😍 *బైబిల్ లో అద్భుతం*😍
🦊 *నక్క* అనే మాట బైబిల్ లో *22* సార్లు వ్రాయబడింది
న్యాయాధిపతులు 15:4: పోయి మూడు వందల *నక్క* లను పట్టుకొని దివిటీలను తెప్పించి తోక తట్టు తోకను త్రిప్పి రెండేసి తోకలమధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి
యోబు 30:29: నేను *నక్క* లకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని.
కీర్తనలు 44:19: అయితే *నక్క* లున్నచోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు గాఢాంధకారముచేత మమ్మును కప్పియున్నావు
కీర్తనలు 63:10: బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు *నక్క* లపాలగుదురు.
పరమగీతము 2:15: మన ద్రాక్షతోటలు పూతపట్టియున్నవి ద్రాక్షతోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంట *నక్క* లను పట్టుకొనుడి.
యెషయా 13:21: *నక్క* లు అక్కడ పండుకొనును గురుపోతులు వారి యిండ్లలో ఉండును నిప్పుకోళ్లు అక్కడ నివసించును కొండమేకలు అక్కడ గంతులు వేయును
యెషయా 13:22: వారి నగరులలో *నక్క* లును వారి సుఖవిలాస మందిర ములలో అడవికుక్కలును మొరలిడును ఆ దేశమునకు కాలము సమీపించియున్నది దాని దినములు సంకుచితములు.
యెషయా 34:14: అడవిపిల్లులును *నక్క* లును అచ్చట కలిసికొనును అచ్చట అడవిమేక తనతోటి జంతువును కనుగొనును అచ్చట చువ్వపిట్ట దిగి విశ్రమస్థలము చూచుకొనును
యెషయా 35:7: ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును *నక్క* లు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.
యిర్మియా 9:11: యెరూషలేమును పాడు దిబ్బలుగాను *నక్క* లకు చోటుగాను నేను చేయు చున్నాను, యూదాపట్టణములను నివాసిలేని పాడు స్థలముగా చేయుచున్నాను.
యిర్మియా 10:22: ఆలకించుడి, ధ్వని పుట్టుచున్నది, దాని రాక ధ్వని వినబడుచున్నది, యూదా పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును, *నక్క* లకు చోటుగా చేయుటకును ఉత్తరదేశమునుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది.
యిర్మియా 14:6: అడవి గాడిదలును చెట్లులేని మెట్టలమీద నిలువబడి *నక్క* లవలె గాలి పీల్చుచున్నవి, మేత ఏమియు లేనందున వాటి కన్నులు క్షీణించు చున్నవి.
యిర్మియా 49:33: హాసోరు చిరకాలము పాడై *నక్క* లకు నివాస స్థల ముగా ఉండును అక్కడ ఏ మనుష్యుడును కాపురముండడు ఏ నరుడును దానిలో బసచేయడు.
యిర్మియా 50:39: అందుచేతను అడవిపిల్లులును *నక్క* లును అక్కడ నివ సించును నిప్పుకోళ్లును దానిలో నివాసముచేయును ఇకమీదట అది ఎన్నడును నివాసస్థలము కాకపోవును తరతరములు దానిలో ఎవరును కాపురముండరు.
యిర్మియా 51:37: బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును *నక్క* లకు నివాసస్థలమగును అది పాడై యెగతాళికి కారణముగా ఉండును.
విలాపవాక్యములు 4:3: *నక్క* లైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి యెడారిలోని ఉష్ట్రపక్షులవలె క్రూరురాలాయెను.
విలాపవాక్యములు 5:18: *నక్క* లు దానిమీద తిరుగులాడుచున్నవి మా కన్నులు దీని చూచి మందగిలెను.
యెహేజ్కేలు 13:4: ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండు *నక్క* లతో సాటిగా ఉన్నారు.
మీకా 1:8: దీని చూచి నేను కేకలు వేయుచు ప్రలాపించుచున్నాను, ఏమియు లేకుండ దిగం బరినై *నక్క* లు అరచునట్లు అరచుచున్నాను. నిప్పుకోడి మూల్గునట్లు మూల్గుచున్నాను.
మలాకీ 1:3: ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్య మందున్న *నక్క* ల పాలు చేసితిని.
మత్తయి 8:20: అందుకు యేసు *నక్క* లకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను.
లూకా 9:58: అందుకు యేసు *నక్క* లకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి