ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రైస్తవ్యము వలన హాని లేదు

*క్రైస్తవ్యము వలన హాని లేదు*


నిరపాయ పత్రిక...


*ప్రభువునందు ప్రియులారా!*
*ఎవరినైనా తృణీకరింపకుండుట గొప్ప అంతస్థు.*
ఏ మతమునైనను, ఏ మనిషినైనను దూషించుట, ద్వేషించుట మా మతములోనికి వచ్చి తీరవలెనని బలవంత పెట్టుటట, భ్రమపెట్టుట మానవుల దైవమతముకాదు.

*1) దేవదూతలను, ఆకాశమును, భూమిని మనుష్యులను కలుగజేసిన సృష్టికర్తయైన దేవుని మాత్రమే ఆరాధింపవలెననియు, ప్రార్థింపవలెననియు  క్రీస్తుమతములో నున్నది. కనుక హానిలేదు.*

2. ఎవరి మీదగాని, దేనిమీదగాని ఉండవలసిన ప్రేమకన్న
దేవునిమీదనే యెక్కువ ప్రేమయుండవలెనని క్రీస్తు మతములో నున్నది గనుక హానిలేదు.
*3. దేవుని మాత్రమే నమ్మియుండవలెనని క్రీస్తు మతములో నున్నది. గనుక హానిలేదు.*

4.తల్లిదండ్రులను, పెద్దలను, అధికారులను
గౌరవించవలెనని క్రీస్తుమతములో నున్నది. కనుక హానిలేదు.

*5. ఒకరిని కొట్టకూడదనియు, చంపకూడదనియు, చంపుకొకూడదనియు క్రీస్తుమతములో నున్నది. గనుక హానిలేదు.*
6. దేవాలయముయొక్క ఆవరణములోనున్న పశువులను, పక్షులను కొట్టక క్రీస్తు వాటిని బయటకు తోలివేసెను. దీనినిబట్టి చూడగా జీవరాశులను కొట్టకుండుటయు పశ్వాదులకు ఉపకారము చేయుటకు క్రీస్తు మతముయొక్క వాడుకయైయున్నది. కనుక హానిలేదు. 

*7.బీదలకు సహాయము చేయవలెనని క్రీస్తు మతములోనున్నది కనుక హానిలేదు*
8.నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమించుమని క్రీస్తుమతములో నున్నది కనుక హానిలేదు.

*9.శరీరమును యెల్లప్పుడును శుద్ధి చేసుకొనవలెనని క్రీస్తు మతములో నున్నది గనుక హానిలేదు.*

10. స్త్రీ పురుషులలో ఒకరియెడల ఒకరికి శరీర సంబంధమైన దుర్వాంఛకూడదని క్రీస్తుమతములో నున్నది కనుక హానిలేదు.

*11.భార్యాభర్తలు నిత్యమైన ప్రేమ కలిగియుండవలెనని క్రీస్తుమతములో నున్నది కనుక హానిలేదు.*

12.తల్లిదండ్రులు తమ పిల్లలను దైవశిక్షణలోను, బోధలోను, పెంచవలెనని క్రీస్తు మతములో నున్నది కనుక హానిలేదు.

*13. వివాహము అన్ని విషయములలోను ఘనమైనదని క్రీస్తు మతములో నున్నది కనుక హానిలేదు.*

14.దొంగతనము చేయవద్దని క్రీస్తుమతములో
నున్నది. కనుక హానిలేదు. 

*15.ధనా పేక్షలేని మనస్సుగలవారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడని క్రీస్తు మతములో నున్నది కనుక హానిలేదు.*

16.అబద్ధమాడవద్దని క్రీస్తుమతములో నున్నది. కనుక హానిలేదు.

*17.క్రీస్తుసువార్త ఒక దేశముననే కాక అన్ని దేశములకు అనగా లోకమంతటికిని ప్రకటింపవలెనని క్రీస్తు మతములో నున్నది. కనుక హానిలేదు* (సువార్త అనగా హానిచేయని మంచి సందేశము)

*18. క్రైస్తవమతము ఆచరించవలసిన వాటివలన హానిలేదు.*
అవేవనగా:- 

1) ప్రతి దినము బైబిలు అను థము
చదివి దేవుని చిత్తమును తెలుసుకొనవలెను. 
*2) అనుదినము కుటుంబములోనివారు కూడుకొని దైవ ప్రార్థన చేసుకొనవలెను.*
3) తమ్మును గురించి మాత్రమే కాక లోకవాస్తవ్యులందరిని
గురించియు, అన్ని అంశములను గురించియు దేవుని
ప్రార్థింపవలెను. 
*4)బైబిలు చెప్పుచున్న బోధ ప్రకారము నడుచుకొనుటకు ప్రయత్నింపవలెను.*

5) తమకు తెలిసిన విషయములు యితరులకు చెప్పుచుండవలెను. మరియు తమ అనుభవమును గురించియు ఇతర క్రైస్తవుల అనుభవము
గురించియు ఇతరులకు ప్రకటింపవలెను. 
*6) ఆరాధన దినమున సహక్రైస్తవులతో కలిసి దేవాలయమునకు వెళ్ళవలయును.*
 
7) మతాభివృద్ధి నిమిత్తమును, అక్కరలో ఉన్నవారి నిమిత్తమును చందాలు వేయుచుండవలయును. 

*8) మత విషయములను హెచ్చరించు సమాజములకు వెళ్ళుచుండవలయును.*

 9) దైవభక్తిని వృద్ధిచేసికొనుటకు మంచి మంచి పుస్తకములను, పత్రికలను చదువుచుండవలెను. 

*10) రోగులను, కష్టస్థితులోనున్న వారిని పరామర్శింపవలెను.*

11) శత్రువులను ప్రేమింపవలెను. వారిని దీవించవలెను, వారికొరకు ప్రార్ధించవలెను, వారికి ఉపకారములు చేయవలెను.
 ఇంకా అనేకములున్నవి.

*19.కష్టసుఖములు దేవునికి తెలియజేయుటకై శాంతార్ధమైన ప్రార్థనలు అనుదినము చేయుట క్రైస్తవమత పద్ధతి. కనుక హానిలేదు.*

20) క్రీస్తు ప్రభువు లోకము యొక్క భారము ఎత్తుకొనెను. 

*1) “సమస్తమైన వారలారా! నాయొద్దకు రండి” అని క్రీస్తు అందరిని పిలిచినాడు.*
అలాగే క్రైస్తవ సంఘముకూడ అందరిని తనయొద్దకు రమ్మని పిలుచుచున్నది.
 
*2) శత్రువుల క్షేమము కొరకు క్రీస్తు ప్రార్థించెను.*
అలాగే క్రైస్తవమతముకూడ అందరి క్షేమము కొరకు ప్రార్థించుచున్నది.

*3) క్రీస్తు తన విషయములు అందరికి ప్రకటించవలెనని చెప్పెను.*
అలాగే సంఘము కూడ అందరికి క్రీస్తుబోధ వినిపించుచున్నది.

*4) క్రీస్తు ఉపకార కార్యములు చేసెను.*
 అలాగే క్రైస్తవమతముకూడ ఉపకార కార్యములు చేయుచున్నది. 
ఈ ఉపకార కార్యముల జాబితా అన్ని
దేశములవారికి తెలిసిన విషయమే.

*షరా:- అందరిని పిలుచుటలోను, అందరికొరకు ప్రార్థన చేయుటలోను, అందరికి బోధించుటలోను, అందరికి ఉపకార కార్యము చేయుటలోను, క్రీస్తువలె సంఘముకూడ లోకభార మెత్తుకొని యున్నది. కనుక హానిలేదు.*

21) క్రీస్తునకు గొట్టెపిల్ల అను నొక *బిరుదు గలదు. గొట్టెపిల్ల హాని చేయనిది. క్రీస్తు హాని చేయనివాడు.*
“అతడు దౌర్జన్యమునొందెను బాధింపబడినను అతడు నోరు తెరువలేదు.
*వధకు తేబడు గొట్టెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెడట గొట్టెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు” అని యెషయా ప్రవచించెను* (యెషయా. 53:7).

 క్రీస్తువలెనే ఆయన భక్తులసంఘమగు క్రైస్తవమతమును దౌర్జన్యమనుభవించుచున్నను మౌనముగా నున్నది. అనగా తిరిగి దౌర్జన్యము చేయనిదియై యున్నది. గనుక హానిలేదు.

*22) కొన్ని క్రైస్తవ బోధలవలన ఇతర మతములకు కోపము రాకమానదు అయినను ఆ బోధలు బైబిలునకు అనుగుణ్యముగాను, ఉపకార బుద్ధితోను చెప్పినవిగాను ఉన్నందున హానిలేదు.*

1) విగ్రహారాధన చేయకూడని బైబిలు మిగుల స్పష్టమైన
మాటలతో చెప్పుచున్నది. 
*2) భర్తలు పోయిన స్త్రీలకు వివాహము చేయుట బైబిలు ప్రకారము నిషేదముకాదు.*
 3) బాల్య వివాహము చేయుట బైబిలునకు ప్రతికూలము 
*4) కులము బైబిలునకు ప్రతికూలము.*
5) జన్మాంతర బోధ బైబిలునకు ప్రతికూలము,
*6)మనుష్యులు, జంతువులుగాను, ఇతర కులస్థులుగాను అనేక పర్యాయములు జన్మమెత్తవలెనను ఈ సిద్ధాంతము బైబిలునకుప్రతికూలము.*

7)పాపముచేసిన మనుష్యుడు మరణ సమయమందైనను దేవునియొద్ద పాపమొప్పుకొన్నయెడల వెంటనే క్షమించి మోక్షమునకు చేర్చుకొనుననునది బైబిలు సిద్ధాంతము.

*8) శక్తిపూజ ఏమాత్రమును కూడదని బైబిలు ఖండించుచున్నది*.

9) చనిపోయిన భర్తయొక్క శవముతోపాటు భార్యయు దహనము చేయుట అను మూఢచారమును బైబిలు ఖండించుచున్నది.


ప్రియ చదువరీ!!!
*క్రైస్తవ్యము వలన, క్రైస్తవులన వలన లోకానికి, దేశానికి, సమాజానికి మేలే తప్ప ఎటువంటి హాని లేదు...*


క్రీస్తును విశ్వసించి అనుసరిస్తే మోక్షమునకు సులువుగా వెళ్లగలము...


ఈ మాటలు
*ముంగమూరి దేవదాసు అయ్యగారు వ్రాసిన "నిరపాయ" పత్రిక లోనివి..*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...