క్రూరమృగము పార్ట్.2
🎯🎯🎯🎯🎯🎯🎯🎯
అయితే, ప్రకటన గ్రంధములో ఈ క్రూరమృగమును గురించిన మరికొంత సమాచారాన్ని తెలుసుకోగలం.
* పది కొమ్ములు
* ఏడు తలలు
* దాని కొమ్ములమీద పది కిరీటములు
* దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లు
* ఆ మృగము చిరుతపులిని పోలియుండెను.
* దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి
* దాని నోరు సింహపునోరు వంటిది
* దానికి ఆ ఘటసర్పము (సాతాను), తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఆ మృగమునకు (అంత్య క్రీస్తుకు) ఇచ్చెను.
* డంబపు మాటలు మాట్లాడుతాడు.
* దేవ దూషణ చేస్తాడు.
* పరిశుద్ధులతో యుద్ధం చేసి జయిస్తాడు.
* ప్రతీ జనము మీద మూడున్నర సంవత్సరాలు సంపూర్ణ అధికారం కలిగివుంటాడు.
ప్రకటన 13:1-7
*ఎవరీ క్రూరమృగము?*
అంత్య క్రీస్తు ( క్రూరమృగము వంటి స్వభావము కలిగిన వాడు)
*పది కొమ్ములు*
ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పదిమంది రాజులను సూచించుచున్నవి;
దానియేలు 7:24
( ఆ రాజ్యము నుండి అనగా? దానియేలుగారికి అనుగ్రహించబడిన దర్శనము ప్రకారము, “రోమా సామ్రాజ్యము నుండి”)
నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. (ప్రకటన 17:12)
*ఏడు తలలు:*
⭕⭕⭕⭕⭕
🎯a) *ఆ యేడు తలలు ఆ స్త్రీ కూర్చున్న యేడు కొండలు;* (ప్రకటన 17:9)
రోమ్ పట్టణము టైబర్ నది ఒడ్డున గల “ “యేడు కొండలపైన” కట్టబడివున్నది.
🎯b) *ఆ యేడు తలలు ఏడుగురు రాజులు*
మరియు ఏడుగురు రాజులు కలరు; అయిదుగురు కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను.
ప్రకటన 17:10
ఆయా కాలములలో రోమ్ ని పాలించిన ఏడుగురు రాజులకు సూచన. ఐదుగురు గతించిపోయారు. వున్నవాడు ఆరవవాడు, అతడు డొమిషియన్, ఇక ఏడవవాడు యుగాంతమందు వచ్చును అనే అభిప్రాయము కలదు.
*క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట:*
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
🎯a) సముద్రము అంటే?
భక్తిహీనుల సమూహం
భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును.
యెషయా 57:20
మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెనుఆ వేశ్య కూర్చున్నచోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జన ములను, ఆ యా భాషలు మాటలాడువారిని సూచించును.
ప్రకటన 17:15
అంటే? క్రూర మృగము భక్తిహీనుల సమూహంలోనుండి పుట్టుకొస్తుంది
🎯b) మధ్యధరా సముద్ర తీరాన గలిగిన దేశాలు, యూరోపియన్ సమాజ కూటిమి నుండి, క్రూరమృగము వస్తుందనేది మరికొందరి అభిప్రాయముగా వుంది.
దాని కొమ్ములమీద పది కిరీటములు ఉండెను:*
“పది కిరీటములు” పది రాజ్యాలకుండే అధికారాన్ని సూచిస్తుంది.దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను:దేవునిని నిందించుట ఈ క్రూరమృగము యొక్క ముఖ్యపనియై యుండెను.
ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచు కొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి.
2 థెస్స 2:4
ఆ రాజుమహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహో న్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాల ములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు.
దానియేలు 7:25
ఆ సైన్యముయొక్క అధిపతికి విరోధ ముగా తన్ను హెచ్చించుకొని, అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై యొక సేన అతనికియ్య బడెను. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టాను సారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను.
దానియేలు 8:11,12
అతడు ఒక వారమువరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; అర్ధవారమునకు బలిని నైవేద్య మును నిలిపివేయును హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఈలాగున జరుగును.
దానియేలు 9:27
*ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి, దాని నోరు సింహపునోరువంటిది*:
దానియేలుగారు చూచిన దర్శనములో
🔸* చిరుతపులి - గ్రీకు సామ్రాజ్యానికి,
(అలెగ్జాన్డర్ ఏకఛత్రాధిపత్యానికి)
🔸* ఎలుగుబంటి - మాదీయ, పారసీక
( అవినీతి )
🔸* సింహము - బబులోనుకు
(నెబుకద్నెజరు గర్వము)నకు సూచనగా వున్నాయి. అయితే, ఈ క్రూరమృగానికి ( రోమా సామ్రాజ్యం నుండి పుట్టుకొస్తున్న అంత్య క్రీస్తుకు) వీటన్నిటితోపాటు మరికొన్ని, అదనపు, భయంకరమైన లక్షణాలు కలిగివుంది.
*దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను:*
దానికి అనగా, క్రూరమృగానికి (అంత్య క్రీస్తుకు), ఆ ఘట సర్పము (సాతాను)
తన బలమును
* తన సింహాసనమును
* గొప్ప అధికారమును ఇచ్చెను
వీటన్నిటితో మూడున్నర సంవత్సరాలు, అత్యంత నిరంకుశంగా అతని ఆధిపత్యాన్ని కొనసాగిస్తాడు.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి