✳ *మహిమ గల పరిచర్య* ✳
*“.... అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును”*
( 2 కోరింధి 3:6 )
👉పౌలుగారు తన సొంత సంఘమైన కోరింధి సంఘానికి రెండవ పత్రిక వ్రాస్తూ.... అపోస్తలుల ద్వారా జరుగుతున్న పరిచర్య విశిష్టతను వివరించే క్రమంలో అక్షర సంబంధమైన పరిచర్య గురించి ఆత్మ సంబంధమైన పరిచర్య గురించి రెండవ కోరింధి పత్రిక 3వ అధ్యాయంలో వివరించారు.
👉మరింత సులువుగా అర్ధం అవ్వటానికి.... ఇది గమనించండి.
*అక్షర సంబంధమైన పరిచర్య అంటే అది రాతి మీద చెక్కబడింది, సిరాతో వ్రాయబడింది అంటే ధర్మశాస్త్రం.... అక్షర రూపకమైన నియమములు.*
*ఆత్మ సంబంధమైన పరిచర్య అంటే అది ఆత్మ ద్వారా హృదయములపై చెక్కబడింది అంటే ఆత్మ సంబంధమైన నూతన నిబంధన.... ఆత్మ సంబంధమైన నియమములు.*
నా ప్రియ స్నేహితులారా....
🔹నేడు చాలామంది బైబిల్ ని కూడా అక్షర సంబంధంగానే చదువుతుంటారు.
🔹అక్షర సంబంధంగానే ధ్యానిస్తుంటారు.
🔹అక్షర సంబంధంగానే బోధిస్తుంటారు.
*ఇది మరణకరమైనది.*
👉ఒక వ్యక్తి తన స్నేహితులకి ఒక ప్రశ్న వేశాడు....
*జలప్రళయం సమయంలో నోవహు చాలారోజులు ఓడలోనే ఉన్నాడు కదా... అప్పుడు తినటానికి తనతో ఏం తీసుకేళ్ళారు....? అని*
ఈ ప్రశ్న విన్న వారికందరికీ ఏమీ అర్ధంకాలేదు.... ఏవ్వరికి జవాబు దొరకలేదు.... అప్పుడు ఆ వ్యక్తి “ ఐతే మీకు వాక్యం చదవటం రావటంలేదు....ఎందుకంటే, జవాబు బైబిల్ లోనే ఉంది; జలప్రళయం సమయంలో నోవహు చాలారోజులు ఓడలోనే ఉన్నాడు కదా అప్పుడు తినటానికి తనతో *“అట్లు”* చేసుకుని తీసుకెళ్ళాడు కావాలంటే ‘అదికాండము 6:7’ లో చూడండి అక్కడ *‘నోవహు అట్లు చేసెను ‘* అని ఉంటుంది” అని అన్నడు.
ఈ వ్యక్తి మాటలు విన్న వాళ్ళకి నవ్వాలో.... ఏడవాలో.... తెలియలేదు.
👉 ఈ ఉపమానంలోని వ్యక్తిలానే *కొందరు బైబిల్ ను ఎక్కల పుస్తకం చదివినట్లు చదువుతారు, బట్టీ పడతారు,భావం గురించి పట్టించుకోకుండా అక్షరం అక్షరం లెక్కపెట్టి మైండ్ లోకి ఎక్కించుకుంటారు.*
👉వీళ్ళు చాలా ప్రమాదకరమైన బైబిల్ పండితులు.
👉 *లాజిక్కులతో వాక్యం చదవటం, ఫార్ములాలతో మేసేజీలు తయారు చేసుకోవటం పూర్తిగా అక్షర సంబంధమైన పరిచర్య అది మరణకరమైనది కనుక మనిషిని ఆత్మీయంగా చంపుతుంది.*
👉 అందుకే....
*వాక్యం ఆత్మనుసారంగా చదవాలి. . . .*
*వాక్యం ఆత్మనుసారంగా నేర్చుకోవాలి. . . .*
*వాక్యం ఆత్మనుసారంగా ధ్యానించాలి. . . .*
*వాక్యం ఆత్మనుసారంగా బోధించాలి. . . .*
👉 *అప్పుడు మాత్రమే వాక్యం మనిషి హృదయంలోనికి వెళ్ళి పనిచేస్తుంది,*
🔺 *వ్యభిచారించ వద్దు* అని మాత్రమై అక్షరం సంబంధమైన బోధ చెబుతుంది.
👉 కానీ *ఆత్మ సంబందమైన బోధ*
🔺 *వ్యభిచారించ వద్దు అన్న మాట మీరు విన్నారుకదా; కానీ మొహపుచూపే వ్యభిచారంతో సమానం అని చెబుతుంది. ఇది యేసయ్య చేసిన ఆత్మ సంబందమైన బోధ.*
👉 నూతన నిబంధన సంబంధమైన బోధ.
*జీవింపజేయు బోధ.*
*పాపాన్ని వేళ్ళతో సహ పేగలించివేసే బోధ.*
ఈ ఆత్మ సంబంధమైన బోధ మాత్రమే మనిషిని జీవింపచేస్తుంది, మనిషిని ఉజ్జీవింపచేస్తుంది.
దైవిక నియమాలు రాతిమీద వ్రాయబడినప్పుడు మోషే చేసిన పరిచర్యే అంత మహిమగలది అయితే
*ఆ దైవికనియమాలను మనిషి హృదయాలపై వ్రాసే మా పరిచర్య మరీ ఎక్కువ మహిమకరమైనది కదా....* అని అంటారు పౌలుగారు.
అవును....
ధర్మశాస్త్రం మనిషికి మేలుచెయ్యక పోగా మనిషిపై తీరని భారాన్ని మోపింది. అది మేలేనదే కానీ మనిషికి మరణకరంగా మారింది.
*దేవుని నియమాలను సూటిగా మనిషి హృదయాలలో వ్రాసే ఆత్మ సంబంధమైన ఈ పరిచర్య నిజంగానే వాడబారని మహిమ గల పరిచర్య.* ( 2 కోరింధి 3:9 ).
*హల్లెలూయ. . . .*
మన రక్షకుడైన యేసుక్రీస్తును గూర్చిన ఈ ప్రకటన ప్రకారముగాను మిమ్మును వాక్యంలో స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తు ద్వారా, నిరంతరము మహిమకలుగునుగాక.
ఆమేన్. ఆమేన్. ఆమేన్.
Written_By:- *Bhagath .N. Marshal....*
*_The_Gate_Of_Heaven.* ( Christian Literature) Ministries.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి