ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మొదటి కీర్తనా ధ్యానం*

✳ *మొదటి కీర్తనా ధ్యానం* ✳

 *దుష్టుల ఆలోచనచొప్పున నడువకపాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు*
      కీర్తనలు 1:1,2

👉 *"ధన్యుడు"*  అంటే ఆశీర్వదించబడిన వాడు.

*ఆ ధన్యత నీవు పొందాలంటే?*

1. మూడింటిని విడచిపెట్టాలి. 
2. రెండింటిని హత్తుకోవాలి. 

🔺 *విడచిపెట్ట వలసినవి*

1. దుష్టులతో నడవొద్దు 
2. పాపులమార్గాల్లో నిలవొద్దు
3. అపహాస్యకులతో కూర్చోవొద్దు

👉 *దుష్టులతో నడిస్తే ఏమవుతుంది?* 
దుష్ట సాంగత్యము నీ మంచి నడవడిని చెరిపేస్తుంది.

👉 *పాపుల మార్గాల్లో నిలిస్తే ఏమవుతుంది?*
ఆ పాపం నిన్ను కూడా బంధించేసి జీవితాంతం దానిలోనే నిలిపేస్తుంది.

👉 *అపహాసకులతో కూర్చుంటే ఏమవుతుంది?*
 
 *"నిన్ను కూడా అపహాస్యకునిగా మార్చేస్తుంది."*

నీవు ఎవ్వరినీ అపహాస్యం చెయ్యకపోవచ్చు. కాని వేరొకరు చేస్తుంటే నీవు పగలబడినవ్వి వారిని ప్రోత్సహించవచ్చు. అట్లా నీవునూ అపహాసకుడవే. 
ఈ మూడింటిని నీవు విడచిపెట్టాలి.

🔺 *హత్తుకోవలసినవి*

1. వాక్యమందు ఆనందించడం.
2. వాక్యాన్ని ధ్యానించడం 

👉 *వాక్యమందు ఆనందించడం అంటే?*

*"వాక్యమే దేవుడై ఉండెను"* అంటే దేవుని యందు ఆనందించాలి. 

👉 *అదెట్లా సాధ్యం?*

వాక్యాన్ని ద్యానించడం ద్వారా. 
(చదవడంద్వారా మాత్రం కాదు) 

👉 *దివారాత్రము ధ్యానించాలి అంటే?*
 
*నిద్రాహారాలు మాని రాత్రింబగళ్ళు వాక్యాన్ని ధ్యానించాలనా?*

క్రమం తప్పక ద్యానించాలని.
 *"ధ్యానం"* దేవునితో సాన్నిహిత్యాన్ని పెంపొందించి మనలను ఆయన సమరూపంలోనికి మార్చుతుంది. 

విడచి పెట్టాల్సినవి హత్తుకోకుండా,
హత్తుకోవలసినవి విడచిపెట్టకుండా,
ఆ ధన్యత లోనికి ప్రవేశించడానికి ప్రయాస పడదాం!

♻ *అతడు నీటికాలువల యోరను నాటబడినదైఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును  అతడు చేయునదంతయు సఫలమగును.*

కీర్తనలు 1:3

 *ఎవరయితే ధన్యత లోనికి ప్రవేశించారో,వారు ఎట్లా వుంటారు అంటే?* 

 1⃣ *నీటి యోరను నాటబడిన చెట్టు వలే ఉంటారు.*

▪అదెల్లప్పుడు పచ్చగా వుంటుంది. 
▪బలముగా వుంటుంది. 
▪తగిన కాలమందు మంచి ఫలాలనిస్తుంది. 
▪ఎక్కువ కాలం బ్రతుకుతుంది.

 నీవును ఓడబారని, ఫలవంతమైన,
జయకర జీవితాన్ని కొనసాగించాలంటే ఒక్కటే మార్గం. 
 *"జీవజల నీటిబుగ్గ"* అయిన *"యేసయ్య"* చెంత నాటబడాలి.

అట్లా యేసయ్య చెంత నాటబడితే, నీవు దీవెనలు ప్రవహించే నదీతీరాన్న ఉన్నట్లే. ఆ నదీ ప్రవాహం ఎప్పటికీ ఆగదు. ఇక నీ జీవితమంతా ఆశీర్వాదాలు పొంగిపొర్లుతాయి. 

 2⃣ *చేయునదంతా సఫలం*

👉 *ఏది చేసినా సఫలం అవుతుందా?*
అవుతుంది.

అట్లా అని జీవితాంతం ఏమి కష్టపడతాంలే అని బ్యాంక్ దోపిడీ చేద్దాం అంటే?
సఫలం అవుతుందా? 

దేవునియందు ఆనందించే వారికి, ఆయన వాక్యాన్ని ధ్యానించే వారికి కనీసం ఇట్లాంటి తలంపులు కూడా దరిచేరవు.

 *వారు ఏది చేసినా దేవుని చిత్తానుసారమే చేస్తారు. ఆయనపైనే ఆధారపడి చేస్తారు. సఫలీ కృతులవుతారు. సందేహం లేదు.* 

👉మన జీవితాల్లో అపజయాలే ఎందుకు వెంటాడుతున్నాయ్?

👉ఎందుకు సఫలం కాలేకపోతున్నాం?

 *ఆయన వాక్యాన్ని ధ్యానించి, ఆయనలో ఆనందించే అనుభవం లోనికి మనమింకా రాలేదేమో?*
 
ఇంకనూ జీవజల బుగ్గ 
(యేసయ్య) చెంత నాటబడలేదేమో? 

మనము జీవించిన జీవితాలకు గతించిన కాలమే చాలు. 

విడచి పెట్టాల్సినవి హత్తుకోకుండా,
హత్తుకోవలసినవి విడచిపెట్టకుండా,
ఆ ధన్యత లోనికి ప్రవేశించడానికి ప్రయాస పడదాం!
ఫలవంతమైన జీవితాన్ని జీవిద్దాం!

♻ *దుష్టులు ఆలాగున నుండకగాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు.*

కీర్తనలు 1:4

👉 దుష్టులు నీటి యోరను నాటబడిన చెట్టువలే ఫలవంతమైన  జీవితాన్ని జీవించేవారుగా ఉండరు.
 *"నాటబడిన చెట్టు"* స్థిరమైన, అచంచలమైన జీవితానికి సాదృశ్యం. 

👉 *కాని,దుష్టులు అట్లా వుండరట.* గాలికి ఎగిరిపోయే పొట్టువలే అస్థిరమైన,చంచలమైన జీవితాన్ని జీవించేవారుగా వుంటారు. 

నీ జీవితం పొట్టులా ఉంటే?
ఆ దినాన్న కాల్చివేయబడతావ్. 

ఏ దినాన్న? 
న్యాయాధిపతి అయిన దేవుడు నిను తీర్పుతీర్చే దినాన్న. 
ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.      మత్తయి 3:12 
ఆయన *"తీర్పు అనే చేటను"* మన మీద విసిరినప్పుడు ఫలవంతమైన గింజలవలే వుండి తట్టుకోగలిగి నిలబడగలిగితే ధన్యులమే. 

👉 *ఒకవేళ పొట్టులా ఎగిరిపోతే?* 
ఎగిరిపోయి నిత్యమూమండే అగ్నిగుండంలో పడతాము.

అది ఊహలకే భయంకరం. 
అగ్ని ఆరదు      
 పురుగు చావదు        
ఏడ్పు పండ్లుకొరికే స్థలమది.

దానిలో పడితే      
తప్పించే వారెవ్వరూలేరు. 
అది కొన్ని రోజులకు, 
కొన్ని సంవత్సరాలకు
మాత్రమే పరిమితం కాదు. 
దానికి అంతమంటూ లేదు.
నిత్యమూ అదే నీనివాస స్థలం.

👉 *దాని నుండి నీవు తప్పించబడాలి అంటే?* 
ఫలించాలి. 

👉 *ఫలించాలంటే?*
ధన్యత లోనికి ప్రవేశించాలి.

👉 *ధన్యత లోనికి ప్రవేశించాలంటే?* 
ఆయన యందు ఆనందించాలి. 

👉 *ఆయన యందు ఆనందించాలంటే?* 
▪వాక్యాన్ని ధ్యానించాలి,
▪అనుసరించాలి.

👉అప్పుడే ఆ నిత్య మరణంనుండి తప్పించబడతాము.

ఆ రీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!  

♻ *కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.*
          కీర్తనలు 1:5,6
 
లోకంలో పాపులు , నీతిమంతులు కలిసే వుంటారు. నీతిమంతుల సభలో పాపులు కూడా వుంటారు. 
న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పుతీర్చే ఆ దినాన్నమాత్రం  నీతిమంతుల సభలో పాపులు ఎంత మాత్రము నిలువలేరు. 

1).  *నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును*

👉ఇది ఇరుకైన మార్గం. 
ఎటు చూసినా....
ముండ్ల పొదలు-గచ్చ పొదలే. 
రాళ్ళు -రప్పలే,
ఇరుకులు - ఇబ్బందులే, 
శ్రమలు -శోధనలే,

👉కాని ఒక్క విషయం! 

🔹నీవెళ్ళే మార్గం ఆయనకు తెలుసు. 
🔹ఆ మార్గంలో ఆయనున్నాడు.
🔹ఆయన నీకోసం సిద్దంచేసిన అత్యంత సుందరమైన, శాశ్వతమైన పట్టణానికి నిన్నుతప్పక చేరుస్తాడు. 
సందేహం లేదు. 

👉 *ఆ పట్టణంలో దేవాలయము లేదు. కారణం?* 
దేవుడే అక్కడ వున్నాడు. 

👉 *సూర్యచంద్రులు లేరు. రాత్రి లేనే లేదు.* 
కారణం? 

👉 *దేవుని మహిమయే దానిలో ప్రకాశించు చున్నది.* 
▪అది మహిమోన్నతమైన పట్టణం.
▪అది నీతిమంతుల గమ్యస్థానం. 

2).  *దుష్టుల మార్గము నాశనమునకు నడుపును*

👉ఇది అత్యంత విశాలమైన మార్గం. 
▪ధనముంటుంది 
▪అల్పకాల సుఖభోగాలు 
▪అధికారం -హోదా 
▪లోకంలో లెక్కలేనన్ని 
రంగులు నిన్ను ఆకర్షిస్తాయ్!

👉కాని, 
*విశాలమైన మార్గంలో దూసుకుపోతున్న నీపయనం, వెళ్ళేకొలదీ ఇరుకైపోతుంది. అది ఎంతగా అంటే? ఆ సందులో నీవు ఇరుక్కుపోయేటంతగా!*

 ఇక విడిపించుకోలేవ్! 
తప్పించుకోలేవ్!
అపవాదికిని, వాని అనుచరులకును సిద్దపరచబడిన ఆ నిత్యనరకమే నీకు శరణ్యం! 

*తప్పించాబడాలి అంటే? ఒక్కటే మార్గం.* 
▪దివ్య గ్రంధాన్ని ధ్యానం చేయడం. 
▪జీవితాన్ని సరిచేసుకోవడం

ఆ రీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!  

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...