✳ *...ఎదురీదుట...* ✳
యువతీయువకులు అనేక రకాల ఒత్తిడులకు, ఆకర్షణలకు ఇదివరకెన్నడూ లేనంతగా గురియగుచున్నారు. *మంచి చెడులను విచక్షణా సహితంగా గుర్తించలేని పరిస్థితిలో అధిక సంఖ్యాకులు ఉన్నారు.*
👉 *దేవుని అల్ప సంఖ్యాకులతో చేరాలో, అపవాది యొక్క అధిక సంఖ్యాకులలోనికి దూకాలో తెలియక అయోమయంలో వున్న స్త్రీ పురుషుల కొరకు ఈ సందేశం వ్రాయబడినది.*
*నీవు యౌవనుడవుగా ఉన్నప్పుడు ఎక్కడ నిలుచుందువో అదియే నీవు పెద్దవాడవయ్యాక నీవు కూర్చునే స్థలాన్ని నిర్ణయిస్తుంది.*
🔹 *'శరీరాశయు'*
🔹 *'నేత్రాశయు,'*
🔹 *'జీవపుడంబము'*
*అను బలమైన కోటగోడ లోపల అపవాది యుగాల తరబడి ప్రజలను, విశేషముగా యౌవనులను బంధించి యుంచాడు*
(1 యోహాను 2:16). *అపవాదిని సిలువ మీద ఓడించిన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచువారు వెంటనే సంపూర్తిగా విడుదల చేయబడుదురు.*
👉అయితే అపవాది వారిని మరలా చేజిక్కించుకొనవలెనని వారి వెంటబడి తరుమును. వారు రాజీ పడునట్లు వాడు వారిని మభ్యపెట్టును.
👉వారు మరలా వానికి బానిసలగునట్లు వారిని
*వారి తలంపులలోను,మాటలలోను వారి క్రియలలోను* దారి మళ్ళించుటకు వాని చేతనైనదంతా చేయును.
*మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము*
(మత్తయి 6:13)
మత్తయి 6:13లో ఈ విధంగా ప్రార్థించమని ప్రభువైన యేసు నేర్పించారు. *''మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి (కీడునుండి) తప్పించుము''.*
👉 ప్రార్థనలో పోరాడుటద్వారానే దేవుని నిజమైన పరిశుద్ధతను పొందగలము.
సోమరులుగా ఉండే మరియు ఆత్మీయజీవితాన్ని చులకనగా తీసుకున్న క్రైస్తవులు ఈ పరిశుద్ధతను పొందుకొనలేరు.
*మన శరీరయిచ్ఛలను మరియు సాతానును పరిశుద్ధాత్మ శక్తితో పోరాడుటద్వారానే మనం పరిశుద్ధపరచబడగలం.* అప్పుడు మనం ఈలాగు ప్రశ్నించవచ్చు, *''మనం పరిశుద్ధత పొందుటకు సాతాను ఆటంకముగా ఉన్నట్లయితే, దేవుడు అతనిని ఎందుకు నాశనము చేయుటలేదు?''.*
👉 బంగారం అగ్నిలో పవిత్రపరచబడినట్లు, *మనంకూడా దేవుని పరిశుద్ధతలో అంతకంతకు పాలుపొంది ఆత్మీయముగా వృద్ధినిపొందునట్లు ఒకవిధంగా సాతాను అవసరం.*
👉 మన ఆత్మీయ నరములు ఈ విధంగా పోరాడుటవలన బలం పొందుతాము. లేనట్లయితే మనం క్రొవ్వుతో ఉండి, వదులు (బలహీనులము)గా ఉంటాము.
*కాబట్టి అతడు శోధనలోగుండా వెళ్లాలి. దురదృష్టవశాత్తు ఆదాము జీవవృక్షమైయున్న దేవునికి ''కాదు, వద్దు'' అని చెప్పి పాపి అయ్యాడు.*
*ప్రభువైనయేసు కూడా మనవలె అన్నివిషయములలో శోధించబడ్డాడు* (హెబ్రీ 4:15).
👉 కాని ఆదాముకు మరియు ప్రభువుకు ఉన్న తేడా ఏమిటంటే *ఆయన ఎల్లప్పుడు దేవునికి ''అవును, ఆమేన్'' అని చెప్పాడు. దేవుడు కోరినట్లుగా పరిపూర్ణుడగుటకు ప్రభువైన యేసు ఆయన పొందిన శ్రమలద్వారా విధేయత నేర్చుకున్నారు.ఆయన శోధించబడి మరియు జయించారు కనుక ''ఆయన సంపూర్ణసిద్ధి''ని పొందియున్నారు* (హెబ్రీ 5:8,9).
👉అందుకనే ప్రభువైన యేసు శిష్యులకొరకీలాగు ప్రార్థించారు, *''నీవు లోకములోనుండి వారిని తీసుకొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదుగాని దుష్టునినుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను''* (యోహాను 17:15).
👉 ఈ లోకంలో తన శిష్యులు ఎదుర్కొనవలసిన ఒత్తిడిలు, పరీక్షలు మరియు శోధనలు వారు ఎదుర్కొనకుండా తీసుకొనిపోబడితే వారు దేవుని పరిశుద్ధతలో పాలుపొందుట కష్టమని ప్రభువుకు తెలియును.
*శోధనకు మరియు పాపానికి ఉన్న తేడాను మనం వివేచించాలి.*
👉 *మనం అకస్మాత్తుగా దేనినైనా చూచి శోధించబడినట్లయితే, అది పాపముకాదు*
*శోధించబడుటను తప్పించుకొనలేము. కాని మనలను శోధించేదానినుండి మన కళ్లను మరియు మన మనస్సును త్రిప్పివేసుకోవాలి.*
👉 కాని మనం ఎల్లప్పుడు మనలను శోధించేదానినే కావాలని చూస్తూ లేక దానిగురించే ఎల్లప్పుడు ఆలోచిస్తూ ఉన్నట్లయితే మనం పాపం చేస్తాము.
ఒకరు చెప్పినట్లుగా, *''నా తలమీదుగా పక్షులు ఎగురకుండా నేను ఆపలేను, కాని అవి నా తలమీద గూడు కట్టుకొనకుండా ఆపగలను''.*
👉 శోధన రాకుండా మనం ఆపలేము (చేయలేము) కాని అది మనస్సులో గూడు కట్టుకొనకుండా చేయగలం.
*తనను శోధించే విషయాలనుండి పారిపొమ్మని పౌలు తిమోతికి చెప్పుచున్నాడు* (2తిమోతి 2:22).
👉 దేవునినుండి దూరముగా తీసుకెళ్ళే ధనాపేక్షనుండి, కులుకులాడే స్త్రీలనుండి మొదలగు వాటినుండి దూరముగా పారిపోవాలి.
*క్రైస్తవజీవితము అనగా సాతానుతో పోరాడుట.*
*సాతానును జయించుటకు మనలో గొప్ప ఆసక్తి, కోరిక ఉండాలి.*
*ప్రవాహమునకు వ్యతిరేకముగా ఎదురీదుటకు మీరు సాహిసించాల్సింది ఇక్కడే.*
👉 ప్రవాహమునకు వ్యతిరేకముగా ఎదురీదుటకు జంకువారు అపవాది వలలో చిక్కుకొనుట నిశ్చయము. *కెరటాలకు వ్యతిరేకముగా ఎదురీదుట వాస్తవముగా కష్టమే కాని శక్తికి వ్యతిరేకముగా శక్తిని ఉపయోగించినప్పుడు చేకూరు సత్తువ ఎక్కువవుతుంది.*
♻ *కెరటాలకు వ్యతిరేకముగా ఎదురీదిన వారి కథలు బైబిలులో కోకొల్లలుగా ఉన్నాయి*
1⃣ దేవుని హెచ్చరికను పరిహసించినవారికి వ్యతిరేకముగా *నోవహు ఎదురీదాడు.*
2⃣ రహస్యముగా పాపము చేయుటయే తెలివిగలతనము అను ధోరణికి వ్యతిరేకముగా *యోసేపు ఎదురీదాడు.*
3⃣ దేవుని నడిపింపు కంటె సమృద్ధియైన సంపద మరియు పలుకుబడి ప్రాముఖ్యమైనవను ఆలోచనకు వ్యతిరేకముగా *మోషే ఎదురీదాడు.*
4⃣ విశ్వాసము కాదు గాని ఇంద్రియ గ్రాహ్యముతో కూడిన తెలివే విజయము అను భావమునకు వ్యతిరేకముగా *కాలేబు ఎదురీదాడు.*
5⃣ పాపిష్టియైన సుఖానుభూతులకు వ్యతిరేకముగా
*రూతు ఎదురీదినది.*
6⃣ లంచగొండితనము మరియు అవినీతికి వ్యతిరేకముగా
*నెహెమ్యా ఎదురీదాడు.*
7⃣ దావీదు పగతీర్చుకొను మనస్సుకు వ్యతిరేకముగా *దావీదుఎదురీదాడు.*
8⃣ యౌవనులైన - హనన్యా, అజర్యా మరియు మిషాయేలు- విగ్రహమును ఆరాధించు మనస్తత్వమునకు వ్యతిరేకముగా ఎదురీదారు.
👉 నీవు కూడా భిన్నముగా ఉండుటకు భయపడకు.
👉 పాపిష్టిదైన ఈ లోకంలో
🔹 *పరిశుద్ధముగా జీవించండి.*
🔹 *చక్కగా చదువుకొనండి.*
🔹 *కష్టపడి పని చేయండి.*
🔹 *పాఠ్యపుస్తక తెలివితో పాటు మంచి మర్యాదలు కూడా నేర్చుకొనండి.*
*దేవునితో మాట్లాడండి. ఆయన చెప్పేది వినండి. మంచి నాయకులను మాదిరిగా చేసుకోండి.*
*క్రైస్తవ జీవితమంటే, ఆరంభము నుండి అంతము వరకు కూడ ప్రవాహమునకు వ్యతిరేకముగా ఎదురీదుటయే.*
👉 ఆవలి గట్టుచేరు వరకు వెళ్లుట అంత సులభం కాదు, అది అసాధ్యమూ కాదు.
( I యోహాను 2:16-17 )
*" లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. "*
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి