ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మోరీయా పర్వతం చరిత్ర

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚


♻️ *మోరీయా పర్వతం* 💠
      

🔺   *మోరీయా చరిత్ర :*

✴ *క్రీ. శ. 68 లో మత్తయి 14:1-4 వరకు చెప్పినట్లు రోమా చక్రవర్తి టైటస్ రాయి నిలిచి యుండకుండా నాశనం చేయించాడు.*

✴ *600 సంవత్సరమున రాళ్ళను అంటి యున్న బంగారం కోసం ఆ రాళ్ళను ప్రజలు ఎత్తుకుపోయారు.*


✴ *632లో మహమ్మద్ చనిపోయారు.  637 లో అయన అనుచరులు దీనిని జయించారు.*

✴ *637 -687 వరకు ఇక్కడే ప్రార్ధనలు జరిపారు.*

✴ *687 లో అబ్దుల్ మాలిక్ Doom of the Rock అనే పేరుతో మందిరం కట్టాడు.*

✴ *ప్రస్తుతం పాలస్తీనా వారి ఆధీనంలో ఉంది.*

✴ *ఇప్పుడు ఈ Doom of the Rock తొలగించి యూదులు మందిరం కట్టాలి. అది చేస్తే 3 ప్రపంచ యుద్ధమే.*

✴  *ఇశ్రాయేలీయులు ఆరు నురైన కడతారు.*
(Source : Wikipedia)


💠 *ఇప్పుడు మన ధ్యానాంశములోకి వెళదాం...*⤵️


👉    "అప్పుడాయన - నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతనిని అర్పించుమని చెప్పెను". (ఆది 22:2)
 
👉      "యోబుసియుడయిన ఒర్నాను కళ్ళమందు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చెనని దావీదు తెలుసుకొని అచ్చటనే బలి అర్పించెను". (1దిన 21:28)
 
👉       "తరువాత సొలోమోను ఎరుషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనపుడు మోరీయా పర్వతమందు దావీదు సిద్ధరిచిన స్థలమున యోబుసియుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించెను". (2దిన 3:1)

*మోరీయా అంటే:*

✴ దేవుని ఆరాధించు స్థలము
✴ హెచ్చింపబడుట
✴ మరల దేవుడు ఇచ్చే స్థలము

👉 *అబ్రహాము తన కుమారుని ద్వార పరీక్షింపబడిన స్థలము "మోరీయా".*
*అబ్రహాము జీవితములో మూడు పరీక్షలు:-*

        👉 *మొదటి పరీక్షా:* అబ్రహాము వయస్సు 75సంవత్సరాలు. ఆ వయస్సులో తన సొంత ఊరిని, బంధువులను వదిలివేయమన్నాడు. ప్రియులారా... ఒక ఊరిలో 75 సంవత్సరాలు ఉండి అకస్మాత్తుగా వదిలేయాలి అంటే అంత తేలిక కాదు. "నీవు లేచి నీ దేశము నుండియు, నీ బంధువుల నుండియు, నీ తండ్రి ఇంట నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెల్లుము. నిన్ను  గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చెసేదను" (అది 12:1-2). అంతే అబ్రహాము అందరిని ఆ ముసలి వయస్సులో విడిచి ప్రభువుని వెంబడించాడు. మనం అయితే ఎందుకులే దేవా. ఈ వయస్సులో నా సొంత ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను. ఈ వయస్సులో నాకు ఇంకేమి ఆశీర్వాదాలు వద్దు అంటాము. ప్రియులారా.. ప్రభువును వెంబడించడం అనేది ఒక త్యాగం. "ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలిని, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు" (లూకా 14:26).

        👉 *రెండవ పరీక్ష:* ఆదికాండము 13, 14 అధ్యాయములలో  ఆస్తికి సంబంధించిన పరీక్షా పెట్టాడు దేవుడు.  "వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేను. ఎందుకనగా వారి ఆస్థి వారు కలిసి నివసించలేనంత విస్తారమై యుండెను" (ఆది13:6). ఆస్థి వల్ల ఇక్కడ గొడవలు రావాలి అదే ఈ పరీక్ష. చాల సార్లు TV, Paper లలో ఆస్థి కోసం గొడవలు, చంపుకోవడాలు చూస్తున్నాము. కానీ ఇక్కడ అబ్రహాము, లోతు విడిపోయే విధానం నాకు చాల ఆశ్చర్యం అనిపించింది. అబ్రహాము పెద్దవాడు కాబట్టి తనే కోరుకోవాలి, కాని అబ్రహాము లోతుతో "నీవు ఎడమతట్టుకు వెళ్తే నేను కుడితట్టుకు వెళ్తా. నీవు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తా" (ఆది13:9). అని లోతునే కోరుకోమన్నాడు. అపుడు లోతు పచ్చగా ఉన్న సోదోమా గొమొఱ్ఱా ను కోరుకున్నాడు. ఆశకి
 మితం లేదు అంటారు కాని అది అబ్రహాము విషయములో కాదు. మరల సొదొమ రాజు ఈ ధనమంత తీసుకోమంటే నేనే అబ్రహంముని ధనవంతునిగా చేశాను అంతవేమో అందుకే ఈ నీ ధనం నాకు వద్దు అంటాడు. దేవుడు పెట్టిన ఈ రెండవ పరీక్షా కూడా నెగ్గాడు. అందుకే 4000 సంవత్సరాల తర్వాత కూడా తన మాట నెరవేరుస్తూ తన జనాంగం అయిన యుదులను అబ్రహాము నివసించిన స్థలంలోనే జీవింపచేస్తున్నాడు.

           👉 *మూడవ పరీక్ష:* ఇది పరీక్ష లన్నింటిలో గొప్ప పరీక్ష. దేవుడు అబ్రహముని పిలిచిన 50 సంవత్సరాల తరువాత పరీక్షించాడు. అప్పుడు అబ్రహాము వయస్సు 125 సంవత్సరాలు. "అబ్రహమును పరిశోధించెను. ఎట్లనగా ఆయన - అబ్రహమా, అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడాయన - నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అర్పించమనెను." (ఆది22 :1-2). ఆ పర్వతమే మోరీయా పర్వతము. ప్రియులారా లేక లేక కలిగిన ఒక్కగానొక్క కుమారుని 125 సంవత్సరాల తండ్రి ఎలా బలి ఇస్తాడు?? చాల దారుణం కదా! కాని అబ్రహాము ఈ పరీక్షలో Pass అయ్యాడు. 

👉           అబ్రహాము ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న ఇస్సాకుని బలి ఇవ్వమన్నడు, అబ్రహాము ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. నా ప్రియ సహోదారుడా! / సహోదరి! నీ హృదయములో దేవునికన్నా ఎక్కువ విలువైన ధనాశ, లోకాశ, పాపం, అసూయ... ఇలా ఉన్నాయా? ఈ రోజే మోరీయా పర్వతం మీద బలి ఇచ్చేయ్. అది ఏదైనా సరే బలి ఇచ్చేయ్. 

👉         వాళ్ళకి ఆస్థి, అంతస్థు, ఉద్యోగం, అందం అన్ని ఇచ్చావు, మరి నాకు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రార్ధనలో దేవుని నిలధిస్తున్నవా? అయితే దేవుడు పెట్టె పరీక్ష Fail అయ్యవేమో ఒకసారి Revaluation చేయించుకో స్నేహితుడా... దావీదు అయితే తన మూడు పరీక్షలు పాస్ అయ్యాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆశీర్వదించబడ్డాడు. పరీక్ష అనగానే పరిపోకుండా నిలబడు. దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. 

👉 దావీదు తన పాపము ద్వార శ్రమ పడిన స్థలం ఈ మోరీయా పర్వతం. (2 సమూ 24:25)

👉 సొలోమోను తన బలుల ద్వారా దేవాలయము కట్టిన స్థలం ఈ మోరీయా పర్వతం. (2దిన 3:1-2)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...