ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

భయపడవద్దు; నీ దేవుడైన యెహోవా నీకుతోడైయుండును..

✳ *భయపడవద్దు; నీ దేవుడైన యెహోవా నీకుతోడైయుండును....✍*

*" నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుఱ్ఱములను రథములను మీకంటె విస్తారమైన జనమును చూచునప్పుడు వారికి భయపడవద్దు; ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును."*
 ద్వితీయోపదేశకాండము 20:1 

👉ఇశ్రాయేలియుల 430 సం!!రాల ఇగుప్తు బానిస బ్రతుకు ముగిసింది.
👉 సర్వశక్తీగల దేవుడు వారిని చూచారు, మోషే నాయకత్వంలో 10 అద్భుతాలతో ఫరో తలను వంచి సుమారు 6 లక్షల కాల్బలము, 20 లక్షల పైగా జనాభాని విమోచించారు. కనానుకి నడిపించటం ప్రారంభించారు. . . .
👉ఇగుప్తు నుండి కనానుకి సులువుగా నడచి వెళ్ళితే సుమారుగా 40 దినాల ప్రయాణం
 *కానీ ఈ ఇశ్రాయేలియులు ఆ 40 దినాల ప్రయాణాన్ని 40 సం!!రాల ప్రయాణంగా మార్చుకున్నారు....*
👉 కారణం. . . . ?
🔹వారి అవిధేయత, 
🔹వారి బుద్ధిహీనత
🔹వారి లోబడనితనం,
🔹వారి తిరుగుబాటుతనం
🔹వారు సనుగుళ్ళు, 
🔹వారి గోనుగుళ్ళు
🔹వారు విడచి వచ్చిన ఇగుప్తు వైపు చూడటం. . . .
🔹వారి ముందుండి నడిపిస్తున్న ఆ దేవుడి వేపు చూడకపోవటం. . . .
అంతే కాదు 
🔹వారి మధ్య వున్న విగ్రహారాధన, 
🔹వ్యభిచారం.
*ఇలా పనికిరాని ఎన్నో కారణాల వల్ల 40 రోజుల ప్రయాణం 40 సం!!రాలుగా మారిపోయింది.*

👉విరే.... ఇశ్రాయేలీయులు....
 *ఎవరీ ఇశ్రాయేలీయులు...?*

👉దేవుని సొంత జనాంగము;
 👉దేవుడు ప్రత్యేకపరచుకున్న జనంగము.
👉దేవుడు అబ్రహాము, ఇస్సాకు,యాకోబులకు చేసిన వాగ్ధనమునకు సమవారసులు;
👉రాజుల, అధికారుల అహమును, అధికారాన్ని కొట్టివేసి ఐగుప్తులో నుండి బయటకు నడిపించిన జనాంగము;
👉ఐగుప్తులో దేవుడు 10 అధ్బుతాలు చేసింది వీరికోసమే,
👉ఎర్రసముద్రాన్ని రెండుగా చేసింది వీరికోసమే,
👉దేవతల ఆహారం అయిన మన్నాను కురిపించింది వీరికోసమే,
👉బండనుండి నీటిని ప్రవహింపచేసింది వీరికోసమే,
👉దేవుడే పగటివేళ మేఘస్తంభములోను, రాత్రివేళ అగ్నిస్తంభములోను వారికి ముందుగా నడచుచు, తోడుగావుండి నడిపించిన జనాంగము విరే. . . .

*ఈ ఇశ్రాయేలీయులు దేవుడిని ఎంతగా శోధించిన ఈ 40సం!!రాలు దేవుడు వారితోనే ఉండి వారిని నడిపించాడు.*

👉వారు ఈ 40సం!!రాల ప్రయాణంలో ఎన్నో ప్రాంతాలు దాటవలసి వచ్చింది, 
👉వారికీ దారి ఇవ్వని వారితో యుద్ధం చేయవలసి వచ్చింది అప్పుడు శత్రువుల బలమును చూసి, గుర్రాలను చూసి, రధములను చూసి ఇశ్రాయేలీయులు ఎంతగానో భయపడ్డారు. . . .
*ఆ సమయంలో కూడా దేవుడు తన సేవకుల ద్వారా ఆ ప్రజలతో మాట్లాడారు, దైర్యపరచారు.*
 ద్వితీయో 20:1-4 
( ద్వితీయో 20:1 )

👉 *భయం....భయం....* నేడుకుడా ఈ ప్రపంచాన్ని ఏలుతుంది ఈ భయం....

👉 ప్రతివారికి భయం.... ప్రతిదీ భయం....
🔹ఆర్ధికాన్ని గుర్చిన భయం....
 🔹ఆరోగ్యాన్ని గుర్చిన భయం....
🔹మనిషిని చూస్తే భయం....
 🔹వాతావరణాన్ని చూస్తే భయం....
🔹పనిచేసే స్థలములో భయం.... 
🔹యజమానిని చూస్తే భయం....
🔹కాపరిని చూస్తే విశ్వాసికి భయం.... 
🔹విశ్వాసిని చూస్తే కాపరికి భయం....
 🔸కుటుంభములో భయం....
 🔸ప్రభుత్వలో భయం....
 🔸ఉద్యోగంలో భయం.... 
🔸వ్యవసాయంలో భయం....
🔸వయస్సు వచ్చిన పిల్లల గూర్చిన భయం....
🔸వృధాప్యంలో వున్న మన పెద్దవారి గూర్చిన భయం....

*ఎక్కడ చూసినా ఎటు చుసిన "భయం...." అనే శబ్దాన్ని వింటున్నాము.*

*ఎక్కడి నుండి వచ్చింది ఈ భయం.... ?*

👉హవ్వ, ఆదాము దేవుని ఆజ్ఞను మీరారు, అవిధేయులయ్యారు.
ఆ చల్లపూట దేవుని స్వరాన్ని విన్నారు కానీ దేవుని ఎదుటకు రాకుండా దాగునరు. . . .
అన్ని తెలిసే దేవుడు అడిగాడు
*" ఆదామా.... ఎక్కడున్నావు ?"*

*అప్పుడు ఆదాము అంటున్నాడు " నీ స్వరం వినినప్పుడు.... భయపడి దాగుకొంటిని" అని*

👉 *"భయం"* ప్రారంభమయిన క్షణం ఇదే. . . . ( అది 3:9,10 )
ఆనాడు మన పితరుల
 
ఆదాము, హవ్వ ద్వారా *"పాపము"* మాత్రమే కాదు ఈ *"భయం"* కూడా లోకంలోకి వచ్చింది.

*నా ప్రియ సహోదరి, సహోదరుడా నువ్వు ఎందుకు భయపడుతున్నావు ?*

🔹నీకు తోడుగా డబ్బు లేదనా ? 
🔹నీకు తోడుగా బలగం లేదనా ? 
🔹నీకు తోడుగా వేక్తులు లేరనా ?
🔹ఎవరు నాకు ఈ జీవితంలో అండగా వుంటారు అని భయపడుతున్నావా ?

👉ఈ రోజు నా యేసయ్య ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. . . .

*ఆనాడు తన ప్రజ అయిన ఇశ్రాయేలీయులను ఆదరించి, దైర్యపరచి వారి ద్వారా అనేక యుద్దాలు చేయించి వారిని వాగ్ధాన భూమిలోకి చేర్చారు నా దేవుడు.*

👉డబ్బు నీతో ఉన్న లేకున్న జనం నీతో వున్నా లేకున్న నిన్ను విడువను, నిన్ను ఎదబయను అని వాగ్ధానము చేసిన 
*నా దేవుడైన యేసయ్య ఎల్లప్పుడు నీతోనే ఉంటారు,సదాకాలము నీతోనే ఉంటారు.వాగ్ధానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక భయపడనవసరమైలేదు.*

*విస్తార బలమైన, జనమైన, ధనమైన, గుర్రలైన, రధములైన నా రక్షకుడైన యేసుక్రీస్తు ముందు శూన్యంమే.*

*దేవుని మాట వినని వారికీ కలిగేదే ఈ భయం....*

*దేవుని అజ్ఞాని మీరిన వారికీ కలిగేదే ఈ భయం....*

*ఆ యేసు మాటలు విని అయన ఆజ్ఞలు అనుసరిస్తే మనదగ్గరికి రానే రాదుగా.*

*అవును.... నా యేసు ఎదుట ఏదియు నిలువలేదు.*

👉మరి యేసు నీతో ఉంటే ?

 *నీకు వ్యేతిరేకమైన ఆయుధం ఏదియు నిలువదు.*

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...