1⃣ *పాతాళంలో నుండి ధనవంతుడు చేసిన ప్రార్ధన.*
*తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికర పడి, తన వ్రేలికొనను--నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడు చున్నానని కేకలువేసి చెప్పెను.*
లూకా 16:24
♻ *ధనవంతుడు* ♻
🔹 అత్యంత విలువైన వస్త్రాలు కలిగి యున్నాడు. కానీ, రక్షణ, నీతి వస్త్రాలు లేవు.
🔹 శారీరికంగా సమృద్ధియైన ఆహారముంది. కానీ ఆత్మీయ ఆహారం లేదు.
🔹 శారీరికంగా సుఖాన్ని అనుభవిస్తున్నాడు. కానీ ఆత్మీయ ఆనందం కరువయ్యింది.
🔹 కనికరము లేని జీవితాన్ని జీవిస్తున్నాడు. కనికరం పొందలేకపోయాడు.
👉 ఇతనిలో నున్న అభినందనీయమైన విషయము ఏమిటంటే?
*కురుపులతో నిండియున్న వ్యక్తిని తన ఇంట వాకిట వుండనిచ్చాడు.*
అయితే, రక్షణ లేకుండా, మనము చేసే కొన్ని మంచిపనులు పరమునకు చేర్చలేవు.
*ఇతని జీవిత అంతము వేధన, బాధ, నిత్య మరణము.*
♻ *లాజరు* ♻
🔸 *దరిద్రుడు. కానీ, ఆధ్యాత్మిక ధనవంతుడై వుండవచ్చు*.
🔸 *శరీరమంతా కురుపులే. కానీ, ఆత్మీయ స్వస్థతను కలిగినవాడు అయ్యుండొచ్చు.*
🔸 అతని కురుపులను శుభ్ర పరచడానికి మనుష్యులెవరూ ముందుకు రాలేదు. కానీ, కుక్కలే ఆపని పూర్తి చేసేవి కాబోలు.
🔸 జీవితమంతా కష్టాలే. కానీ, ఆత్మీయ ఆనందాన్ని అనుభవించిన వాడయ్యుండొచ్చు.
🔸 ధనవంతుని విలాసవంతమైన జీవితాన్ని చూచి, అట్లా బ్రతకాలని తలంచిన వాడు కాదు.
🔸 *ధనవంతుని బల్లమీద నుండి పడిన రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్నాడే తప్ప, ఎన్నడూ దొంగిలినవాడు కాదు.*
🔸 లాజరు ఆధ్యాత్మికంగా తప్పకుండా పరిపూర్ణుడై వుండాలి. లేకుంటే, రక్షణ లేకుండా శారీరిక దుఃఖాన్ని, దారిద్ర్యమును అనుభవించి నంతమాత్రాన, అతడు నెమ్మది పొందే అవకాశం లేనే లేదు.
*ఈ లోకంలో ఎట్లా జీవించినా, అది శాశ్వతం కాదు కదా? ధనవంతుడూ, లాజరు ఇద్దరూ ఈ లోకాన్ని విడచి పెట్టేసారు*.
🔺 ఇక్కడ సుఖాన్ని అనుభవించిన ధనవంతుడు అక్కడ యాతన పడుతున్నాడు.
🔺ఇక్కడ కష్టాలు అనుభవించిన లాజరు అక్కడ నెమ్మది పొందుతున్నాడు.
వీరిద్దరూ నున్న స్థలాలు వేరు వేరు అయినప్పటికీ ఒకరి కొకరు కనిపించేటంత, ఒకరి మాట మరొకరికి వినిపించేటంత దూరం లోనే వున్నారు.
*అప్పుడు ధనవంతుడు .... తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను--నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడు చున్నానని కేకలు వేస్తున్నాడు.*
👉 *భూమి మీద నున్నప్పుడు ధనవంతుడు, లాజరుపట్ల కనికరమును చూపలేదు. కానీ, ఇప్పుడు కనికరమును కోరుతున్నాడు. అది సాధ్యం కానేకాదు.*
♻ *కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.*
మత్తయి 5:7
*మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును*.
మత్తయి 7:2
*మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును.*
గలతి 6:7
♻ *ధనవంతుడు ఏవో ఘోరమైన పాపములు చేసినట్లు లేదు*.
*1. అతనికి వస్త్రాలు వుండగా, లేని వారికి ఇవ్వలేదు.*
*2. ఆహారము సమృద్ధిగా వుండగా, లేని వారికి పెట్టలేదు.*
*అంతే అతడు చేసిన తప్పిదాలు. దాని ప్రతిఫలం నిత్య నరకం.*
👉మన జీవితాలు ఎట్లా వున్నాయి?
సరిచూచుకుందాం!
సరిచేసుకుందాం!
నిత్య రాజ్యానికి వారసులమవుదాం!
2⃣ *ఆశీర్వాదములు కొరకై యాకోబు చేసిన ప్రార్ధన.*
*అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి,తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై యుండును.మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును; మరియు నీవు నా కిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కు కొనెను.*
ఆది 28:20-22
*యాకోబు అంటేనే మోసగాడు అని అర్ధం.*
🔹అన్నను, తండ్రిని మోసం చేసాడు.
🔹మోసానికి ప్రతిఫలంగా అన్న శత్రువుగా మారి, అతనిని చంపాలనే ఆలోచనలో నున్నప్పుడు,
*అన్నకు భయపడి బెయేర్షెబా నుండి హారానుకు పారిపోతున్నాడు.*
👉 ఆ రాత్రి ఒంటరిగా భీకర అరణ్యంలో భయంతో వున్నాడు.
మరో ప్రక్క,మరణానికి సమీపంలోనున్న తండ్రికి, అమితంగా ప్రేమించే తల్లికి, మరీ ముఖ్యంగా వాగ్ధాన భూమికి దూరం కాబోతున్నానని, మరళా తిరిగి వస్తానో రానోననే చెప్పలేనంత బాధతో వున్నాడు.
అయితే, ఆ రాత్రి అతనికి దేవుని ప్రత్యక్షత లభించింది. అతని మోసపూరితమైన జీవితాన్ని గూర్చి ప్రశ్నించకుండా,
*కేవలం ఆయన కృపతో జ్ఞాపకంచేసుకొని, అద్భుతమైన, స్పష్టమైన వాగ్ధానాన్ని దేవుడిచ్చాడు.*
*ఇదిగో నేను నీకు తోడై యుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా*
ఆది 28:15
♻ *ఆ మాటలు యాకోబు నమ్మాడు.*
కానీ, అది అంత బలీయమైన నమ్మకం కాదు. వాగ్ధాన మిచ్చిన దేవుడు ఏవిధమైన షరతులు పెట్టకపోయినప్పటికీ, యాకోబు మాత్రం కొన్ని షరతులు పెడుతున్నాడు.
🔹 నా ప్రయాణ మంతటిలోనీవు నాకు తోడుగా వుండాలి. నన్ను కాపాడాలి. మరళా తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా తీసుకొని రావాలి.
🔹 నేను తినడానికి ఆహారము, ధరించడానికి వస్త్రాలను దయచెయ్యాలి.
అట్లా చేస్తే?
*నీవు నాకు దేవుడుగా వుంటావు.*
( అట్లా జరుగని పక్షంలో నీవు దేవుడవు కాదనే కదా అర్ధం?)
అంతేకాదు,
*నేను తలగడగా చేసుకొనిన ఆ రాయి వున్న స్థలం నిన్ను ఆరాధించే స్థలమవుతుంది.*
*నీవు నాకిచ్చిన వాటన్నిటిలో పదియవ భాగము నీకిస్తాను.*
👉ఒకరకంగా దేవునితో యాకోబు బేరమాడుతున్నట్లుగా వుంది కదా?
అవును!
*యాకోబు షరతులను బట్టి కాదుగాని, ఆయన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చాడు.*
🔺యాకోబుకు దేవుడు తోడుగా నున్నాడు.
🔺 యబ్బోకు రేవులో ఆశీర్వాదించాడు.
🔺శత్రువైన అన్నను మిత్రునిగా చేసాడు.
🔺 తన తండ్రి ఇంటికి అనగా, వాగ్ధాన భూమికి తిరిగి తీసుకొని వచ్చాడు.
👉అనేక సార్లు మనము కూడా ఇట్లాటి తలంపులనే కలిగి యున్నాము.
▪ *దేవుడు నాకు ఇది చేస్తే, రక్షణ పొందుతాను. అది చేస్తే, బాప్తీస్మం తీసుకుంటాను.*
▪ ఉద్యోగం వస్తే చర్చికి మానకుండా వెళ్తాను.
👉నేను అనుకున్నట్లే అంతా జరిగితే?
▪దేవుని మందిరానికి అది ఇస్తాను. దేవుని కొరకు ఇది చేస్తాను.అంటూ దేవునికి షరతులు పెట్టిన సందర్భాలెన్నో కదా?
నీ షరతులనుబట్టి కాదు గాని, ఆయన కృపతోనే అన్నింటిని నీకు అనుగ్రహిస్తున్నాడని తెలుసుకో.
*దేవునితో బేరాలాడే ప్రయత్నం చెయ్యొద్దు. ఆయన కొరకై జీవించే ప్రయత్నం చెయ్యి.*
3⃣ *వారసుని కొరకు అబ్రాహాము చేసిన ప్రార్ధన.*
*అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే; దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా మరియు అబ్రాముఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను.*
ఆది 15:2-4
అబ్రాహాముకు దర్శనమందు దేవుని వాక్యము ప్రత్యక్షమై అతనితో మాట్లాడుతుంది.
*అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికం చేస్తాను.*
👉 *వాక్యం మాట్లాడుతుందా?*
🔹 అవును! వాక్యమే దేవుడై యుండెను.
యోహాను 1:1
దానికి అబ్రాహాము అంటున్నాడు.
*ప్రభువా నీవు నాకు ఎన్ని బహుమానాలు ఇచ్చినా ప్రయోజనం ఏంటి? నాకు సంతానం లేదుకదా? నా దాసుడే నాఇంటికి వారసుడు కదా? అని దేవునికి మనవి చేసినప్పుడు, ఆ దినాన్ని అతనికి దేవుడు గొప్ప వాగ్ధానమిచ్చాడు.*
*నీ దాసుడు నీ ఇంటికి వారసుడు కాదు. నీ గర్భమున పుట్టబోవువాడే నీకు వారసుడవుతాడు.*
ఆది 15:4
👉అంతేకాదు, లెక్కింప సఖ్యముకాని ఆకాశపు నక్షత్రములవలే నీ సంతానం అభివృద్ధి చెందుతుంది.
అబ్రాహాము దేవుని మాటను నమ్మాడు.
*అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను*.
ఆది 15:6
♻ *ఇదే విషయాన్ని నూతన నిబంధన మూడు సార్లు ప్రస్తావించింది.*
(రోమా 4:3 ; యాకోబు 2:23;
గలతి 3 :6)
👉 *అతని నమ్మిక అతనిని సిగ్గుపరచలేదు.*
👉 *వాగ్ధానమిచ్చిన దేవుడు నెరవేర్చకుండా తప్పిపోలేదు.*
*యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారానుగూర్చి చేసెను.*
*ఎట్లనగా దేవుడు అబ్రాహా ముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతియై అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను.*
ఆది 21:1,2
*సృష్టి ధర్మము చొప్పున వారు బిడ్డను కనడానికి ఎట్లాంటి పరిస్థితులూ అనుకూలంగాలేవు.*
*అసలు సాధ్యం కానీ పరిస్థితులు. కానీ, అతని నమ్మిక అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.*
👉అవును!
*నీవు నమ్మ గలిగితే? ఆయనకు అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏదీ లేదు.*
*నీ చుట్టూనున్న పరిస్థితులవైపు, నీ సమస్య వైపు చూడొద్దు. ఆ సమస్యను పరిష్కరించగల దేవుని వైపు చూడు. ఆయన యందు నమ్మిక యుంచు. నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు.*
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి