😍 *బైబిల్ లో అద్భుతం*😍
🐍 *పాము* అనే మాట బైబిల్ లో *24* సార్లు వ్రాయబడింది
ఆదికాండము 49:17: దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్ల *పాము* గాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును.
నిర్గమకాండము 7:15: ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్లుము, ఇదిగో అతడు ఏటిదరికి పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటియొడ్డున నిలిచి *పాము* గా చేయబడిన కఱ్ఱను చేతపట్టుకొని
ద్వితియోపదేశకాండము 8:15: తాపకరమైన *పాము* లును తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన ఆ గొప్ప అరణ్య ములో ఆయన నిన్ను నడిపించెను, రాతిబండనుండి నీకు నీళ్లు తెప్పించెను,
ద్వితియోపదేశకాండము 32:24: వారు కరవుచేత క్షీణించుదురు మంటచేతను క్రూరమైన హత్యచేతను హరించి పోవు దురు బురదలో ప్రాకు *పాము* ల విషమును మృగముల కోరలను వారిమీదికి రప్పించెదను.
ద్వితియోపదేశకాండము 32:33: వారి ద్రాక్షారసము క్రూరసర్పముల విషము నాగు *పాము* ల క్రూరవిషము.
యోబు 20:14: అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారిలోపట నాగు *పాము* ల విషమగును.
యోబు 20:16: వారి కడుపులోనుండి దేవుడు దాని కక్కించును.వారు కట్ల *పాము* ల విషమును పీల్చుదురునాగు *పాము* నాలుక వారిని చంపును.
కీర్తనలు 58:4: వారి విషము నాగు *పాము* విషమువంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను
కీర్తనలు 58:5: వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసికొనునట్టి చెవిటి *పాము* వలె వారున్నారు.
కీర్తనలు 91:13: నీవు సింహములను నాగు *పాము* లను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కె దవు.
కీర్తనలు 140:3: *పాము* నాలుకవలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవులక్రింద సర్పవిషమున్నది. (సెలా.)
సామెతలు 23:32: పిమ్మట అది సర్పమువలె కరచును కట్ల *పాము* వలె కాటువేయును.
ప్రసంగి 10:8: గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును; కంచె కొట్టువానిని *పాము* కరుచును.
ప్రసంగి 10:11: మంత్రపు కట్టులేక *పాము* కరిచినయెడల మంత్రగానిచేత ఏమియు కాదు.
యెషయా 11:8: పాలుకుడుచుపిల్ల నాగు *పాము* పుట్టయొద్ద ఆట్లా డును మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును
యెషయా 30:6: దక్షిణ దేశములోనున్న క్రూరమృగములను గూర్చిన దేవోక్తి సింహీ సింహములును *పాము* లును తాపకరమైన మిడునాగులు నున్న మిక్కిలి శ్రమ బాధలుగల దేశముగుండ వారు గాడిదపిల్లల వీపులమీద తమ ఆస్తిని ఒంటెల మూపులమీద తమ ద్రవ్యములను ఎక్కించు కొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసికొని పోవుదురు.
యిర్మియా 46:22: శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు మ్రానులు నరుకువారివలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదికి వచ్చుచున్నారు ఆలకించుడి ఆమె ధ్వని ప్రాకిపోవు *పాము* చప్పుడు వలె వినబడుచున్నది యెహోవా వాక్కు ఇదే
ఆమోసు 5:19: ఒకడు సింహము నొద్దనుండి తప్పించు కొనగా ఎలుగు బంటి యెదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోయి గోడమీద చెయ్యివేయగా *పాము* వాని కరచి నట్టు ఆ దినముండును.
మత్తయి 7:9: మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల *పాము* నిచ్చునా?
మత్తయి 10:16: ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక *పాము* లవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.
మార్కు 16:18: *పాము* లను ఎత్తి పట్టుకొందురు, మరణకర మైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను.
లూకా 10:19: ఇదిగో *పాము* లను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు.
లూకా 11:11: మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా *పాము* నిచ్చునా? గుడ్డునడిగితే తేలు నిచ్చునా?
ప్రకటన గ్రంథం 9:19: ఆ గుఱ్ఱముల బలము వాటి నోళ్లయందును వాటి తోకల యందును ఉన్నది, ఎందుకనగా వాటి తోకలు *పాము* లవలె ఉండి తలలు కలిగినవైనందున వాటిచేత అవి హాని చేయును.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి