✳ *క్రైస్తవ కుటుంబము* ✳
♻ *క్రైస్తవ కుటుంబ వ్యవస్థలో, ముఖ్యంగా భార్యా భర్తల వివాహ బంధంలో పిల్లల పాత్ర ఏమిటి?*
♻ *పిల్లల పట్ల మన వైఖరి ఎలా ఉండాలి?*
ఈ ప్రశ్నలు ఏంతో ప్రాముఖ్యమైనవి.
♻ *కుటుంబానికి కేంద్ర బిందువు ఏమిటి?*
♻ *కుటుంబం దేనిమీద ఆధారపడి క్రీస్తుకు నచ్చిన విధంగా నడుచుకోగలదు?*
అని ఎవరైనా ప్రశ్నిస్తే,
🔹ఎక్కువ శాతం కుటుంబానికి కేంద్రబిందువు పిల్లలు,
🔹పిల్లల కోసమే బ్రతుకుతున్నాము, వారి సంతోషమే మా సంతోషం అని చెప్తారు.
*కాని లోతుగా ఆలోచిస్తే అది సరియైనది కాదు అని అర్ధం చేసుకుంటాము.*
♻ వివాహ బంధంలో భార్య భర్తల మధ్య
🔹దేవుని వాక్యమునకు విధేయత,
🔹 ప్రేమ,
🔹సహకారము,
🔹నమ్మకంతో కూడిన బంధమే
*నిజంగా క్రైస్తవ కుటుంబానికి కేంద్ర బిందువుగా వుండాలి.*
*పరిశుద్ధ గ్రంథములో కుటుంబం అని కొన్ని సందర్భాల బట్టి, కోన్ని లక్షణాలను బట్టి:*
1⃣ *లేవి వంశాన్ని ఒక కుటుంబముగా*
(నిర్గ 2:1),
2⃣ *ఇశ్రాయేలు దేశాన్ని ఒక కుటుంబమముగా*
(నిర్గమ 16:31)
3⃣ *యెహోవా మందిరాన్ని ఒక కుటుంబముగా*
(1సమూ1:7, 1రాజులు 6:1-38)
4⃣ *స్థానిక సంఘాన్ని ఒక కుటుంబముగా*
(1తిమో 3:15)
5⃣ *సార్వత్రిక సంఘాన్ని ఒక కుటుంబముగా*
(1పేతు2:5 & ఎఫెసి2 :19-22)
6⃣ *దేవుని నివాస స్థలమును ఒక కుటుంబముగా*
( యెహో 14:2)
7⃣ *మనమే అయన ఇల్లు*
(హెబ్రీ 3:6)
అని బైబిల్ లో చూడగలము. అంటే ఇద్దరు లేక ముగ్గురు, ఒక వంశం, ఒక దేశం, దేవుని మందిరం, స్థానిక సంఘం, సార్వత్రిక సంఘం, దేవుని నివాస స్థలం *ఇవన్నీ కుటుంబాలుగానే పిలువబడుతున్నాయి.*
వీటన్నిటికి మూలం
*ఆదాము-హవ్వల చిన్న కుటుంబం.*
తరువాత చెప్పుకోదగ్గ
👉 *నోవాహు కుటుంబం.*
👉 *అబ్రహాము- శారా,*
👉 *ఇస్సాకు-రిబ్కా,*
👉 *యాకోబు 12 గోత్రాలు ఒక కుటుంబము,*
12 గోత్రాలలో ఒక్కొక్క కుటుంబం ఇలా ప్రపంచమంతా అనేక కుటుంబాలు ఉన్నా,
*మనమంతా దేవుని దృష్టిలో ఒక మానవ కుటుంబం.*
*కుటుంబములో యాకోబు, ఏశావు వలే విభిన్న మనస్తత్వాలు, జీవనోపాధి కోసం కుటుంబంలో కొందరు విభిన్న ప్రాంతాలలో వున్నా అందరూ దేవుని కలిగి ఉండాలి.*
🔹ఇశ్రాయేలీయులలోనే కొన్ని కుటుంబాలు దేవుని మందిరాన్ని హత్తుకొని యాజకులుగా స్థిరపడితే,
🔹ఇంకొన్ని కుటుంబాలు బ్రష్టులై నాశనము కొనితెచ్చుకున్నాయి.
👉అయితే
*దేవుడు ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలి అనే కోరుకుంటాడు.*
*కుటుంబములోని ఏ ఒక్క వ్యక్తి నశించాలి అని కొరుకోడు.*
👉 *కుటుంబం దేవుడు ఏర్పాటు చేసినది.*
👉 *దేవుడు ఆదాము, హవ్వలను భార్యా భర్తలుగా ఏర్పాటుచేసి ఫలించి అభివృద్ధి చెందుమని చెప్పెను.*
అయితే కుటుంబములో సాతాను జొరబడి సంతోష సమాధానాలు లేకుండా చేయడానికి ప్రయాసపడుచున్నాడు. *కనుకనే ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత తన కుటుంబమును కట్టుకొనుట ఎంతో ముఖ్యము!*
👉ఇంటగెలిచి రచ్చగెలవమన్నట్టు మన కుటుంబాన్ని కట్టుకోకపోతే మన భక్తిని, సేవను ఎవరూ నమ్మరు. గనుక *సాతాను మన గృహములో ప్రవేశించకుండా ప్రార్ధన ద్వారా యోబువలె మన ఇంటి చుట్టూ కంచె వేసుకొంటూ,*
*నోవాహువలె మన కుమారులను, కోడండ్రను, మన ఇంటి వారినందర్ని రక్షణలోనికి నడిపించుకొందాం*.
లోకానికి తండ్రి అయిన దేవుడు *"నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత వదిలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును..."* (ఎహెజ్కేలు 33:11).
కొన్ని వేల సంవత్సరాల క్రితం పాలస్తీనాలో జరిగిన ఒక కుటుంబ గాధ, బైబిలు లో వ్రాయబడింది. అది మనకు కొన్ని సూచనలు ఇస్తున్నది.
*ఇస్సాకు, రిబ్కాలు భార్య భర్తలు.*
👉 వారికి ఇద్దరు కుమారులు *ఏశావు, యాకోబు.*
అయితే ఆది 25:28 లో *“ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను, గనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను”.*
కీర్తనలు 127:3 లో *“కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము”* అని వ్రాయబడియుంది.
❌ *అంటే దేవుడు ఇచ్చిన స్వాస్థ్యమును లేక బహుమానములను తల్లిదండ్రులిద్దరూ సమానంగా ప్రేమించలేక పోయారు.*
👉 పిల్లలను ప్రేమించే విషయంలో వారిద్దరి మధ్య ఏక మనస్సు లేదు.
👉కాబట్టి పిల్లలు ఆ కుటుంబానికి కేంద్ర బిందువుగా మారారు.
◼ఏశావును మాత్రమే ఆశీర్వదించాలని ఇస్సాకు ఆశ,
◼ యాకోబును ఆ ఆశీర్వాదములకు వారసుడిని చేయాలని రిబ్కా తహ తహ. *ఆ కుటుంబ వ్యవస్థను ఛిన్నా భిన్నం చేసాయి.*
👉 రిబ్కా యాకోబును ఎంతగా ప్రేమించింది అంటే, భర్తను మోసం చేయడానికి కూడా వెనుకాడలేదు.
*ఏ రిబ్కా అయితే (ఆది 24లో) దూరమునుండి యజమానుని చూచి గౌరవించి, ఒంటె మీద నుండి దిగి ముసుకు వేసుకుందో! ఆ రిబ్కా (ఆది 27లో) కళ్ళు కనపడని, ముసలివాడైన భర్త, మనిషి రోమాలకి మేక వెంట్రుకలకు తేడా తెలియని స్థితిలో ఉన్న భర్త బలహీనతను ఆధారం చేసుకొని ఆయనను మోసం చేసింది.*
👉 ఆ రోజే ఆ కుటుంబం సుఖసంతోషాలకు, ప్రేమ అనురాగాలకు, కలిసి జీవించడానికి దూరం అయింది. మనకు ఇదొక హెచ్చరిక.
❇ *ఎదుట భార్య భర్తలు ఒకరినొకరు దూషించుకుంటూ వుంటే ఒకరోజు అదే పిల్లలద్వారా వారి ఇద్దరి మధ్య బంధం బలహీనపడుతుంది.*
👉 తల్లి పక్షాన చేరి తండ్రిని తృణీకరిస్తారు, లేదంటే తండ్రి పక్షాన చేరి తల్లిని కాదంటారు.
☑ *ప్రతి గృహంలో I కోరింథీ 13:4,5*
“ప్రేమ దీర్ఘకాలము సహించును. దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు. అమర్యాదగా నడువదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారమును మనస్సులో ఉంచుకొనదు” అన్న వాక్యాలు నెరవేర్చబడాలి.
❇ *భార్య భర్తలు కలిసి పిల్లల పెంపకం విషయంలో తగిన శ్రద్ధ చూపించాలి. పిల్లల ద్వారా భార్య భర్తల బంధం ఇంకా బలపరచబడాలి కాని బలహీనపడరాదు.*
👉 పిల్లలు లేరని, పిల్లల కోసం మరొక పెళ్లి చేసుకోవడం క్రైస్తవ వివాహ బంధానికి విరుద్ధం. అది లోకందృష్టిలో తప్పులేనిదిగా ఎంచబడవచ్చు కాని క్రైస్తవులైన మనకు కాదు.
🔹 *మన జీవన విధానం బట్టి మన కుమారులు మన వైఖరి బట్టి నడుచుకుంటాడు.*
👉తల్లిదండ్రులు తిండిబోతులు, తాగుబోతులు, తిరుగుబోతులు, ఒక క్రమము లేని వారిమైతె మన కుమారులు కూడా దేశాదిమ్మరులు, చోరులు, వ్యభిచారులు అవుతారు,
🔹అప్పుడు కుటుంబ వ్యవస్థ సర్వ నాశనం అవుతాది.
👉చాల మంది యవ్వనస్థులు ఈ వ్యాసం చదువుతున్నారు.
*ఇందులో వివాహము అయినవారు ఉన్నారు.త్వరలో వివాహము చేసుకోవాలి అనుకొనేవారు ఉన్నారు.*
👉 కాబట్టి ఇప్పుడే మనం ముందు మన ప్రవర్తన సరిచేసుకుందాం. అప్పుడు మన కుటుంబం సరిగా ఉంటాది.
👉 *మొదటి ఆదాము దంపతులు ధైవజ్ఞ మీరిన కారణాన వారి కుమారుడైన కయీను నరహంతకుడు అయ్యాడు.*
👉 *లోతు లోకాశ వల్ల తన కుటుంబాన్ని సొదొమ గొమొఱ్ఱ కు నడిపించి బ్రష్ట సంతానానికి కారణం అయ్యాడు.*
👉 *ఆకాను ధైవజ్ఞ మీరి శపితమైన దానిలో కొంత దొంగిలించుట వల్ల తన కుటుంబం రాళ్ళతో కొట్టబడింది.*
👉 *కోరాహు దేవునికి విరోధముగా మోషే, ఆహారోనులను ఎదురించుట వలన తన సమూహం అంత అగ్ని చేత కాల్చబడింది.*
👉 *దావీదు బాత్సెబాతో పాపము చేసి, తన భర్తను యుద్ధములో చంపించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తరువాత పశ్చాత్తాప పడిన శిక్ష అనుభవించాడు.*
*కాబట్టి మన పాపము మన కుటుంబాలను పాడు చేస్తాది.*
👉 దేవుడు శిక్షింపక మానడు. కాబట్టి మన జీవితాలు దేవుని యెదుట యధార్ధముగా కనపరుచుకొనునట్లు పాటుపడుదాం.
*దేవుడు మన కుటుంబాలను, మన పిల్లలను ముఖ్యంగా పవిత్ర క్రైస్తవ వివాహ బంధాలను, పటిష్ఠ పరచి ఆయన కృపలో మనలను భద్రపరచును గాక.*
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి