ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దేవుని ఏర్పాటు

✳ *దేవుని సేవ-పరిచర్య* ✳
     
(మొదటి భాగము)

1⃣ *దేవుని ఏర్పాటు..✍*

    Revelation(ప్రకటన గ్రంథము) 17:14

*వీరు(10మంది రాజులు)  గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును*

👉  దేవుని ప్రణాళిక అమోఘమైనది, ఆయన పిలుపు, 
ఏర్పాటు అత్యుత్తమమైనవి. ఉత్కృష్టమైనవి. 

*ఆయన ఎవరిని ఏర్పరచుకొంటారో, ఎవరిని పిలుచుకొంటారో మన ఊహలకు అందదు.*

👉 *అయితే పిలువబడినవారు, ఏర్పరచబడిన వారు నమ్మకముగా ఉంటున్నారా? లేదా*? *అన్నదే నేటి సమస్య!!!*
        
ఆదినుండి మనం చరిత్ర చూసుకొంటే ఆదాముగారికి దేవుడు అనేకమంది కుమారులు/కుమార్తెలు ఉన్నా(ఆది 5:4) 
👉 *దేవుడు షేతును మాత్రం ఏర్పరచుకొన్నారు.*
 
👉యెరెదుకి ఎంతోమంది సంతానమున్నా కేవలం *హనోకు గారిని ఏర్పరచుకొన్నారు.*

👉 లెమెకు కన్నవారిలో *నోవాహుగారిని ఎన్నుకొన్నారు.*
 నోవహుగారి కాలానికి లోకం చెడిపోయింది. కామవికార చేష్టలతో పాడైపోయింది. 

👉అందుకే దేవుడైన యెహోవా ఈతరం వారిలో నీవే నాయెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని(ఆది 7:1) అన్నారు. 
ఇక నోవహుగారి కుమారులలో *షేతుని ఏర్పాటుచేసుకొన్నారు.*
 
👉 తనతండ్రి భయంకరమైన విగ్రహారాదికుడైనా సరే అబ్రహాముగారిని ఎన్నుకొన్నారు. 
*అబ్రహాము గారి కుమారులలో ఇస్సాకుని,*

 *ఇస్సాకుగారి సంతానంలో యాకోబుని ఎన్నుకొన్నారు.*
 
*నేను యాకోబును ప్రేమించితిని, యాశావుని ద్వేశించితిని అని అన్నారు దేవుడు*
 (రోమా 9:13). 

👉దేవుడు మనుష్యుల అంతరంగాలు లక్ష్యపెట్టే దేవుడు. 
*కాబట్టి దేవుడు ఎవరిని ఏర్పరచుకొంటారో, ఎవరిని ఎన్నుకొంటారో, ఎవరిని పిలచుకొంటారో  మనకు తెలియదు.* 

🔹 యాశావు, యాకోబు ఇస్సాకుగారి సంతానమే కదా! మరి యాకోబుని ప్రేమించి,యాశావుని ద్వేషించడం ఎందుకు? అది దేవుని ఇష్టం! అయన ఎవరిని కరుణిస్తారో, వాళ్ళని కరుణించును, ఎవరిని ద్వేశించాలో వారిని ద్వేషిస్తారు. నన్నెందుకు ఇలా చేసావు అని అడగటానికి మనకు అధికారం లేదు. అందరి హృదయాలు దేవునికి తెలుసును. రోమా 9:9--32.

 👉ఈ భూమిపై ఎన్నోరకాలైన జనాంగాలున్నా 
*దేవుడు ఇశ్రాయేలీయులను కోరుకొన్నారు!*

 *ఇశ్రాయేలీయులలో 12గోత్రాలున్నా లేవీ  గోత్రాన్నితన సేవకై ఎన్నుకొన్నారు.*

 *లేవీ గోత్రంలో ఎంతోమంది ఉన్నా యాజకసేవ కోసం ఆహారోనును ఎన్నుకొన్నారు.*

     మాగ్రామ జనాభా సుమారు 22,700మంది, వీరిలో దేవునిని ఎరిగి భాప్తిస్మము తీసుకొన్నవారు 500 మంది. (రహష్య క్రైస్తవులు 1000 మంది). 22000 మందిలో పిలువబడినవారు 500మంది మాత్రమె. వీరిలో నమ్మకమైనవారు  100మంది ఉంటారేమో!!! ఈ 100మందిలో ఎత్తబడేవారు ఎంతమందో దేవునికె తెలుసు. 

ప్రియ విశ్వాసి! మీకుటుంభం మొత్తానికి, గ్రామం మొత్తానికి నిన్ను ఏర్పరచుకొన్నారు. మరి నీవు నమ్మకంగా ఉంటున్నావా? కొంచెం శోధన భాదలు కలిగితే సోలిపోయి దేవునిని వదిలేస్తున్నావా? 

♻️ *మోషేగారికి ఏకైక శిష్యుడు యెహోషువా!*
🔹 నమ్మకముగా పనిచేసి కనాను దేశాన్ని జయించగలిగారు. 
🔹మోషే కేవలం ఇద్దరు రాజులను మాత్రమె జయించగా, 
🔹యెహోషువా గారు 31మంది రాజులను జయించగలిగారు. 
*చివరకు మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, మీరు ఎవరిని సేవించినా సరే, నేనును నా ఇంటివారును యెహోవాను సేవిస్తాము అని ధైర్యముగా పలికి, కడవరకు నమ్మకముగా ఉన్నారు!* యెహోషు 24:15

♻️ *ఎలీయాగారి ఏకైక శిష్యుడు ఎలీషా,*
👉 ఏలీయా గారి దగ్గర నమ్మకముగా పరిచర్య చేసి ఏలీయా గారు పొందుకొన్న ఆత్మలో రెండింతలు పొందుకోగలిగారు.

  ఎలీశాగారి శిష్యుడు *గేహాజి! ఇహలోకాన్ని, వెండి బంగారాలు ఆశించి, తనకు, తన కుటుంబానికి  శాశ్వతంగా కుష్టువ్యాది సంపాదించుకొన్నాడు!* 

👉 మరి నీ పరిస్థితి ఏమిటి?
👉  నీవు నమ్మకముగా ఉంటున్నావా? 
👉 దేవుని సేన పిలువబడినవారు, ఏర్పరచబడినవారు మరియు నమ్మకమైనవారు అని సెలవిస్తుంది గ్రంధము! 
👉మరి ఆ లిస్టులో నీవున్నావా? 
👉విడువబడే వారిలో ఉన్నావా? 
*ఇప్పుడే నిన్ను నీవు సరిచూసుకో! సరిచేసుకో!*

ఆరీతిగా మన జీవితాలను 
సిద్ద పరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత 
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...