ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హనోకు ఎటువంటి పరిస్థితులలో దేవునితో నడిచాడు?...✍*

✳ *హనోకు ఎటువంటి పరిస్థితులలో దేవునితో నడిచాడు?...✍*

ఆది 5:21-24 *“హనోకు అరువదియైదేండ్లు బ్రతికి .. దేవుడతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను”.*

హనోకు దాదాపు 300 యేండ్లు దేవునితో నడచినాడు. ఇది అందరికీ తెలిసిన విషయం, 
*హనోకు ఎటువంటి పరిస్థితులలో దేవునితో నడిచాడు?*

 *దేవునితో నడవడం అంటే ఏమిటి?*

ఆది 5:28,29 లో గమనిస్తే, 
*నెమ్మది అనేది ఎరుగని దినములలో జనులు ఉన్నట్లు తెలుసుకోవచ్చు.*

👉 *లెమేకు ఒక కుమారుని కని, ఇతడు మనకు నెమ్మది కలుగజేస్తాడు అని అనుకొని నోవహు అని పేరు పెట్టాడు.* హనోకు దేవునితో నడుస్తున్న రోజులలో అనగా *300 సంవత్సరములు,* పనిలో నెమ్మది లేదు. భూమి శపించబడి ఉంది. చేతుల కష్టం ఎక్కువగా ఉంది. అందులో నెమ్మది లేదు. 

ఆది 1:28లో  *ఆదామును దేవుడు ఆశీర్వదించాడు, ఆదాము పాపము చేసిన తరువాత; ఆదాము నిమిత్తం నేల శపించబడింది. అప్పటి నుండి అబ్రాము, అబ్రహాముగా మార్చబడే వరకు ఆశీర్వాదము అనేది భూమి మీద లేదు. శాపం హనోకు మీద ఉంది; పరలోక నిరీక్షణ లేదు, దేవుని కార్యం ఒక్కటి కూడా లేదు.*

👉 *హనోకు ఇటువంటి పరిస్థితులలో లోకమును చూడకుండా, ఒక దినము విడువకుండా దేవునితో నడిచాడు.*

👉 తనకు భార్యా పిల్లలు ఉన్నారు, చేతులతో కష్టము చేస్తునాడు. ఇంటి బాధ్యతలు అన్ని నెరవేరుస్తూ; నెమ్మది అనేది లేకపోయినా సాకులు చెప్పకుండా దేవునితో నడుస్తున్నాడు.

♻ *క్రీస్తునందు ప్రియులారా! క్రీస్తు యేసు మరణం ద్వారా మనం శాపం నుండి విడుదల (రక్షణ) పొండుకొని, ఆశీర్వాదమునకు పాత్రులమైనాము. పరలోకం మనకు తెరువబడింది. ప్రతి రోజు దేవుని స్వరం వింటున్నాము.*

 *అడుగడుగునా దేవుని కార్యములు చూస్తున్నాము కాని, దేవునితో నడుస్తున్నామా?*

👉 ఆదివారం చర్చికి రావడానికే కొందరికి కష్టముగా మారిపోయింది. సాకులు చెప్పడం క్రైస్తవులకు వ్యసనముగా మారిపోయింది. కొందరు చదువుకోవాలని, కొందరు కొత్తగా పెళ్ళి అయిందని, కొందరు పిల్లలున్నారు అని, కొందరు ఉద్యోగం అని ఏదో ఒక సాకు చెప్తుంటారు. 
*కొంతమంది దేవునితో నడవడంకాదు, దేవుడే నడిపిస్తాడు అని చెప్తుంటారు; దేవునికి తనతో నడిచే క్రైస్తవులు కావాలి, తనను నడిపించేవారు కాదు.*

♻ *దేవునితో నడవడం అంటే ?*

ఆది 6:9లో  *.. నోవహు నీతిపరుడు..దేవునితో నడచినవాడు.* 

👉 *అంటే?. ఎవరు నీతిగాను, నిందారహితునిగాను ఉంటారో వారినే దేవునితో నడిచేవారు అంటారు.*

 *నీతిపరునిగా ఎలా తీర్చబడుతాము?*

 🔹 లూకా 18:13,14లో  *సుంకరి దేవుని దగ్గర తనను తాను తగ్గించుకొని, తాను పాపిని అని ఒప్పుకున్నప్పుడు,*

🔹 14వ వచనంలో  *దేవుని చేత నీతిమంతునిగా తీర్చబడినాడు.* 

👉 కాని, అనేకులు మనుష్యుల ముందు తగ్గించుకొని, మనుష్యుల చేత మంచివాడు, గొప్పవాడు అని అనిపించుకుంటారు. దేవుని ముందు ఏపాపం చేయనట్లు ప్రతి పాపమును కప్పుకుంటారు. *కొంతమంది సేవకులు కూడా ఇతరులకు వాక్యం చెప్పడానికి వారి తప్పులను చూపించడాకే బైబిల్ చదువుతారు కాని వారి కోసం చదవరు. మాలో ఏ తప్పు లేదన్నట్లు ప్రవర్తిస్తారు.*

👉 దేవుని దగ్గర మనం తప్పులను మొట్ట మొదట రక్షణకు ముందు ఒప్పుకోవడం కాదు, ప్రతీ రోజు మనకు తెలిసి తెలియక కొందరిని బాధపెట్టవచ్చు. Iకోరింథీ 8:8-13లో పౌలు గారు, మనకున్న విశ్వాసము ద్వారా మన క్రియల ద్వారా బలహీనమైన మనస్సాక్షి గల తోటి సహోదరుని మనసుని నొప్పిస్తే; అని క్రీస్తుకు విరోధముగా పాపము చేసినట్లే అని చెబుతున్నారు. మనకు నచ్చినది ఇతరులకు నచ్చక పోవచ్చు. ఇలాంటి క్రీస్తునకు విరోధమైన పనులు చేస్తుంటాము.

 *మనము ప్రతీరోజు ఇతరుల కొరకే కాదు, మన జీవితము కొరకు కూడా బైబిల్ చదవాలి. ప్రార్ధన చేయాలి. దేవుని దగ్గర మనలను మనము తగ్గించుకొనినప్పుడే మనము నీతిమంతులముగా తీర్చబడుతాము.*

దావీదు మహారాజు, ఆదాము వలే పాపము కప్పుకోలేదు, ఒప్పుకున్నాడు. అందుకే ఆదాము గురించి ఎక్కడ బైబిల్ ఎక్కువగా జ్ఞాపకము చేయబడలేదు కాని, దావీదు గురించైతే సొలోమోను మొదలుకొని అనేక సందర్భాలలో తన సేవకుడైన దావీదు వలే తన దేవుడైన యెహోవా యెడల యధార్ధముగా లేకపోయెను అని జ్ఞాపకము చేయబడినది. 
*ఎవరు దీనులై యదార్ధముగా దేవుని దగ్గర తన పాపములను ఒప్పుకుంటారో వారే నీతిమంతులు. నీతిపరుడును ఎవరిచేత నిందింపబడని వారినే దేవునితో నడిచేవారు అంటారు.*

 👉మన పాపములను మనము ఒప్పుకున్నప్పుడే క్రీస్తుతో మొట్టమొదటి పరిచయం ఏర్పడుతుంది.
 *ఎందుకంటే ఆ పాపమే మనలను ఆ క్రీస్తునుండి దూరస్తులుగా చేసి,అదే ఒప్పుకోలు ఇప్పుడు ఆయనకు దగ్గర చేస్తుంది.*  

 ♻ *మన వ్యక్తిగత పాపములను మన నోటితో ఒప్పుకున్నప్పుడే దేవునితో సత్ సంబంధం ఏర్పడుతుంది.*

♻ *అంతేకాకుండా క్రీస్తు నా కొరకు, అనగా నా పాపములకోరకు చనిపోయి తిరిగి లేచాడు అని నమ్మినప్పుడే ఆయనతో పరిచయం ఇంకా బలపడుతుంది.*

♻ *ఒకే సారి అయిన పరిచయం పరస్పరంగా బలపడాలి అంటే అనుదినం కాస్త సమయమైన వెచ్చించాలి.*

🔺 మనకు బాగా నచ్చిన వ్యక్తితో ఎలా ఉంటామో అలానే క్రీస్తుతో కూడా ఉన్నప్పుడే ఒక వినూత్నమైన అనుభూతిని పొందగలుగుతాము. 

👉 మన బిజీ ప్రపంచలో కాస్త సమయం దేవునితో ప్రార్ధనలో,
👉 బైబిలుని చదివే సమయం వెచ్చించి నప్పుడు నిజమైన క్రైస్తవ జీవితాన్ని పొంద గలుగుతాము.

*క్రీస్తును గూర్చి ఇతరుల ద్వారా తెలుసుకోవడం కన్నా వ్యక్తిగత అనుభవం చాల ప్రత్యేకమైనది.*
 
🔺మన పాపములను మనము ఒప్పుకొనినప్పుడే, మన జీవితం పరిశుద్ధంగా మారుతుంది. 
🔺అలా మన హృదయం మరియు జీవితం సరిగా ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు తనకు తాను బయలు పరచుకుంటాడు. 

👉ఇదే మనలో ఆయన యెడల కలిగే విశ్వాసం. 
*దేవుని వాక్యం ద్వారా అట్టి విశ్వాసం మరింత బలపరచబడుతుంది.*

 *“పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములు గాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను.* 

*ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక మందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుం డెను”.*
 (హెబ్రీ 11:13)

👉పరిశుద్ద గ్రంథంలో ని పాత నిబంధన భాగాలు క్రీస్తు యొక్క మొదటి రాకడను బయలు పరుస్తుంది, 

👉నూతన నిబంధన భాగాలు ఆయన జీవితాన్ని, మరణ పునరుర్ధారణములను, పరలోక రాజ్యమును గూర్చి మరియు రెండవ రాకడను గూర్చి తెలియజేస్తుంది. 

👉ఇట్టి దేవుని వాక్యాన్ని బహుగా ధ్యానించినప్పుడే మనలో విశ్వాసం బలపడుతుంది. 

👉కేవలం దేవుని వాక్యాన్ని చదవడమే కాకుండా అట్టి వాక్యాన్ని అనుసరణలో ఉంచినపుడే జీవితం ఒక అర్థవంతమైనది అని చెప్పగలం.

 *“నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందు నని చెప్పెను.”*
 యోహాను 14:21. 

❌ యేసు క్రీస్తు అంటే ఎవరో తెలుసు అనే వారు ఈ ప్రపంచంలో అనేకులు ఉన్నారు. 

☑ *కాని అ క్రీస్తు ఎవరో నాకు తెలుసు అనే మాట కంటే అ క్రీస్తుతో సహవాసం కలిగిన అనుభవం ప్రత్యేకమైనది.*

 హనోకులాంటి క్రైస్తవులు దేవునికి కావాలి. అలాంటి వారితోనే దేవుడు నడుస్తాడు. పరలోకంలో స్థానం కూడా హనోకు లాంటి వారికే కాని, లూకా 18:11లో దేవుని ముందు తనను తాను నీతిమంతునిగా కనబరచుకొని హేచ్చించుకొనిన వరిసయ్యుని లాంటి వారు కాదు కావలసినది.

*ప్రియులారా! ఒక సారి మనము క్రీస్తుతో ఎలా నడుస్తున్నామో పరీక్షించుకుందాము!!!*

👉 అట్టి సహవాసం కలిగి దేవునితో నడిచిన అభువం మనమందరం పొందవలెనని నా అభిలాష. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...