😍 *బైబిల్ లో అద్భుతం*😍
🐶 *కుక్క* అనే మాట బైబిల్ లో *44* సార్లు వ్రాయబడింది
నిర్గమకాండము 11:7: యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచు నని మీకు తెలియబడునట్లు, మనుష్యులమీదగాని జంతు వులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక *కుక్క* యు తన నాలుక ఆడించదు.
నిర్గమకాండము 22:31: మీరు నాకు ప్రతిష్ఠింపబడినవారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక *కుక్క* లకు దాని పారవేయవలెను.
ద్వితియోపదేశకాండము 23:18: పడుపుసొమ్మునేగాని *కుక్క* విలువనేగాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా యింటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవు డైన యెహోవాకు హేయములు.
న్యాయాధిపతులు 7:5: అతడు నీళ్లయొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా *కుక్క* గతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకుమోకాళ్లూని క్రుంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను.
1సమూయేలు 17:43: ఫిలిష్తీయుడుకఱ్ఱ తీసి కొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను *కుక్క* నా? అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపిం చెను.
1సమూయేలు 24:14: ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చి యున్నాడు? ఏపాటివానిని తరుముచున్నాడు? చచ్చిన *కుక్క* నుగదా? మిన్నల్లిని గదా?
2సమూయేలు 3:8: అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొనినిన్ను దావీదు చేతి కప్పగింపక నీ తండ్రియైన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన *కుక్క* తో సమానునిగాచేసి యీ దినమున ఒక స్త్రీనిబట్టి నామీద నేరము మోపుదువా?
2సమూయేలు 9:8: అతడు నమస్క రించిచచ్చిన *కుక్క* వంటివాడనైన నాయెడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటివాడను? అనెను.
2సమూయేలు 16:9: సెరూయా కుమారుడైన అబీషైఈ చచ్చిన *కుక్క* నా యేలినవాడవును రాజవునగు నిన్ను శపింపనేల? నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చెదననెను.
1రాజులు 14:11: పట్టణమందు యరొబాము సంబంధులలో మరణమగువారిని *కుక్క* లు తినును; బయట భూమిలో మరణమగువారిని ఆకాశపక్షులు తినును; యెహోవా మాటయిచ్చి యున్నాడు.
1రాజులు 16:4: పట్టణమందు చనిపోవు బయెషా సంబంధికులను *కుక్క* లు తినును; బీడుభూములలో చనిపోవు వాని సంబంధికులను ఆకాశపక్షులు తినును అనెను.
1రాజులు 21:19: నీవు అతని చూచి యీలాగు ప్రకటిం చుముయెహోవా సెలవిచ్చునదేమనగాదీని స్వాధీన పరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివిగదా. యెహోవా సెలవిచ్చునదేమనగాఏ స్థలమందు *కుక్క* లు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే *కుక్క* లు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను.
1రాజులు 21:23: మరియు యెజెబెలునుగూర్చి యెహోవా సెలవిచ్చున దేమనగాయెజ్రెయేలు ప్రాకారమునొద్ద *కుక్క* లు యెజెబెలును తినివేయును.
1రాజులు 21:24: పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను *కుక్క* లు తినివేయును; బయటిభూములలో చచ్చువారిని ఆకాశపక్షులు తినివేయును అని చెప్పెను
1రాజులు 22:38: వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున *కుక్క* లు వచ్చి అతని రక్తమును నాకెను.
2రాజులు 8:13: అందుకు హజాయేలు *కుక్క* వంటివాడనగు నీ దాసుడనైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషానీవు సిరియామీద రాజవగుదువని యెహోవా నాకు బయలుపరచి యున్నాడనెను.
2రాజులు 9:10: యెజెబెలు పాతి పెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు *కుక్క* లచేత తినివేయబడును. ఆ యౌవనుడు ఈ మాటలు చెప్పి తలుపుతీసి పారిపోయెను.
2రాజులు 9:36: వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లనెనుఇది యెజెబెలని యెవరును గుర్తుపట్టలేకుండ యెజ్రెయేలు భూభాగమందు *కుక్క* లు యెజెబెలు మాంసమును తినును.
యోబు 30:1: ఇప్పుడైతే నాకన్న తక్కువ వయస్సుగలవారు నన్ను ఎగతాళి చేయుదురు.వీరి తండ్రులు నా మందలు కాయు *కుక్క* లతో నుండుటకు తగనివారని నేను తలంచియుంటిని.
కీర్తనలు 22:16: *కుక్క* లు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు.
కీర్తనలు 22:20: ఖడ్గమునుండి నా ప్రాణమును *కుక్క* ల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము.
కీర్తనలు 59:6: సాయంకాలమున వారు మరల వచ్చెదరు *కుక్క* వలె మొరుగుచు పట్టణముచుట్టు తిరుగుదురు.
కీర్తనలు 59:14: సాయంకాలమున వారు మరల వచ్చెదరు *కుక్క* వలె మొరుగుచు పట్టణముచుట్టు తిరుగుదురు
కీర్తనలు 68:23: వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు నీ శత్రువులు నీ *కుక్క* ల నాలుకలకు భాగమగుదురు.
సామెతలు 26:11: తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు కక్కినదానికి తిరుగు *కుక్క* తో సమానుడు.
సామెతలు 26:17: తనకు పట్టని జగడమునుబట్టి రేగువాడు దాటిపోవుచున్న *కుక్క* చెవులు పట్టుకొనువానితో సమానుడు.
సామెతలు 30:31: శోణంగి *కుక్క,* మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు.
ప్రసంగి 9:4: బ్రదికి యుండువారితో కలిసి మెలిసియున్నవారికి ఆశ కలదు; చచ్చిన సింహముకంటె బ్రదికియున్న *కుక్క* మేలు గదా.
యెషయా 13:22: వారి నగరులలో నక్కలును వారి సుఖవిలాస మందిర ములలో అడవి *కుక్క* లును మొరలిడును ఆ దేశమునకు కాలము సమీపించియున్నది దాని దినములు సంకుచితములు.
యెషయా 34:13: ఎదోము నగరులలో ముళ్లచెట్లు పెరుగును దాని దుర్గములలో దురదగొండ్లును గచ్చలును పుట్టును అది అడవి *కుక్క* లకు నివాసస్థలముగాను నిప్పుకోళ్లకు సాలగాను ఉండును
యెషయా 43:20: నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్య ములో నీళ్ళు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులును అడవి *కుక్క* లును నిప్పుకోళ్లును నన్ను ఘనపరచును
యెషయా 56:10: వారి కాపరులు గ్రుడ్డివారు వారందరు తెలివిలేనివారు వారందరు మూగ *కుక్క* లు మొరుగలేరు కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు.
యెషయా 56:11: *కుక్క* లు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తిలేదు. ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరు తమకిష్టమైన మార్గమున పోవుదురు ఒకడు తప్పకుండ అందరు స్వప్రయోజనమే విచా రించుకొందురు.
యెషయా 66:3: ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే గొఱ్ఱపిల్లను బలిగా అర్పించువాడు *కుక్క* మెడను విరుచువానివంటివాడే నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటి వాడే.వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి వారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగాఉన్నవి.
యిర్మియా 15:3: యెహోవా వాక్కు ఇదేచంపుటకు ఖడ్గము, చీల్చుటకు *కుక్క* లు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశపక్షులు భూమృగములు అను ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించియున్నాను.
మత్తయి 7:6: పరిశుద్ధమైనది *కుక్క* లకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చి వేయును.
మత్తయి 15:26: అందుకాయనపిల్లల రొట్టెతీసికొని *కుక్క* పిల్లలకువేయుట యుక్తము కాదని చెప్పగా
మత్తయి 15:27: ఆమెనిజమే ప్రభువా, *కుక్క* పిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను.
మార్కు 7:27: ఆయన ఆమెను చూచిపిల్లలు మొదట తృప్తి పొందవలెను; పిల్లల రొట్టె తీసికొని *కుక్క* పిల్లలకు వేయుట యుక్తము కాదనెను.
మార్కు 7:28: అందుకామెనిజమే ప్రభువా, అయితే *కుక్క* పిల్లలు కూడ బల్లక్రింద ఉండి, పిల్లలు పడ వేయు రొట్టెముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను.
లూకా 16:21: అతని బల్లమీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను; అంతేకాక *కుక్క* లు వచ్చి వాని కురుపులు నాకెను.
ఫిలిప్పీయులకు 3:2: *కుక్క* ల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి.
2పేతురు 2:22: *కుక్క* తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లి నట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.
ప్రకటన గ్రంథం 22:15: *కుక్క* లును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి