ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిల్ తెలుగులోనికి తర్జుమా ఏవరు,ఎప్పుడు,ఎలా.......❓

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు📚*



♻️ *బైబిల్ తెలుగులోనికి తర్జుమా ఏవరు,ఎప్పుడు,ఎలా.......❓* 



👉 _భాషరాని వారు ఎంతో కృషి చేశారు... తెలుగు భాష రాని వ్యక్తులు మన దేశానికి వచ్చి ఇక్కడ నేర్చుకొని బైబిల్‌ అనువాదానికి ఎంతో కృషి చేశారు._

💠 *తెలుగులో తొలి బైబిల్ ప్రచురించి  రెండు వందల ఏళ్ళు పూర్తయింది.*

💠 _అవును 1818లో బైబిల్ కొత్త నిబంధన తెలుగు అనువాదం రెండు భాగాలుగా ప్రచురితమయింది._

👉 *17 - 18 శతాబ్దాల్లో క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో క్రియాశీలంగా ఉన్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా బ్రిటిష్ పాలన ప్రత్యక్షంగా ఉన్న ప్రాంతాల్లో వారి కార్యక్రమాలు చురుకుగా సాగాయి.*

👉 _అందులో భాగంగా భారతీయ భాషల్లో బైబిల్ అనువాదాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సీరాంపూర్‌లో ఈ అనువాదాలు జరిగాయి._

👉  *ఒక డానిష్ లూథరన్ మిషనరీకి చెందిన బెంజిమన్ షుల్జ్ అనే వ్యక్తి మొదటిసారి 18వ శతాబ్దపు తొలినాళ్లలో బైబిల్ తెలుగులోకి అనువాదం చేశారు.*

👉 _ఆ చేతిరాత ప్రతులను ప్రచురించడం కోసం అప్పట్లో జర్మనీ పంపారు. కానీ ఏ కారణం చేతనో అవి ముద్రణ కాలేదు._
 _ఆయన రాసిన చేతిరాత ప్రతులు కూడా దొరకలేదు.ఇది జరిగిన చాన్నాళ్ల తరువాత రెండు వేర్వేరు సంస్థలు,వేర్వేరు ప్రాంతాల్లో బైబిల్ తెలుగు అనువాదం ప్రారంభించాయి._

👉 *విలియం కేరీ ఆధ్వర్యంలో బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ సంస్థ ప్రస్తుత పశ్చిమ బెంగాల్లోని సీరాంపుర్ దగ్గర బైబిల్ అనువాద ప్రక్రియ ప్రారంభించింది.* 

👉  _తొలి తెలుగు బైబిల్‌ను 1818లో ముద్రించారు↵అదే సమయంలో లండన్ మిషనరీ సొసైటీ సంస్థ నుంచి అగస్టస్ దె గ్రాంజెస్. జార్జ్ క్రాన్ అనే వ్యక్తులు ఆనందరాయర్ అనే స్థానికుడి సహకారంతో విశాఖపట్నంలో ఈ అనువాద ప్రక్రియ ప్రారంభించారు._

👉 *కానీ విశాఖలో ఈ అనువాదం ప్రారంభించిన అగస్టస్ 1809లో, జార్జి 1810లో చనిపోయారు. దీంతో ఆ అనువాద ప్రక్రియను జాన్ గార్డన్, ఎడ్వర్డ్ ప్రిచెట్‌లు కొనసాగించారు.*

👉 _వారు మరణించడానికి ముందే మాథ్యూ (Mathew - ముత్తయి), మార్క్ (Mark - మార్కు), ల్యూక్ (Luke - లూకా) అధ్యాయాలను పూర్తి చేశారు లేదా చేయించారు._

👉 *ఈ మూడు అధ్యాయాలు 1812లో విలియం కేరీ ఆధ్వర్యంలోని మిషనరీ ప్రెస్‌లో ముద్రించారు.*
*బైబిల్‌కి సంబంధించిన ఒక భాగం తెలుగులో ముద్రించడం ఇదే మొదలు.*

👉 _నిజానికి అదే సమయంలో సీరాంపూర్‌లో విలియం కేరీ ఆధ్వర్యంలో మరో అనువాదం కొనసాగుతున్నప్పటికీ, తాము చేస్తున్న అనువాదం కంటే విశాఖ నుంచి వచ్చిన అనువాదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముద్రించారు కేరీ._
_అదే సందర్భంలో బైబిల్‌ను అన్ని భాషల వారికీ తక్కువ ధరకు చేరవేయాలనే ఉద్దేశంతో ‘‘బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ’’ అనే సంస్థ 1804లో లండన్‌లో ఏర్పడింది. బైబిల్ అనువాదాలు, పంపిణీ చేసే ఇతర సొసైటీలకు ఈ సంస్థ ఆర్థిక సహకారం అందించింది._

👉 *ఈ బ్రిటిష్ సంస్థకు అనుబంధంగా భారత్ లో 1811లో కలకత్తా ఆగ్జిలరీ బైబిల్ సొసైటీ ఏర్పడింది.*
*మొట్టముదట ముద్రించిన బైబిల్.. గుటెన్‌బర్గ్.. బిబిలికల్ హీబ్రూ భాషలో దీనిని ముద్రించారు↵మరోవైపు సీరాంపూర్ లోనూ, విశాఖపట్నంలోనూ బైబిల్ తెలుగు అనువాదాలు కొనసాగుతూ వచ్చాయి. రెండు అనువాదాలూ 1818 నాటికి పూర్తయ్యాయి.*

👉 _ముందుగా సీరాంపూర్‌లో సిద్ధమయిన అనువాదం ముద్రణకు వెళ్లింది._
_అదే సమయంలో విశాఖలో జరిగిన అనువాదం కలకత్తా ఆగ్జిలరీ సొసైటీ ఆమోదం కోసం పంపారు._  _ఆ ప్రతిని పరిశీలించడం కోసం మద్రాస్‌లో ఉండే థాంప్సన్‌కి పంపించింది కలకత్తా సొసైటీ._
_అప్పటికే మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు పండితుడిగా పేరు గాంచి క్యాంప్ బెల్, ఫోర్ట్ సెయింట్ జార్జ్ కాలేజీలో పనిచేసే మరో స్థానిక తెలుగు పండితుడు ఈ ప్రతిని పరిశీలించారు._ _వారిద్దరూ కలిసి ఈ అనువాదమే బాగుందని తీర్మానించారు._

👉 *‘‘సరళంగా, సులువుగా అర్థమయ్యేలా, సమగ్రంగా ఉందనీ, ప్రజలకు సరిపోతుందనీ, సాధారణ ఉపయోగానికి పనికొస్తుందని’’ వారు తెలిపారు. ఈ వ్యాఖ్యలు చూసిన కలకత్తా ఆగ్జిలరీ సొసైటీ, విశాఖలో తయారయిన ఈ ప్రతినే ముద్రించాలని తీర్మానించింది.*
*దీంతో ఈ ప్రతిని ఎడ్వర్డ్ ప్రిచెట్ ఆధ్వర్యంలో మద్రాసులో ముద్రించారు. అప్పటికే సీరాంపూర్ లో అనువాదమయిన ప్రతిని కూడా ముద్రించినా, విశాఖలో తయారయిన ప్రతినే తెలుగులో ప్రామాణింకంగా తీసుకుని, దాన్నే సరఫరా చేశారు. ఆ తరువాత ముద్రితమైన బైబిల్ అనువాదాలు కూడా దీని ఆధారంగానే వచ్చాయి.*

👉 _బైబిల్‌ని తెలుగులో అనువదించే ఘనత దక్కించుకున్న లండన్ మిషనరీ సొసైటీ.. మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఉత్తర సర్కారులో (ప్రస్తుత కోస్తాంధ్రలోని ఉత్తర భాగాలు - విజయవాడ నుంచి పైన) ప్రారంభమైన తొలి ప్రొటెస్టెంట్ మిషనరీ._

👉 *1805లో వారు విశాఖ కేంద్రంగా కార్యక్రమాలు ప్రారంభించారు. ఆ తరువాత విశాఖలో వచ్చిన మిషనరీలు కూడా తెలుగు అనువాదాలు కొనసాగించాయి.*

👉 _అనంతరం బైబిల్ అనువాదాలను రివిజన్ చేసే కార్యక్రమం జరిగింది. మద్రాస్ ఆగ్జిలరీ బైబిల్ సొసైటీ ఒక బైబిల్ రివిజన్ కమిటీ వేసింది._ _అప్పుడు బైబిల్ తెలుగును రివిజన్ చేసిన వారిలో జాన్ హే, రెవరెండ్ పులిపాక జగన్నాథంల పేర్లు ప్రముఖంగా వినిపించాయి._

👉 *1818లో కేవలం బైబిల్ కొత్త నిబంధన మాత్రమే అనువాదం అయింది↵అప్పటికి పాత నిబంధన అనువాదం ప్రారంభం కాలేదు.అప్పట్లో కొత్త నిబంధనను కూడా రెండు సంపుటాలుగా ముద్రించారు* _బైబిల్ అనువాదానికి సంబంధించిన ఈ సమాచారం అంతా మిషనరీల రికార్డుల్లో నమోదయ్యాయి↵తొలి ప్రతి 2వ వాల్యూమ్ ప్రస్తుతం బెంగళూరులోని యునైటెడ్ థియోలాజికల్ కాలేజీలో ఉంది↵తొలి ప్రతి మరికొన్ని కాపీలు బెంగళూరులోని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి._ *తొలి ప్రతి మొదటి వాల్యూమ్ మాత్రం లండన్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో ఉంది↵తొలి ప్రతి 2వ వాల్యూమ్ కాపీ 2005లో విశాఖలో లండన్ మిషనరీస్ సంస్థ ద్విశతాబ్ది (200) వార్షికోత్సవం సందర్భంగా తెప్పించారు↵అప్పటి బిషప్ ఆదేశాల మేరకు దాన్ని బెంగళూరు పంపించారు* _కొత్త నిబంధన అనువాదానికి దాదాపు పదేళ్లు పట్టింది↵బైబిల్ పాత నిబంధన హిబ్రూ భాషలో, కొత్త నిబంధన గ్రీకు భాషలో రాసి ఉంది↵కొత్త నిబంధనను గ్రీకు నుంచి లాటిన్ భాషకు అనువదించిన సెప్టెంబరు 30వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అనువాదాల దినోత్సవంగా నిర్వహిస్తోంది._

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...