😍 *బైబిల్ లో అద్భుతం*😍
🐷 *పంది* అనే మాట బైబిల్ లో *14* సార్లు వ్రాయబడింది
లేవీయకాండము 11:7: *పంది* విడిగానుండు రెండు డెక్కలు గలదిగాని అది నెమరువేయదు గనుక అది మీకు అపవిత్రము.
లేవీయకాండము 11:29: నేలమీద ప్రాకు జీవరాసులలో మీకు అపవిత్ర మైనవి ఏవేవనగా, చిన్నముంగిస, చిన్న *పంది* కొక్కు, ప్రతి విధమైన బల్లి,
ద్వితియోపదేశకాండము 14:8: మరియు *పంది* రెండు డెక్కలు గలదైనను నెమరువేయదు గనుక అది మీకు హేయము, వాటి మాంసము తినకూడదు, వాటి కళేబరములను ముట్ట కూడదు.
1సమూయేలు 6:4: ఫలిష్తీయులుమనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణమేదని వారినడుగగా వారుమీ అందరిమీదను మీ సర్దారులందరి మీదను ఉన్నతెగులు ఒక్కటే గనుక, ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున అయిదు బంగారపు గడ్డల రూపములను, అయిదు బంగారపు *పంది* కొక్కులను చెల్లింపవలెను.
1సమూయేలు 6:5: కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడుచేయు *పంది* కొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింప వలెను. అప్పుడు మీ మీదను మీ దేవతలమీదను మీ భూమిమీదను భారముగా నున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు.
1సమూయేలు 6:11: యెహోవా మందసమును బంగారు గడ్డలును *పంది* కొక్కు రూపములును గల ఆ చిన్న పెట్టెను బండిమీద ఎత్తగా
1సమూయేలు 6:18: ప్రాకారముగల పట్టణములవారేమి పొలములోని గ్రామములవారేమి ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు *పంది* కొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్దరాయి దీనికి సాక్ష్యము. నేటివరకు ఆ రాయి బేత్షెమెషు వాడైన యెహోషువయొక్క పొలములో నున్నది.
కీర్తనలు 80:13: అడవి *పంది* దాని పెకలించుచున్నది పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి.
సామెతలు 11:22: వివేకములేని సుందరస్త్రీ *పంది* ముక్కుననున్న బంగారు కమ్మివంటిది.
యెషయా 65:4: వారు సమాధులలో కూర్చుండుచు రహస్యస్థలములలో ప్రవేశించుచు *పంది* మాంసము తినుచుందురు అసహ్యపాకములు వారి పాత్రలలో ఉన్నవి
యెషయా 66:3: ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే గొఱ్ఱపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువానివంటివాడే నైవేద్యము చేయువాడు *పంది* రక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటి వాడే.వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి వారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగాఉన్నవి.
యెషయా 66:17: తోటలోనికి వెళ్లవలెనని మధ్యనిలుచున్న యొకని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచు కొనుచున్నవారై *పంది* మాంసమును హేయవస్తు వును *పంది* కొక్కులను తినువారును ఒకడును తప్పకుండ నశించెదరు ఇదే యెహోవా వాక్కు.
2పేతురు 2:22: కుక్కతన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన *పంది* బురదలో దొర్లుటకు మళ్లి నట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి