ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నీ కంటికి కనిపించే, నీచెవులకు వినిపించే దేనినిగురించి భయపడకు....

✳ *నీ కంటికి కనిపించే, నీచెవులకు వినిపించే దేనినిగురించి భయపడకు....✍*

*". . . .దేవునికి లోబడియుండుడి, అపవాదిని (సాతాను) ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును."*
James(యాకోబు) 4:7 

ఒక అడవిలో కుందేళ్ళు ఒక చోట చేరి *"మనలో ఒకరిని మనకి రాజుగా చేసుకుందాము"* అని నిర్ణయం చేశాయి. అన్ని కుందేళ్ళకి ఒక పరిక్ష పెట్టి గెలిచిన కుందేలుకి రాజుగా అధికారం ఇవ్వాలి అని కూడా నిర్ణయించాయి.
అలాగే ఆ విషయాన్నీ అడవి అంతా దండోరా వేయించాయి....

👉 అదే అడవిలో ఒక ఐదు కుందేళ్ళు అల్లరిచిల్లరిగా ఉండేవి, కొత్త రాజుకోసం వేసిన దండోరా విన్న ఈ 5 కుందేళ్ళు ఒకచోట చేరి *"ఐతే మన ఐదుగురిలో ఒకరు రాజుగా కావాలి తప్ప ఇంక ఎవ్వరూ రాజుగా అవ్వకూడదు, అందుకోసం మనం మిగిలిన కుందేళ్ళను మానసికంగా భయపెట్టాలి"* అని అనుకున్నాయి.... అలాగే ఒక ఆలోచన కూడా చేసాయి.

👉 కుందేళ్ళు అన్ని పోటిపడే రోజు రానేవచ్చింది.
అడవిలో కుందేళ్ళు అన్ని పోటి కోసం ఒక చోట చేరాయి.

అప్పుడు ఒక కుందేలు ముందుకి వచ్చి ఒక ఎత్తేన కొండను చూపించి *"ఎవరైతే ముందుగా ఈ కొండపైకి ఎక్కుతారో వారే రాజుగా ఉండుటకు అర్హులు"* అని ప్రకటించింది.
అన్ని కుందేళ్ళు పోటికి సిద్దపడ్డాయి.

👉 ఈ అల్లరి 5 కుందేళ్ళు కూడా వచ్చి వరసలో నిలబడ్డాయి.
కొంచం సమయంలో పోటి ప్రారంభం అవుతుంది అనగానే ఆ 5 కుందేళ్ళలో ఒక కుందేలు పెద్దగా *"అమ్మో....ఇంతపెద్ద కొండ ఎక్కగలమా ? మధ్యలోనే మనం చావటంకాయం అని అరిచింది"* అది విన్న కుందేళ్ళు కొంచం ఆగి *"ఇది నిజమే, ఎవరైనా గట్టిగా అరిస్తేనే మన గుండె ఆగిపోతుంది కదా; అలాంటిది ఏంత పెద్ద కొండ ఎక్కగలమా ? అని భయపడి సగం కుందేళ్ళు పోటికి రాకుండా ఆగిపోయాయి.*

👉 పోటి ప్రారంభం అయింది....
అన్ని కుందేళ్ళు వేగంగా పరుగులు తిస్తున్నాయి....
అంతలో ఆ 5 కుందేళ్ళలో ఒకటి *"ఇలా పరుగు తీస్తుంటే నాకు బాగా ఆయాసంగావుంది ఇంకా ముందుకి వెళ్తే చావటంకాయం అని అరిచింది....*
అప్పటికే ఆయాస పడుతున్న కొన్ని కుందేళ్ళు అది విని మరింతగా భయపడి అక్కడే ఆగిపోయాయి.

👉 *ఇలా ఈ 5 కుందేళ్ళు పోటి జరిగినంతసేపు మిగిలిన కుందేలళ్ళకి భయంపుట్టే, నిరాశ పుట్టించే మాటలు చెప్తూనే ఉన్నాయి ఆ మాటలువిన్న చాలా కుందేళ్ళు పోటి మధ్యలోనే ఆగిపోయాయి, కానీ ఒక్క చిన్న కుందేలు మాత్రం ఈ 5 కుందేళ్ళు ఎంతగా మానసికంగా భయపెట్టినా, నిరాశపరచినా అదేం పట్టనట్లు ఆ 5 కుందేళ్ళు కన్నా వేగంగా ముందుకు పరుగులు తీస్తూ వచ్చింది.*

👉 చివరికి ఆ చిన్న కుందేలు అందరికన్నా ముందుగా ఆ కొండ ఎక్కి గెలిచింది.
*ఈ 5 కుందేళ్ళకి ఏం అర్ధంకాలేదు, మనం ఎంతగా భయపెట్టినా ఈ చిన్న కుందేలు అసలు భయపడకుండా ఎలా వచ్చింది, అసలు ఈ చిన్న కుందేలుకి ఇంత ధైర్యం ఎక్కడిది అని ఆలోచించటం మొదలుపెట్టాయి.*

ఆ కుందేళ్ళు మాత్రమే కాదు అక్కడ వున్నా అన్ని కుందేళ్ళు అదే ఆలోచించటం మొదలుపెట్టాయి.

👉 నా ప్రియ స్నేహితులారా....
*ఎలా ఆ చిన్న కుందేలు ఆ భయపెట్టే మాటలను దాటుకుంటూ ముందుకు వచ్చింది...? ఈ ప్రశ్న నిన్నే అడిగితే ఏం సమాధానం చెప్తావు...?*

🔹 ఆ చిన్న కుందేలుకి దేర్యం ఎక్కువా.... అది బాగా మొండిది అనుకుంటా....
కొండలు ఎక్కటం దానికి అలవాటు అనుకుంటా.... దానికి ప్రాణభయం లేదనుకుంటా....
లేదా సింహాసనం కోసం ఏదైనా చేసే రకం అనుకుంటా....
ఇలా అనుకుంటాం కదా...?

అవును....
అక్కడ వున్న అన్ని కుందేళ్ళు కూడా ఇలాగే అనుకున్నాయి.
చివరికి అసలు విషయం తెలిసి బహుగా అశ్చర్యపోయాయి....
అది ఏమిటంటే....
🔺 *ఆ చిన్న కుందేలుకి చెవులు పనిచేయవు.*
అవును దానికి చెవుడు.... అందుకే భయపెట్టే ఏ మాట ఆ కుందేలుపై ప్రభావంచూపలేదు.
గెలవాలి అనే ఆశ మాత్రమే పనిచేసింది. భయపెట్టే ఏ మాట దానికి వినిపించలేదు, కనుక పనిచేయలేదు.

*మనం కూడా ఒక మంచి గురి కలిగి ముందుకి వెళ్తున్నపుడు అపవాధి భయపెట్టే మాటలు చెపుతాడు, భయపెడతాడు, బాధపెడతాడు,నిరాశపరుస్తాడు, గెలవలేవు అంటాడు, చేతలతో మాటలతో హింసిస్తాడు.అవి ఏవి మనపై ప్రభావంచూపకూడదు. . . .*

👉 అంటే మనం విననే వినకూడదు.
అపవాధి మాట్లడతాడు కాని మనం ఆ మాటలు విననే వినకూడదు; 
*అప్పుడే మనం గెలవగలము. మన గురి అయిన యేసుక్రీస్తుని చేరగలము.*

*". . . .దేవునికి లోబడియుండుడి, అపవాదిని (సాతాను) ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును."*
James(యాకోబు) 4:7 

1పేతురు 5:8  
*నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.*

 *క్రైస్తవ జీవితమనేది ఒక పోరాటమనే విషయం మనందరకు తెలుసు.* 
👉కనుక క్రైస్తవ జీవితం ఎప్పుడు సంతోషదాయకమనే భావన మనలో కలుగ కూడదు. 

👉సాతానుడు మన మీద ఎప్పుడు ఏవిధంగా దాడి చేస్తాడో మనకే తెలియదు. 
1పేతురు 5:8  
*నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.*

ఎఫేస్సి 6:13  
*అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.*

*ఆపద్దినం:* 
ఎఫేస్సి 6:13  
*అందుచేతను మీరు "ఆపద్దినమందు..."* 
ఈ వాక్యంలో పౌలు భక్తుడు చెప్పుచున్న *ఆపద్దినము* అనగా ఏమిటో ముందుగా మనం తెలుసుకోవాలి.

*ఆపద్దినం అనగా క్రీస్తులేని సమయం.*
🔹 క్రీస్తు లేని సమయమనగా నేమి? 
🔹అసలు క్రీస్తు లేని సమయం అనేది ఉంటుందా? 
*క్రీస్తులేని సమయం అనేది లేనేలేదు.*
👉 కాని *మనలో విశ్వాసం లోపించిన దినమే క్రీస్తులేని దినం అదే ఆపద్దినం.*
👉 ఏనాడైతే మనం విశ్వాసంలో బలహీన పడతామో ఆరోజు ఆపద్దినమే, *అనగా సాతాను మన మీద దాడి చేయు దినం.*
👉 కనుక క్రీస్తు ఎల్లపుడు మనతో ఉన్నాడనే విశ్వాసం మనం కల్గి ఉండాలి. 

👉సాతానుడు మనం విశ్వాసంలో బలహీనపడిన దినం గమనించి వాడి తంత్రములతో మనలను మోసం చేయుటకు ప్రయత్నించును. 

*సాతాను తంత్రం:*

*మనం కూడా ఒక మంచి గురి కలిగి ముందుకి వెళ్తున్నపుడు అపవాధి భయపెట్టే మాటలు చెపుతాడు, భయపెడతాడు, బాధపెడతాడు,నిరాశపరుస్తాడు, గెలవలేవు అంటాడు, చేతలతో మాటలతో హింసిస్తాడు.అవి ఏవి మనపై ప్రభావంచూపకూడదు. . . .*

 *క్రీస్తు అవసరం లేదని, మన స్వంత తెలివితేటలు చాలని, మనం మేధావులమని, ఇంత చిన్న చిన్న విషయాలకు దేవుని సహాయం ఎందుకని మనలో సాతానుడు ఆలోచనలు కలుగజేసి మన స్వశక్తితో మనం పోరాడునట్లు సాతానుడు ప్రేరేపించును.*
 
👉 *అదే సాతాను తంత్రం.*

👉 *అదే విశ్వాసం కొరవడిన దినమవుతుంది, అదే మనకు ఆపద్దినమవుతుంది.* 

*స్వశక్తి వద్దు:* తన స్వశక్తి మీద అధారపడ తలచి పేతురు ఒక చిన్న బాలిక ముందు ఓడిపోయాడు. 
లూకా 22:34  *ఆయన పేతురూ, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు, నేడు కోడికూయదని నీతో చెప్పుచున్నాననెను.*
 లూకా 22:58  *అందుకు పేతురు అమ్మాయీ, నేనతని నెరుగననెను.*

👉గనుక ఎట్టి పరిస్థితులలో మన స్వశక్తిమీద మనం ఆధారపడకూడదు. దేవుని మీద ఆధారపడి జీవించాలి.

 *అంతేకాకుండా ఏదైనా ఒక విషయంలో మనం విజయం సాధించినప్పుడు మనకు కలిగే గర్వాన్ని బట్టి కూడా మనం ప్రమాదంలో పడతామనే విషయాన్ని మనం గ్రహించాలి.* 

👉మనం విజయం తరువాత మరొక అపజయం మన కొరకు కాచుకొని యున్నదని మనం గ్రహించాలి. 

ఎరికోను జయించిన ఇశ్రాయేలీయులు *“హాయి”* దగ్గర అపజయం పాలైనారు.
 👉ఎందుకనగా వారు గర్వించి, ఇంత చిన్న విషయానికి దేవుని అడుగుట ఎందుకని వారు వేగులవారి మీద ఆధారపడి *“హాయి”* మీదకు వెళ్ళినారు. నిజానికి వారికి యెరికో మీద గొప్ప విజయాన్ని ఇచ్చిన దేవుని కాదని వారు తమ స్వంత తెలివితేటలు ఉపయోగించి వేగులవారిని పంపించి చేజేతులా ఓటమి పాలైనారు. 

యెహోషువా 7:3  హాయి పురమును వేగుచూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చిజనులందరిని వెళ్లనీయ కుము, రెండు మూడు వేలమంది వెళ్లి హాయిని పట్టుకొన వచ్చును, జనులందరు ప్రయాసపడి అక్కడికి వెళ్లనేల? హాయి వారు కొద్దిగానున్నారు గదా అనిరి.

*ఒక దినం 850 మంది సాతాను ప్రవక్తలమీద అద్భుతమైన విజయం సాధించిన ఏలియా తదుపరి దినానే, ఎజబెలుకు భయపడి చావగోరెను.* 

*కనుక ప్రియులారా!* 
*ఆపద్దినం అనగా జీవితంలో విజయం సాధించిన దినమున మన స్వశక్తిపై ఆధారపడునట్లు, సాతాను ప్రేరేపించును. కనుక ఎల్లపుడు ప్రభువుపై ఆధారపడవలెను.* 

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...