ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సామెతలు

❇️—— *సామెతలు* ——❇️
   క్లుప్త ధ్యానములు ( Part-8)

నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీమీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను. భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు  సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగు నప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను  అపహాస్యము చేసెదను. అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడ కుందును. సామెతలు 1 :23-28

♻️  *జ్ఞానాన్ని వెదకి పట్టుకోవడం కష్టమైన పనేమీకాదు. *

🔹జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది 
🔹సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది. 
🔹గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయు చున్నది 
🔹పురద్వారములలోను 
🔹పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. సామెతలు 1:20

♻️ *జ్ఞానం చేసే పనులు:*

🔹జ్ఞానము పిలుస్తుంది (23వ)
🔹చేతులు చాపుతుంది (24వ)
🔹ఉపదేశిస్తుంది (23వ)
🔹బోధిస్తుంది (25)
🔹గద్దిస్తుంది (23)
🔹ఆత్మను క్రుమ్మరిస్తుంది (23వ)

♻️  *జ్ఞానుల ప్రతిస్పందన:*

🔹జ్ఞానము పిలిచినప్పుడు ఆలకిస్తారు 
🔹చేతులు చాచినప్పుడు దగ్గరకు వెళ్తారు 
🔹ఉపదేశించినప్పుడు, లోబడతారు. 
🔹గద్దించినప్పుడు సరిచేసుకుంటారు 
🔹ఆత్మానుసారం జీవిస్తారు 

♻️ *అజ్ఞానుల ప్రతిస్పందన*

🔹పిలిచినప్పుడు వినరు (24వ )
🔹చెయ్యిచాపగా లక్ష్య పెట్టరు (24)
🔹ఉపదేశమును త్రోసివేస్తారు(25)
🔹గద్దించినప్పుడు లోబడరు (25)
🔹బోధకు చెవి యొగ్గురు (25వ)

♻️ *అజ్ఞానులపట్ల జ్ఞానమైయున్న దేవుని ప్రతిస్పందన:*

🔹వారికి అపాయము కలిగినప్పుడు ఆయన నవ్వుతారు. 
🔹భయము, కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు ఆయన అపహాస్యం చేస్తారు.
🔹ప్రార్ధించినప్పటికీ ప్రత్యుత్తరమియ్యరు 
🔹ఆయనను శ్రద్ధగా వెదికినాగాని, ఆయన కనబడరు. సామెతలు 1:26-28

అవును! 
🔹ఓడ తలుపులు మూసివేయబడిన తర్వాత, ఎంత రోధించినా ఏమి ఫలితము? 
🔹పెండ్లికుమారుడు తలుపుమూసేసిన తర్వాత ఆ కన్యకలు ఎంత దుఃఖించినా ఏమి ప్రయోజనము? 

మన కష్ట దినమున 
🔹ఆయనే నవ్వాల్సి వస్తే, 
🔹అపహాస్యం చెయ్యాల్సి వస్తే, 
🔹మన ప్రార్థనకు ప్రతిఫలమియ్యక, 
🔹మనకు కనబడని పరిస్థితి ఎదురైతే? 
అది ఊహలకు సహితం భయంకరం! 

🔹జ్ఞానము పిలిచినప్పుడు ఆలకిద్దాం! 
🔹చేతులు చాచినప్పుడు దగ్గరకు వెళదాం! 
🔹ఉపదేశించినప్పుడు, లోబడదాం!. 
🔹గద్దించినప్పుడు సరిచేసుకుందాం!  
🔹ఆత్మానుసారం జీవిద్దాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!  ఆమెన్!  ఆమెన్!

కామెంట్‌లు