ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జూదం పాపమా? జూదమును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?.

✳ *జూదం పాపమా? జూదమును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?...✍* 

*“ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి”*
 అని 1 తిమోతి 6:10 మనకు చెబుతుంది. 

 బైబిల్ విశేషంగా *జూదం, పందాలు, లేక లాటరీలను* గురించి బైబిల్ లో  ప్రస్తావించనప్పటికీ అది పాపం వైపు మనిషిని నడిపిస్తోంది.

 *ధనాశ నుండి దూరంగా ఉండమని బైబిల్ మనలను హెచ్చరిస్తుంది*
 (1 తిమోతి 6:10; హెబ్రీ 13:5). 

*“త్వరగా ధనవంతులవ్వాలనే”* ప్రయత్నాల నుండి మనం దూరంగా ఉండాలని లేఖనం మనలను ప్రోత్సహిస్తుంది (సామెతలు 13:11; 23:5; ప్రసంగి 5:10). 

👉వాక్యం చెబుతుంది.... 
*ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని....*( 1 తిమోతి 6:10 ) దానిని ఆశించే అనేకులు తమనుతాము పోడుచుకున్నారు;
*ఇస్కరియోతు యూదా కూడా ఈ ధనాపేక్ష వల్లే నశించాడు.*

*ధన మీదే తమ దృష్టి ఉంచిన వారు పరలోకంలో ప్రవేశించటం అసంభవం....* ( మత్తయి 19:23).

👉అంతేనా....
*ఈ ధన వ్యమొహం మనిషిలో వాక్యం ఫలించకుండా చేస్తుంది....* ( మత్తయి 13:22) వీరినే వాక్యం *“ముళ్ళ పొదలలో విత్తబడిన వారు”* అంటుంది. ధన వ్యమొహం వీరిని అణచివేస్తుంది, వీరు ఫలించలేరు. వీరి వల్ల ఎవ్వరి ఆకలి తీరదు.

👉విస్తారగా ధనం కూర్చుకుని ఆ ధనంలో ఆనందించాలి అనుకునే వాళ్ళని వాక్యం *“ఓ.. వెఱ్రివాడా”* అని పిలుస్తుంది (లూకా 12:20,21).

👉మొదటి తిమోతి 6:9 లో అయితే దొడ్డి దారిలో సంపాదించాలి అనుకునే వారు *“శోధనలోను, ఊరిలోను, అవివేక క్రియలలోను, హానికర క్రియలలోను, అనేక దురాశలలోను పడిపోయి.... చివరికి; నష్టంలోను, నాశనంలోను మునిగిపోవుదురు అని వ్రాసియుంది.*

👉 *జూదం నిశ్చయంగా ధనాశ మీద దృష్టి కలిగియుంది మరియు నిశ్చయంగా త్వరగా ధనమును సంపాదించాలనే వాగ్దానముతో ప్రజలను శోధిస్తుంది.* 

🔺 *జూదంలోని సమస్య ఏమిటి?*

👉 జూదం అనేది ఒక కష్టమైన సమస్య ఎందుకంటే అది కొన్ని సార్లు జాగ్రత్తగా చేసినయెడల, అది ధనమును వ్యర్థము చేయుట. 

*ప్రజలు వారి డబ్బును అనేక విధాలుగా దురుపయోగం చేస్తారు.* 

▪ఒక మూవీ చూడడం
▪అనవసరమైన విలువైన భోజనం చేయుట, లేక
▪ అవసరం లేని వస్తువులను కొనుటలో ప్రజలు డబ్బును దురుపయోగం చేయుట జూదం కంటె తక్కువేమీ కాదు.

👉 అదే సమయంలో, ఇతర విషయాలలో డబ్బును వ్యర్థం చేయకూడదు.
*డబ్బును వృద్ధా చెయ్యకూడదు.*
👉 అధిక సొమ్ము భవిష్యత్తులో అవసరతల కొరకు దాచిపెట్టాలి లేక దేవుని పని కొరకు ఇవ్వాలి, జూదంలో వృద్ధా చేయకూడదు. 

బైబిల్ స్పష్టంగా జూదమును గూర్చి ప్రస్తావించనప్పటికీ, అది  *“అవకాశము”* ను గూర్చి ప్రస్తావిస్తుంది.

👉 ఉదాహరణకు, బలియార్పణ మేక మరియు పరిహారార్థ మేక మధ్య ఎన్నిక చేయుటకు లేవీయకాండములో *చీట్లు వేయుట* ఉపయోగించేవారు. వివిధ గోత్రముల వారికి భూమిని కేటాయించుటకు *యెహోషువ చీట్లు* వేశాడు. యెరూషలేము ప్రాకారముల లోపల ఎవరు జీవిస్తారో నిర్థారించుటకు *నెహెమ్యా చీట్లు* వేశాడు. యూదా స్థానంలో శిష్యుని ఎన్నుకొనుటకు *అపొస్తలులు చీట్లు వేశారు.*

 *“చీట్లు ఒడిలో వేయబడును వాటివలని తీర్పు యెహోవా వశము”* అని సామెతలు 16:33 చెబుతుంది. 

కెసినో మరియు లాటరీలను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది? కెసినోలు జూదగాళ్ళు తమ యొద్ద ఉన్న డబ్బు అంతా ఖర్చుపెట్టునట్లు అన్ని విధముల మార్కెట్ స్కీంలను ఉపయోగిస్తాయి. అవి చాలా సార్లు చవకైన లేక ఉచ్చిత మద్యమును ఇస్తాయి, తద్వారా వారు అధికముగా త్రాగి కొన్ని వివేకమైన నిర్ణయాలు తీసుకోకుండా ప్రజలను మందబుద్ధులను చేస్తుంది. గొప్ప మొత్తంలో డబ్బు వెచ్చించి ఖాళీ ఆహ్లాదం తప్ప ఏమి తిరిగి ఇవ్వకుండా ఉండునట్లు ప్రతి కెసినో రూపుదిద్దబడినది. విద్య మరియు/లేక సామజిక కార్యక్రమాలకు ఉపయోగపడునట్లు లాటరీలు తమను తాము చూపించుకొంటాయి. 

👉 అయితే, లాటరీలో పాలుపంచుకొనువారు, చాలా వరకు దానికి అవసరమైన డబ్బును వెచ్చించు స్తోమత లేనివారని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అవసరతలో ఉన్నవారికి  *“త్వరగా ధనవంతులు కావాలనే”* శోధన ఎదురించదగినది కానిదిగా ఉంది. *గెలిచే అవకాశములు కోటిలో ఒక శాతం కాబట్టి, చాలా మంది జీవితాలు నాశనమైపోయాయి.* 

🔺 *లాటరీలు దేవుని ప్రసన్నపరుస్తాయా?*

👉 సంఘమునకు లేక ఇతర ఉత్తమ పనులకు డబ్బు ఇవ్వడానికి లాటరీ ఆడుతున్నామని చాలా మంది ప్రజలు చెబుతారు. 
*చాలా తక్కువ మంది జూదంలో గెలచిన సొమ్మును మంచి ఉద్దేశాల కొరకు ఉపయోగిస్తారు. లాటరీలో గెలచిన అనేకులు గెలచిన కొన్ని సంవత్సరాలకు వారి జీవితాలలో మునుపటి కంటే మరింత దిగజారినవారిగా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి.*
👉 చాలా తక్కువ మంది మంచి ఉద్దేశముల కొరకు డబ్బును ఇస్తారు. 
*ఈ లోకములో తన పరిచర్య కొరకు దేవునికి ఇలాంటి ధనము యొక్క అవసరత లేదు.* 

👉 *అన్యాయంగా సంపాదించిన ధనం కానుకల పెట్టిలోనికి రాకూడదు....*

*“తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానముగలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు”* అని సామెతలు 13:11 చెబుతుంది. 

👉 *దేవుడు సర్వశక్తిమంతుడు గనుక సంఘము యొక్క అవసరతలను నిజాయితీగల మార్గములలో అందిస్తాడు.*

🔺 *మత్తు పదార్థముల నుండి లేక దొంగిలించిన సొమ్మును ఆయనకు అర్పించుట ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా?*

👉 ఖచ్చితంగా కలుగదు.

🔹 *ధనాశతో బీదల నుండి “దొంగిలిన” సొమ్ము దేవునికి అవసరం లేదు.* 

*“ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి”*
 అని 1 తిమోతి 6:10 మనకు చెబుతుంది. 

*“ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా”*
 అని హెబ్రీ. 13:5 ఘోషిస్తుంది.

 *“ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు”* అని మత్తయి 6:24 ప్రకటిస్తుంది.

నీ కోసమే దేవుడు ఈ రోజు చెప్తున్నాడు, మునుపటి ప్రవర్తన వదులుకొని, నూతన పరచబడినవార్తె, నవీనస్వభావము ధరించుకో (ఎఫెసి 4:22) యౌవనము బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనియ్యకుము. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా నువ్వు ఉండాలి (1తిమోతి 4:12) అని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడై యున్న ప్రకారము మనము కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా (పేతురు1:16) ఉండాలి. అట్టి ధన్యత దేవుడు నీకు అనుగ్రహించును గాక!

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...