▫️——— సామెతలు ———▫️
క్లుప్త ధ్యానములు ( Part:1)
🔅 *సామెతలు గ్రంథము*:
▫️—————————
▫️రచయిత. : సొలోమోను
▫️పుస్తకము : 20
▫️అధ్యాయములు. : 31
▫️వచనములు : 915
▫️ముఖ్య పదజాలం: జ్ఞానము
▫️ముఖ్య వచనం. :
*యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు*.
సామెతలు 1:7
▫️సొలోమోను వ్రాసిన మొత్తము సామెతలు: 3000
(1రాజులు 4:32 )
▫️సామెతలు గ్రంధమందున్న సామెతలు: 800
▫️యివన్నీ కూడా సొలోమోను ఒక్కరే వ్రాసినవి కాదు
(సామె: 30:1; 31:1)
*ఉద్దేశ్యము:*
▫️————-
జీవిత వ్యవహారాలలో ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకొనుటకు:
🔅జ్ఞానము, ఉపదేశము అంటే ఏమిటో తెలుసుకొనుటకు
🔅పరిజ్ఞాన ప్రబోధాలు అర్ధం చేసుకొనుటకు
🔅నీతి, న్యాయం, నిజాయితీ ఆచరణలో పెట్టడానికి వివేకం నేర్పుతాయి.
🔅తెలివి తక్కువ వారికి బుద్ధిని కలిగిస్తాయి.
🔅యువకులకు తెలివితేటలు, వివేచనా శక్తి చేకూర్చుతాయి.
🔅సామెతలు వినడం ద్వారా జ్ఞానాభివృద్ధి కలుగుతుంది.
🔅వివేకవంతుడు నీతి సూత్రాలను సంపాదించుకొన గలడు.
🔅సామెతలు ద్వారా......
▫️సాదృశ్యాలు,
▫️జ్ఞానులు చెప్పే విషయాలు,
▫️పొడుపు కథలు, వంటివాటిని ప్రజలు అర్ధం చేసుకోగలరు. ( సామెతలు 1: 1-6)
*Imp Note* ✍🏻
———————-
ఈ సామెతలు గ్రంథాన్ని తెలుసుకోవడం, చదవడం, వినడం వలన ప్రయోజనం లేదుగాని, ఆచరణలో పెట్టడం అత్యంత ప్రాముఖ్యం.
ఎందుకంటే? ఇంతటి జ్ఞానవాక్కులు పలికిన జ్ఞానియైన సొలోమోను కొన్నిసార్లు వీటిని ఆచరణలో పెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. దాని ఫలితం అత్యంత బాధాకరం. 1రాజులు 11:1-6
ధ్యానిద్దాం! అనుసరిద్దాం! ఆత్మీయతలోనికి ప్రవేశిద్దాం! నిత్యమైన ఆశీర్వాదాలు అనుభవిద్దాం! అట్టి కృప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి