✳ *ఒకే మాట, రెండు తలంపులు. . . .*
*"దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము."* ( II తిమోతికి 2:15 )
* ( 2 రాజులు గ్రంథము 5 : 1-27 )
*సిరియారాజుకి పరాక్రమశాలియైన సైన్యాధిపతి ఉన్నాడు అతని పేరు 'నయమాను', ఇతడు కుష్ఠరోగి.*
గమనించండి. . . .నయమాను ఆ దేశంలో ఘనుడు అయినా *అతనికి అనందం లేదు,* నయమాను తన రాజు దృష్టికి దయపొందినవాడు అయినా *అతనికి శాంతి లేదు.* నయమాను మహా పరాక్రమశాలి అయినా *అతనికి నెమ్మది లేదు.*
ఈ లోక సంబందంగా ఏవరు ఏంత వారేనా సరే *"ఎవర్ని ఆశ్రయించలో తెలిసుకోలేని వారికీ; తనని ఎవరు గెలిపిస్తున్నారో తెలిసుకోలేని వారికి - జీవితంలో అనందంవుండదు, శాంతివుండదు, నెమ్మదివుండదు. ఈ నయమానుకి కూడా అలానే జరిగింది.*
నాయమానుకి ఒక భార్య వుంది, ఇశ్రాయేలుదేశము నుండి ఒక చిన్నదాన్ని చెరపట్టి తెచ్చి నయమాను భార్యకు పరిచారము చేయుటకు అక్కడ ఉంచారు.
ఒక్కసారి *నయమాను భార్య* గురించి ఆలోచించినప్పుడు చాలా వింతగా అనిపించింది.
👉 *నయమాను కుష్ఠరోగి; అయినా అతని భార్య అతనిని విడిచిపోలేదు. ఏంత చక్కనిది; చక్కనిది అంటే అందంలో కాదు గుణంలో.* మనిషి అందముగా గుణం గందరగోళంగా ఉంటే ప్రయోజనం ఏమిటంటా.
గమనించండి...
*భర్తకి వ్యాధి ఉన్నసరే భర్తని ప్రేమించి తనతోనే ఉంది.* లేమిలోను, కలిమిలోను, దుఖమందు, సంతోషమందు, బాధయందు, వ్యాధియందు నిన్ను విడువను అని దేవుని ఎదుట ప్రమాణం చేసిన 3 నెలలకే విడిపోతున్న నేటితరం భార్యాభర్తలకి నయమాను భార్య ఇక్కడ ఒక మంచి పాఠం నేర్పుతుంది.
ఇంక *ఆ ఇంటిలోని చిన్నది;* పేరుకి చిన్నది అని అనేశం కానీ ఎంత పెద్దపని చేసింది; ఒక సువార్తికురాలు పని చేసింది. తన యజమానికి విడుదల కావలి ఎవరి దగ్గరకి వెళ్ళితే తన యజమనుడికి విడుదల కలుగుతుందో తెలిసిన ఆ చిన్నది తనని చెరపట్టి, పనులు చేయించుకుంటున్నా... ఆ కోపం ఏమి చూపించక *తన యజమాని కుటుంబానికి మంచి వార్త చెప్పిది;* సువార్త చెప్పింది.... మనం కూడా లోకంలో పట్టబడిన వారికీ యేసు దగ్గర విడుదల ఉంది అనే శుభవార్త చెప్పాలి, అన్యులకి సువార్త చెప్పాలి.
ఆ చిన్నదాని మాటలు విని నయమాను షోమ్రోనుకి వెళ్ళాడు.. ఎలీషా యింటి ద్వారము ముందరనిలుచున్నాడు,
అప్పుడు ఎలీషా ఒక దూతను పంపి *"నీవు యొర్దాను నదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని"* అతనితో చెప్పెను, దానికి నయమాను ముందు కోపపడిన నెమ్మదిగా యొర్దాను నదికి పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దానునదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహములాగా అయ్యి అతడు శుద్ధుడాయెను. నిజంగా, నమ్మకంగా, శ్రద్ధగా మరియు క్రమముకలిగి దేవునికోసం పనిచేసే దైవజనుని మాట మనకి ఆశీర్వాదం.
నయమానుకి ఎంతో అనందం కలిగింది, ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చి తాను పొందిన మేలుకొద్ది బహుమానము తీసికొమని ఎలీషాను ఎంతో బతిమాలాడు. దానికి ప్రవక్త అయిన ఎలీషా " ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ "యెహోవా జీవముతోడు" నేనేమియు తీసికొనను అని చెప్పెను."
అప్పుడు నయమాను తన ఇంటికి బయలుదేరాడు అంతలో. . . .దైవజనుడైన ఎలీషాకు *సేవకుడగు గేహజీ* బహుమానం అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని, "యెహోవా జీవముతోడు" నేను పరుగెత్తికొని పోయి అతని కలిసికొని అతనియొద్ద ఏదైనను తీసికొందుననుకొన్నాడు. పరుగులుతీస్తూ వెళ్ళాడు.
గమనించండి స్నేహితులారా....
👉 ఇద్దరు దేవుని సేవకులే ఒకరు *"ఎలీషా"* మరొకరు *"గేహజీ"* వారు ఇద్దరు అంటున్న మాటా ఒక్కటే *"యెహోవా జీవముతోడు"* కానీ వారి తలంపులు వేరు,
👉 *ఒకరు దేవుని మహిమపరచాలని కోరుకుంటే*
👉 *మరొకరు ధనాన్ని కోరుకున్నారు...*
*కానీ ఒకే మాట "యెహోవా జీవముతోడు". ఒకే మాట, రెండు తలంపులు.*
నేటి కాలంలో కూడా ఇలాంటి సేవకులే మనమధ్య ఉన్నరు;
🔹 దేవుని నామాన్ని మహిమపరిచే సేవకులు కొందరేతే,
🔹 సొంత ప్రయోజనాలకి దేవుని పేరు వాడుకునేవారు కొందరు.
🔸పరలోక రాజ్య విస్థరణకు సువార్త చెప్పే సేవకులు కొందరైతే,
🔸 సిరుల కోసం సువార్త చెప్పేవారు కొందరు.
క్షమించండి, నేను ఎవర్ని విమర్శించటంలేదు; నిజం మాట్లాడాలి అనుకుంటున్నాను అంతే.
లేరు అంటారా . . . ?
👉 *సేవకులలో దొంగలు లేరా ?*
👉 *అబద్దప్రవక్తలు లేరా ? డబ్బు కోసం సేవ చేసేవారు లేరా ?*
*" ప్రభువా....ప్రభువా.... అను ప్రతివాడు పరలోకరాజ్జం చేరడు" అను మాట ఇలాంటి వారికోసం చెప్పబడలేదా.*
👉 *నేటి కాలంలో కానుకలకోసం ఆశించకుండా సేవ చేయగల పౌలుగారి వంటి సేవకులు ఎంతమంది ఉన్నరు.*
🔻 *ధనం కోసం పరుగులుతిసిన గేహజీ తన ఇంటికే శాపాన్ని తీసుకుని వెళ్ళాడు. . . .*
🔺 *దేవునిని మహిమపరుస్తూ సేవచేసిన ఎలీషాగారు అద్భుతాలు చేస్తూ ముందుకెళ్ళాడు. . . .*
*హల్లెలూయ. . . .*
మన రక్షకుడైన యేసుక్రీస్తును గూర్చిన ఈ ప్రకటన ప్రకారముగాను మిమ్మును వాక్యంలో స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తు ద్వారా, నిరంతరము మహిమకలుగునుగాక.
ఆమేన్. ఆమేన్. ఆమేన్.
Written_By:- *Bhagath .N. Marshal....*
*_The_Gate_Of_Heaven.* ( Christian Literature) Ministries.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి