రీస్తు సువార్త శక్తిని గృహానికీ, కుటుంబానికీ అన్వయించి వ్రాసినప్పుడు సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చే పథకంలో క్రైస్తవ గృహానికి ఉన్న అఖండమైన పాత్ర అర్ధమవుతున్నది. మన గృహాలను మార్చి వేసి ఒక అర్థాన్ని కల్పించగల సువార్తలోని శక్తిని గుర్తించడం ఎంతైనా ఆవశ్యకం.*

🔺  కుటుంబంలోని ఒక్కొక్కరికీ పౌలు ఇస్తున్న సూచనలు చూస్తుంటే (వ.2-10) 
*దేవుని కృప మూలంగా కుటుంబంలో ఎలాటి పరిస్థితులు ఉండాలి,*
👉 క్రేతు ద్వీపంలోని ప్రజలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అన్న తేడా అర్ధమౌతున్నది. తీతు క్రేతు లంకలో ఉన్నప్పుడు పౌలు అతనికి లేఖ వ్రాసాడు.
 
*క్రేతు వాసుల కుటుంబ జీవితంలో కనిపించే నిర్లక్ష్య భావం, స్వార్ధం, బాధ్యతా రాహిత్యం ఆ ప్రజల కుటుంబ వ్యవస్థనే అల్లకల్లోలం చేసి పారేసింది.*
👉 క్రైస్తవ కుటుంబంలో ఎవరి స్థానానికి తగిన మన్నన వారికి లభించాలి. 

👉వారందరినీ ప్రేమ బంధం కలిపి ఉంచుతుంది. 

*కుటుంబం ఎలా ఉండాలని దేవుడు నిర్దేశించాడో ఆ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలన్న దీక్ష కుటుంబంలో కనిపించాలి.*

👉 మానవ సంబంధాలలో మనకు ఎదురయ్యే సమస్యలు ఇందు మూలంగా పూర్తిగా అదృశ్యమైపోవు గాని ఈ సమస్యలే మన బాధ్యతలను సువార్త శక్తి ద్వారా నేరవేర్చగలిగేందుకు దేవుడు ఇచ్చే శిక్షణగా ఉపయోగపడతాయి.

♻ స్థానిక సంఘ సమస్యలే క్రైస్తవ గృహాలలో సమస్యలుగా ఉండడం బహు విచారకరం.

🔺 *సువార్తలోని అంతరార్ధాన్ని మన చుట్టూ ఉన్న ప్రపంచానికి చాటి చెప్పేవిగా మన కుటుంబాలు ఉండాలి.*

👉 *మన గృహాలు ప్రభువుకు సాక్ష్యార్ధంగా ఉండాలని ప్రార్ధన చేద్దాం.*

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...